Viral Video: లక్ష రూపాయలు మీకిస్తే.. 24 గంటల్లోనే ఖర్చు పెట్టమంటే నువ్వేం చేస్తావ్..?.. ఈ యువతి చెప్పింది విని నెట్టింట ఫన్నీ సెటైర్లు..!

ABN , First Publish Date - 2023-03-28T19:23:05+05:30 IST

డబ్బు అనేది ప్రతి ఒక్కరూ అత్యంత విలువ ఇచ్చే అంశం. కొంత మంది కష్టపడి సంపాదించాలని అనుకుంటే, మరికొంత మంది అదృష్టం ద్వారా పొందాలని కోరుకుంటారు. డబ్బు ఎలా వచ్చినా, ఆ మొత్తాన్ని వెంటనే ఖర్చు చేయాలంటే మాత్రం ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు.

Viral Video: లక్ష రూపాయలు మీకిస్తే.. 24 గంటల్లోనే ఖర్చు పెట్టమంటే నువ్వేం చేస్తావ్..?.. ఈ యువతి చెప్పింది విని నెట్టింట ఫన్నీ సెటైర్లు..!

డబ్బు (Money) అనేది ప్రతి ఒక్కరూ అత్యంత విలువ ఇచ్చే అంశం. కొంత మంది కష్టపడి సంపాదించాలని అనుకుంటే, మరికొంత మంది అదృష్టం ద్వారా పొందాలని కోరుకుంటారు. డబ్బు ఎలా వచ్చినా, ఆ మొత్తాన్ని వెంటనే ఖర్చు చేయాలంటే మాత్రం ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. లక్ష రూపాయాలను 24 గంటల్లో ఖర్చు పెట్టాలంటే మీరేం చేస్తారు? తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ అమ్మాయి చెప్పిన సమాధానం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది (Funny Video).

రోడ్డు మీద నిల్చున్న ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి ``మీకు లక్ష రూపాయలు (1 Lakh Rupees) ఇచ్చి ఒక్క రోజులో ఖర్చు పెట్టాలంటే ఏం చేస్తారు?`` అని అడిగాడు. దానికి ఓ అమ్మాయి సమాధానమిస్తూ.. ``ముందు షాపింగ్ చేస్తా. ఆ తర్వాత ఓ యాక్టివా స్కూటీ కొనుక్కుంటా`` అని చెప్పింది. అయితే ఆ స్కూటీని నడుపుతూ తన కాళ్లతో బ్రేకులు వేస్తానని చెప్పింది. ఆశ్చర్యపోయిన వ్యక్తి మళ్లీ అడగ్గా.. ``కాళ్లతో కాకపోతే తలతో బ్రేకులు వేస్తారా?`` అని ఆ యువతి ఎదురు ప్రశ్నించింది.

Viral Video: యువతిని పట్టుకుని లాగిన ఎలుగుబంటి.. వెన్నులో వణుకుపుడుతున్నా దాడి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిల మాస్టర్ ప్లాన్..!

స్కూటీకి బ్రేకులు కాళ్ల దగ్గర ఉండవని, హ్యాండిల్ దగ్గర ఉంటాయని చెప్పడంతో ఆ యువతి ``అవునా?`` అంటూ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ యువతి సమాధానంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

నా భార్య పుట్టింటికి వెళ్లింది.. పార్టీ చేసుకుందాం రా.. అని ఫ్రెండును పిలిచాడో వ్యక్తి.. షాకింగ్ సీన్ చూసి పక్కింటి మహిళ కేకలు పెట్టడంతో..

Updated Date - 2023-03-28T19:23:05+05:30 IST