Dark spots: రాత్రి పడుకునేముందు ఈ ఒక్కటి ముఖానికి రాస్తే చాలు.. నల్లమచ్చలు గుర్తుల్లేకుండా మాయమవుతాయి..

ABN , First Publish Date - 2023-03-30T12:34:11+05:30 IST

రాత్రి పడుకునేముందు ముఖం మీద రాస్తే చాలు. గుర్తులు కూడా కనబడకుండా మంత్రమేసినట్టు మచ్చలు, మొటిమల తాలూకు గుర్తులు, మంగు అన్నీ మాయమైపోతాయి. ముఖారవిందానికి మ్యాజిక్ చేసే

Dark spots: రాత్రి పడుకునేముందు ఈ ఒక్కటి ముఖానికి రాస్తే చాలు.. నల్లమచ్చలు గుర్తుల్లేకుండా మాయమవుతాయి..

చందమామలాంటి అందమైన ముఖం చాలామంది అమ్మాయిల కల. టీవీ యాడ్స్ లోనూ, సినిమా హీరోయిన్లలానూ మెరిసిపోవాలని, ముఖం అంతా నీట్ గా ఉండాలని అనుకుంటారు. కానీ మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, నల్ల మచ్చలు తిష్టవేసుక్కూర్చుంటాయి. వీటన్నింటిని తొలగించుకోవడానికి మార్కెట్లలో ఉత్పత్తుల మీద ఆసక్తి చూపిస్తారు. కానీ సువాసన తప్ప ఆ ఉత్పత్తుల వల్ల కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. ముఖం మీద మచ్చలు ఇక పోవేమో అని నిరాశ పడక్కర్లేదిప్పుడు. ఎంచక్కా ఈ ఒక్కటి రాత్రి పడుకునేముందు ముఖం మీద రాస్తే చాలు. గుర్తులు కూడా కనబడకుండా మంత్రమేసినట్టు మచ్చలు, మొటిమల తాలూకు గుర్తులు, మంగు అన్నీ మాయమైపోతాయి. ముఖారవిందానికి మ్యాజిక్ చేసే ఆ చిట్కా.. ఆ చిట్కాలో ఉపయోగించే పదార్థాలు తెలుసుకుంటే..

వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు(Cloves) ఒకటి. లవంగం ఆరోగ్యాన్నే కాదు చర్మసంరక్షణకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని నేరుగా చర్మం మీద అప్లై చేయకూడదు. ఇందులో ఉన్న గాఢత వల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే లవంగాన్ని చర్మసంరక్షణ కోసం ఉపయోగించడానికి కొబ్బరినూనె(Coconut oil)ను జతగా ఎంపిక చేశారు. లవంగాలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidant), యాంటీ ఫంగల్(Anti fungal), యాంటీ మైక్రోబయల్(Anti microbial) లక్షణాలు మచ్చల మీద ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కొబ్బరినూనె ఉంటుంది. ఈ కొబ్బరి నూనె కేవలం తలకు మాత్రమే కాదు చర్మసంరక్షణలోనూ ఉపయోగపడుతుంది. పగిలిన చర్మాన్ని తిరిగి నార్మల్ గా చేయడంలోనూ, చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. లవంగాన్ని, కొబ్బరినూనెతో జతచేర్చితే అద్భుతం జరుగుతుంది.

read also: Viral News: కొడుకు ఏదో చేస్తున్నాడని డౌట్.. ఎవరికీ తెలియకుండా అతడి గదిలో సీసీ కెమెరాలను ఆ తండ్రి ఏర్పాటు చేయిస్తే..


చిటికెడు లవంగాల పొడి లేదా రెండు చుక్కల లవంగనూనెను ఒక స్పూన్ కొబ్బరి నూనెలో కలపాలి. ఇందులో చిటికెడు పసుపు(Turmeric) కూడా వేయచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు ముఖానికి రాసుకోవాలి. ముఖ్యంగా మచ్చలున్న ప్రాంతంలో కాస్త మందంపాటి పూత వేయాలి. సున్నితమైన చర్మమున్నవారు తక్కువ గాఢత ఉండేలా ఈ మిశ్రమం తయారుచేసుకుని వాడచ్చు. ప్రతిరోజూ రాత్రి ఇలా చేస్తుంటే మచ్చలన్నీ మెల్లిగా మాయమైపోతాయి.

కేవలం మచ్చలు పోవడానికి మాత్రమే కాదు. ముఖం మీద ముడుతలు, సాగిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడంలో కూడా లవంగాలు సహాయపడతాయి. లవంగాలలో యాంటీ ఏజింగ్(Anti aging) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖం మీది మృతకణాలను తొలగించడంలోనూ, రక్తప్రవాహాన్ని పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. దీనివల్ల ముఖంలో మెరుపు వస్తుంది. రాత్రి పడుకునేముందు మాశ్చరైజర్ వాడే అలవాటు ఉన్నవారు ఒక చిన్న కంటైనర్ లో కాస్త మాశ్చరైజర్ వేసి అందులో రెండు లేదా మూడు చుక్కల లవంగం నూనె వేసి కలిపి నిల్వచేసుకోవాలి. ఈ మాశ్చరైజర్ ను రాత్రి పడుకునేముందు అప్లై చేసుకోవాలి.

మాకేం పర్లేదు అనుకునే వారికి వేప నూనె(Neem oil) కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది సూర్యుడి నుండి వెలువడే యువి కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని అడ్డుకుంటుంది. దీన్ని నేరుగా కాకుండా ఇతర నూనెలతో కాంబినేషన్ చేసి వాడుకోవచ్చు.

ఆవాల నూనె(Mustard oil) కూడా మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆవాల నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి 10నుండి15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగేయాలి. వీటిలో ఏ ఒక్కటి ఫాలో అయినా ఎన్నేళ్ళ నుండో ముఖం మీద తిష్ట వేసుక్కూర్చున్న మచ్చలు మాయమైపోతాయి.

Read also: Viral Video: ఈ జింక తెలివి చూస్తే షాకవుతారు.. ప్రాణాలు పోవడం ఖాయమనుకున్న సమయంలో ఎలా తప్పించుకుందో చూడండి


Updated Date - 2023-03-30T12:38:01+05:30 IST