Fact Check: విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్స్.. వైరల్‌గా మారిన సందేశం.. అసలు నిజం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-18T13:32:36+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్స్ (Free Laptops to Students) అందించనుందని తాజాగా ఓ సందేశం నెట్టింట బాగా వైరల్ అయింది.

Fact Check: విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్స్.. వైరల్‌గా మారిన సందేశం.. అసలు నిజం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్స్ (Free Laptops to Students) అందించనుందని తాజాగా ఓ సందేశం నెట్టింట బాగా వైరల్ అయింది. 'ప్రధానమంత్రి ఫ్రీ ల్యాప్‌ట్యాప్ పథకం 2023'లో (Prime Minister Free Laptop Scheme 2023) భాగంగా ఇలా స్టూడెంట్స్ ఉచితంగా ల్యాపీలను పంపిణీ చేయనుందనేది ఆ సందేశం సారాంశం. చాలా తక్కువ సమయంలోనే ఈ సందేశం చాలా ఎక్కువ మందికి చేరింది. దాంతో ఈ విషయమై సెర్చ్ చేసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రచారంపై తాజాగా ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (Press Information Bureau) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

అలాంటి ప్రకటనల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఈ ఫేక్ నోట్ వల్ల ప్రజల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకం ఏదీ తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇది పూర్తి ఫేక్ సందేశం అని పేర్కొంది. ఇది కావాలని ఎవరో పనిగట్టుకుని ప్రచారం చేసిందే తప్పా.. మోదీ ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ఏదీ తీసుకురాలేదని తెలిపింది. కనుక ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నిజానిజాలు తెలుసుకోకుండా షేర్ చేయ్యొద్దని కోరింది. ఇక తాజాగా పీఐబీ ఇచ్చిన ఈ క్లారిటీతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడినట్టైంది.

ఇది కూడా చదవండి: రియల్ ఇంజనీర్ అంటే నువ్వే బ్రదరూ.. కరెంట్ కూడా అక్కర్లేకుండా బావిలోంచి నీళ్లను ఎలా పైకి తీసుకొచ్చేశాడో మీరే చూడండి..!

Updated Date - 2023-03-18T13:32:36+05:30 IST