Share News

Success Story: ఈ ఫొటోలోని మహిళ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తోంది.. అసలు ఆమె ఏం చేస్తే ఇంత డబ్బు వస్తోందంటే..!

ABN , First Publish Date - 2023-10-18T12:06:51+05:30 IST

భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే నేడు నెలకు 10లక్షలు తెచ్చిపెడుతోంది. ఆమె విజయగాద వింటే జీవితం మీద ఆశ చిగురిస్తుంది.

Success Story: ఈ ఫొటోలోని మహిళ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తోంది.. అసలు ఆమె ఏం చేస్తే ఇంత డబ్బు వస్తోందంటే..!

డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. సరైన దారి వెతుక్కుంటే మంచి సంపాదన సాధ్యమే. అధిక శాతం మంది ఆ దారి వెతుక్కోవడంలో ఫెయిల్ అవుతారు. కానీ రచన మాత్రం తను ఎంచుకున్న దారి ది బెస్ట్ అని నిరూపించింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను ఆర్ఠిక సమస్యలు చుట్టుముడితే తన కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ధైర్యంగా అడుగులు వేసింది. దాని ఫలితమే ఆమె సక్సెస్. ఏడాది తిరేగేసరికల్లా నెలకు అక్షరాలా 10లక్షలదాకా సంపాదిస్తూ కుటుంబాన్ని కష్టాల నుండి గట్టెక్కించింది. ఉద్యోగం సంపాదన లేదని నిరుత్సాహపడే యువతను సైతం ఉత్సాహపరిచే రచన జీవితం, ఆమె రచించుకున్న వ్యూహం, ఆమె సక్సెస్ గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జీవితం చాలా సంతోషంగా ఉంది అనుకున్నప్పుడు కష్టాలు వస్తుంటాయి. చాలామంది మహిళలు మంచి భర్త, చక్కని పిల్లలు ఉంటే జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అనుకుంటారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని షాజహాపూర్ కు చెందిన రచన కూడా అలాంటి మహిళే. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా తృప్తిగా ఉండేది. కానీ ఆమె సంతోషాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఆమె భర్తకు అనారోగ్యం వచ్చింది. అది కేవలం కొన్ని రోజులో, వారాలో ఉండకుండా దీర్ఘకాలం అతన్ని వేదించింది. అతన్ని బాగుచేసుకునే క్రమంలో ఆస్తులు, బంగారం, డబ్బు మొత్తం ఖర్చైపోయాయి. వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది. చివరకి రచన భర్త 2018లో మరణించాడు. అతను మరణించిన సమయంలో రచన ఇంట్లో డబ్బు లేదు. తెలిసిన వారు తలా ఒక చెయ్యి వేసి అంతిమసంస్కారాలు జరిపించారు. ఆ తరువాత కుటుంబం గడవడం పెద్ద సవాల్ గా మారింది. అప్పుడే రచన నీరుగారిపోకుండా తెలివిగా ఆలోచించింది.

Viral News: అమ్మ బాబోయ్.. ఎక్కువగా చదువుకుంటే ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు..!



కుటుంబాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి తనే ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంది. ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకం కింద 25లక్షల లోన్ తీసుకుంది. అందులో 14.5లక్షలతో ఇంట్లోనే పేపర్ బ్యాగ్ తయారీ(paper bag making) యంత్రాన్ని కొనుగోలు చేసింది. మిగిలిన డబ్బుతో ముడిసరుకులను కొని స్వయంగా పేపర్ బ్యాగులు తయారుచేయడం మొదలుపెట్టింది. ఆమె వ్యక్తిగతంగానే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాలలో కూడా పేపర్ బ్యాగులను విక్రయిస్తుంది. 2022లో ఈ పేపర్ బ్యాగ్ తయారీ యూనిట్ ప్రారంభించిన ఈమె ఏడాదిన్నరకాలంలో వ్యాపారాన్ని అనూహ్యంగా విస్తరింపజేసుకుంది. ఆమె కింద ఇప్పుడు 36మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆదాయం నెలకు 8నుండి 10లక్షలు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అవగాహన ఒప్పందం కింద 5కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈమె అంగీకరించింది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకు ఈ మార్గం సరిపోతుందని, తన భర్త మరణం తరువాత తాను అన్నీకోల్పోయిన అనుభూతికి లోనైనప్పటికి తన కొడుకును చూసి ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

Shocking: ఎన్నిసార్లు ఫోన్ చేసినా బయటకు రావడం లేదని.. అసలు ఆమెకు ఇల్లే లేకుండా చేసిన ప్రియుడు.. బాంబులేసి కూల్చేశాడు..!


Updated Date - 2023-10-18T12:06:51+05:30 IST