Share News

Heart Attacks: జిమ్ లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ లు.. డాక్టర్లు చెబుతున్న 10 షాకింగ్ కారణాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2023-10-19T11:28:14+05:30 IST

ఈ మధ్య కాలంలో పెరిగిన ఫిట్నెస్ అవగాహన కారణంగా చాలామంది ఏదో ఒకసమయంలో జిమ్ కు వెళ్లి వర్కౌట్లు చెస్తున్నారు. కానీ చాలామందికి జిమ్ లో హార్ట అటాక్ లు రావడానికి కారణం ఇదే..

Heart Attacks: జిమ్ లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ లు.. డాక్టర్లు చెబుతున్న 10 షాకింగ్ కారణాల లిస్ట్ ఇదీ..!

ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని అంటారు. ఈ మధ్య కాలంలో పెరిగిన ఫిట్నెస్ అవగాహన కారణంగా చాలామంది ఏదో ఒకసమయంలో జిమ్ కు వెళ్లి వర్కౌట్లు చెస్తున్నారు. ట్రెడ్ మిల్ మీద వాకింగ్, రన్నింగ్ చేయడంతో పాటు బరువులు ఎత్తడం, పుషప్స్, క్రంచెస్ వంటి చాలా రకాల వ్యాయామాలు చేస్తూ కండరసామర్థ్యాన్ని బలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో అందరినీ భయాందోళనకు గురిచేస్తున్న విషయం వర్కౌట్లు చేస్తూనే చాలామంది గుండెపోటు బారిన పడటం. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే వర్కౌట్లు చేస్తూ గుండె పోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. ఆయనలా ప్రాణాలు కోల్పోయినవారు, కోల్పోతున్నవారు మరెందరో ఉన్నారు. అసలు జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగానే హర్ట్ అటాక్ ఎందుకు వస్తోంది? దీనివెనుక గల 10కారణాలను వైద్యులు వివరిస్తున్నారు. జిమ్ కు వెళ్లి ప్రతిరోజూ వ్యాయామాలు చేసేవారు తప్పనిసరిగా తెలుసుకోవాలసిన విషయాలివి. అవేంటో చూస్తే..

ట్రెడ్ మిల్ మీద వ్యాయామం చేసేటప్పుడు గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల రక్తప్రవాహం తగ్గుతుంది. ఇది గుండెపోటుకు కారణం అవుతుంది.

సాధారణంగా శారీరక శ్రమ అలవాటు లేకుండా కేవలం జిమ్ లో మాత్రమే కష్టపడేవారిలో గుండెమీద అధిక ఒత్తిడి ఉంటుంది. అధికవేగంతో చేసే వ్యాయామంలో గుండెకు ఆక్సిజన్, పోషకాలు అధికంగా అవసరం అవుతాయి. అందుకే వ్యాయామానికి తగ్గట్టు డైట్ తీసుకోమంటారు. సరైన డైట్ లేకుండా చేసే అతివ్యాయామం గుండెపోటుకు కారణం అవుతుంది.

Success Story: ఈ ఫొటోలోని మహిళ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తోంది.. అసలు ఆమె ఏం చేస్తే ఇంత డబ్బు వస్తోందంటే..!



వ్యాయామం చేసేవారు వార్మప్, వార్మౌట్ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. వార్మప్ వల్ల శరీరంలో వివిధ అవయవాలు వ్యాయామానికి సంసిద్దమవుతాయి. వార్మప్ ను విస్మరిస్తే గుండెమీద అకస్మాత్తుగా కలిగే ఒత్తిడి గుండెపోటుకు కారణం అవుతుంది.

కోపం, అసహనం, చిరాకు వంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నపుడు వ్యాయామం చేస్తే అది వ్యాయామం మీదకు మళ్లుతుంది. ఫలితంగా వ్యాయామాన్ని చాలా భీభత్సంగా మార్చే అవకాశం ఉంది. ఇలా వ్యాయామం చేసేటప్పుడు అడ్రినల్ వంటి హార్మోన్ల విడుదల ఎక్కువ జరిగి అది గుండెపోటుకు దారితీస్తుంది.

వ్యాయామం చేసేవారు వారి వయసును వారి కుటుంబ చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ వ్యాధులు ఉంటే వ్యాయామం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

శరీరం హైడ్రేట్ గా ఉండటం వల్ల వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో తేమ, ఖనిజాలు, లవణాలు చెమటరూపంలో కోల్పోయినా పెద్దగా నష్టం వాటిల్లదు. కానీ శరీరంలో నీటిశాతం తక్కువైతే గుండె పంప్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది, కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుంది.

వ్యాయామం చేసే తీరు చాలాముఖ్యం. ప్రతి వ్యాయామానికి ఓ పద్దతి ఉంటుంది. ఓ భంగిమ ఉంటుంది. దానిని అనుసరించకుండా చేసే వ్యాయామాలు గుండె మీద ఒత్తిడి పెంచుతాయి.

ట్రెడ్ మిల్ మీద వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేస్తున్నప్పుడు ఛాతీనొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వ్యాయామం ఆపేయాలి. లేకపోతే అది గుండెపోటుకు దారితీస్తుంది.

వృద్దులు, గుండె సంబంధ వ్యాధుల చరిత్ర కలిగిన వారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివారు పర్యవేక్షకుల సహాయం లేకుండా వ్యాయామం చేయరాదు.

చుట్టుప్రక్కల ఎవరూలేకుండా ఒంటరిగా అతి వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యనష్టం ఎక్కువగా వాటిల్లుతుంది. గుండెపోటు వచ్చినా ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రయత్నం లేకుండానే మరణాలు సంభవిస్తాయి.

Health Facts: రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటుంటారా..? మధుమేహం తప్పక వస్తుంది అనడానికి 5 కారణాలు..!


Updated Date - 2023-10-19T11:28:14+05:30 IST