Bus Driver: పాపం.. ఈ పాప.. ఎంత నరకం అనుభవించి ఉంటుందో.. 6 ఏళ్ల పాప దిగిపోయిందిలే అనుకుని బస్సు డ్రైవర్ డోర్లు వేసేయడంతో..!

ABN , First Publish Date - 2023-06-02T11:26:55+05:30 IST

హృదయాన్ని బరువెక్కించే పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.

Bus Driver: పాపం.. ఈ పాప.. ఎంత నరకం అనుభవించి ఉంటుందో.. 6 ఏళ్ల పాప దిగిపోయిందిలే అనుకుని బస్సు డ్రైవర్ డోర్లు వేసేయడంతో..!

ఇంటర్నెట్ డెస్క్: హృదయాన్ని బరువెక్కించే పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఓ స్కూల్ పాప తాలూకు వీడియో అది. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారిని నరకం అనుభవించేలా చేసింది. పైగా ఆ బస్ డ్రైవ్ చేసింది ఓ మహిళా డ్రైవర్ కావడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. స్కూల్ బస్ ఆగిన తర్వాత ఆరేళ్ల పాప అందులోంచి కిందికి దిగుతోంది. ఇంతలో డ్రైవర్ చిన్నారి పూర్తిగా దిగకుండానే డోర్ క్లోజ్ చేసింది. దాంతో ఆమె స్కూల్ బ్యాగ్ డోర్‌లో ఇరుక్కుపోయింది. అలా బ్యాగ్ బస్సులో ఉంటే.. అది వేసుకున్న పాప బయట ఉండిపోయింది. ఇక డ్రైవర్ పాప దిగింది.. లేనిది గమనించుకోకుండా బస్సును అలాగే పొనిచ్చింది. బస్సులో ఉన్న ఎవరు కూడా పాప డోర్‌లో ఇరుక్కుపోయిన విషయాన్ని గమనించలేదు.

దాంతో సుమారు వెయ్యి ఫీట్ల మేర ఆ చిన్నారి బస్సుతో పాటు అలాగే లాక్కెళ్లడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అందులో కూర్చున్న ఓ మహిళ చూసి బస్సు డ్రైవర్‌కు చెప్పింది. వెంటనే బస్సు ఆపి, డోర్ తెరవడంతో బాలిక రోడ్డుపై పడిపోయింది. బస్సులోని మహిళ వెళ్లి చిన్నారి పైకి ఎత్తడం వీడియోలో ఉంది. కాగా, ఈ ఘటన 2021 జూలైలో అమెరికాలోని కెంటూకీలో (Kentucky) జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'పాపం.. ఆ చిన్నారి.. ఎంత నరకం అనుభవించి ఉంటుందో' అని అంటున్నారు.

Weight Loss: ఈ యువతి వయసు 28 ఏళ్లు.. బరువు 95 కిలోలు.. పెళ్లికి ముందే బరువు తగ్గేందుకు ఈమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..!


Updated Date - 2023-06-02T11:27:00+05:30 IST