NTR 30: తారక్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..

ABN , First Publish Date - 2023-03-05T16:37:14+05:30 IST

తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). యూత్‌లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

NTR 30: తారక్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..

తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). యూత్‌లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందువల్ల నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను మించి రాణించాలని తారక్ ఆశిస్తున్నారు. అందుకే నెక్ట్స్ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కొంచెం ఆలస్యం అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నటిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్, నందమూరి తారక రామరావు ఆర్ట్స్ కలసి నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్‌ ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. అందువల్ల మూవీ కోసం భారీస్థాయిలో సెట్స్ వేస్తున్నారు. గోవా, విశాఖ పట్నం వంటి ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయనున్నారు. కానీ, ఈ స్టంట్స్‌ను ఏ విధంగా షూట్ చేయాలో చిత్ర బృందానికి అర్థం కావడం లేదు. అందువల్ల హాలీవుడ్ నుంచి హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను రప్పించారట. ఈ టెక్నీషియన్స్ చిత్ర బృందానికి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారట. సన్నివేశాలను ఏ విధంగా చిత్రీకరించాలో సలహాలు, సూచనలు అందిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ‘ఎన్‌టీఆర్ 30’ లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రం చేసేందుకు గాను ఆమె దాదాపుగా రూ.4కోట్లను ఛార్జ్ చేశారని సమాచారం. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-05T16:40:20+05:30 IST