Share News

Viral News: అమ్మ బాబోయ్.. ఎక్కువగా చదువుకుంటే ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు..!

ABN , First Publish Date - 2023-10-17T14:42:01+05:30 IST

ఎంత ఎక్కవ చదువుకుంటే అంత మంచి భవిష్యత్తు అనేది ఒకప్పటి మాట.ఇప్పుడు బయటపడిన షాకింగ్ నిజాలు ఇవీ..

Viral News: అమ్మ బాబోయ్.. ఎక్కువగా చదువుకుంటే ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు..!

ఎంత చక్కగా చదువుకుంటే అంత గొప్పవారు అవుతారు అంటారు. అందుకే చిన్నప్పటినుండే పిల్లలను బాగా చదువుకోమని చెబుంతుంటారు తల్లిదండ్రులు. దీనికి తగ్గట్టే కష్టమైనా కార్పోరేట్ స్కూళ్లు, ట్యూషన్లు అంటూ పిల్లలను తరుముతుంటారు. ఇక పిల్లలు పెరిగేకొద్ది CBSC కోచింగ్, సివిల్ కోచింగ్, ఎంసెట్ కోచింగ్ అంటూ ముందే పిల్లల మీద ఒత్తిడి తెస్తారు.ఈ క్రమంగా చదువు నుండి ఉద్యోగాలు, ఉద్యోగాల నుండి లక్ష్యాల వైపు పాకుతూనే ఉంటుంది. ఎంత ఎక్కవ చదువుకుంటే అంత మంచి భవిష్యత్తు అనేది ఒకప్పటి మాట. ఎంత ఎక్కువగా చదువుకుంటే అన్ని మానసిక సమస్యలు వస్తాయనే షాకింగ్ నిజాలను పరిశోధకులు బయటపెట్టారు. అసలు బాగా చదువుకుంటే మానసిక సమస్యలకు దారితీయడమేంటో పూర్తీగా తెలుసుకుంటే..

ఒత్తిడి లేని విద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ నేటి పోటీ వ్యవస్థలో చదువులో దూకుడు లేకపోతే పిల్లలు వెనుకబడిపోతారనే అభిప్రాయం ఉంది. ఇంట్లో తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులు చుట్టాలు, ఇరుగుపొరుగు.. ఇలా అందరూ ప్రతిభ గురించి మాట్లాడేవారే. ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకే వయసు కలిగిన చదువుకుంటున్న, చదువుకోని పిల్లలను పరిశీలించినట్టైతే చదువుకుంటున్న పిల్లలలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని తెలిసింది.

Milk tea or Black tea: బ్లాక్ టీ బెస్టా..? పాలతో చేసిన టీ మంచిదా..? రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!


ముఖ్యంగా 18-19సంవత్సరాల వయసు కలిగిన వారికి మొదట్లో కాస్త అయోమయం తొలగించి, వారి మానసిక ఆరోగ్యానికి కృషి చేయాలి. విద్యాపరమైన ఒత్తిడి అయినా, ఆర్థిక ఒత్తిడి అయినా వారిలో ప్రమాదాన్ని పెంచుతుంది. 18-19 సంవత్సరాల వయసులో వారిలో ఒత్తిడి తగ్గించడానికి కృషి చేయకపోతే అది డిప్రెషన్ కు దారితీస్తుంది.

Dreams: నిద్రలోంచి లేచిన మరుక్షణమే.. వచ్చిన కల ఏంటో కూడా గుర్తుకు రాదు.. అసలెందుకు అలా మర్చిపోతారంటే..!


Updated Date - 2023-10-17T14:42:01+05:30 IST