Cow vs Snake: ఈ పామును ఆవు తినేసిందా..? లేక సర్పమే ఆవును కాటేసిందా..? ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-09-11T15:07:56+05:30 IST

పాములలోకి విషపూరితమైన కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కాటు వేసిందంటే సెకెన్ల వ్యవధిలో ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. అలాంటి కింగ్ కోబ్రా ముందు నిలబడటం అంటే సాహసమనే చెప్పాలి. కానీ కింగ్ కోబ్రా, ఆవు రెండు నువ్వా,నేనా తేల్చుకుందాం అనే రేంజ్ లో ఒకదానికెదురుగా ఉన్న ఈ వీడియో చూస్తే..

Cow vs Snake: ఈ పామును ఆవు తినేసిందా..? లేక సర్పమే ఆవును కాటేసిందా..? ఏం జరిగిందో మీరే చూడండి..!

ప్రపంచంలో చాలామంది పాము అనే పేరు చెబితే భయపడతారు. నిలుచున్న చోట పాము లేకపోయినా కేవలం అదిగో పాము అని సరదాకు అన్నా అక్కడి నుండి పరుగందుకుంటారు. ఇక పాములలోకి విషపూరితమైన కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కాటు వేసిందంటే సెకెన్ల వ్యవధిలో ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. అలాంటి కింగ్ కోబ్రా ముందు నిలబడటం అంటే సాహసమనే చెప్పాలి. కానీ కింగ్ కోబ్రా, ఆవు రెండు నువ్వా,నేనా తేల్చుకుందాం అనే రేంజ్ లో ఒకదానికెదురుగా నిలబడి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు? 'అసలు ఆ పాము ఆవును కాటేసిందా లేదా ఆవు పామును తినేసిందా?' అని ఒకటే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

పాములలో విషమున్నవి, విషంలేని అని రెండు రకాలు ఉంటాయి. విషం లేకపోయినా పాము అనే పదమే చాలా మందిని భయపెడుతుంది. ఇక విషపూరితమైన నాగుపాము(cobra), రాచనాగు(King cobra) పేర్లు చెబితే వణుకు పుడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో పశువుల పాకలోకి పొరపాటున పాము వచ్చిందంటే ఇక పాకలో ఉన్న జంతువులన్నీ పెద్ద ఎత్తున అరుస్తూ ప్రమాదాన్ని వ్యక్తం చేస్తాయి. కానీ కొన్ని సార్లు జంతువుల ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. ఈ ఆవు(cow) ప్రవర్తన అలాంటిదే. వీడియోలో ఓ కింగ్ కోబ్రా(king cobra), నలుపు రంగులో ఉన్న ఆవు(black cow) రెండింటిని చూడచ్చు. బారెడు పొడవు ఉన్న కింగ్ కోబ్రా పడగ విప్పి మరీ ఆవు ఎదురుగా ఉంది. ఆవు కొంచెం కూడా భయపడకుండా పాము ముందు నింపాదిగా నిలబడుకుంది. పాము తన పడగను ఆవుకు ముందుగా తీసుకెళ్తే.. ఆవు తన తలను పాము పడగ ముందుకు తెస్తుంది. ఈ వీడియో చూస్తున్నవారికి ఆ పాము ఆవును కాటేస్తుందేమో అని ఒకటే టెన్షన్ కలుగుతుంది. వాటి ప్రవర్తన చూస్తే ఏదో ఒకటి ప్రాణం పోగొట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది. కానీ విచిత్రంగా ఆ పాము ఆవును ఏమీ చేయలేదు. ఆ ఆవు కూడా పామును శత్రువుగా చూస్తున్నట్టు అనిపించదు. ఆవు పాము పడగను తన తలతో సున్నితంగా రాయడం, ఆ తరువాత తన నాలుకతో పాము పడగను ఆత్మీయంగా నాకడం చూస్తే ఏకంగా షాక్ కొట్టినట్టే అనిపిస్తుంది. ఈ పాముకు, ఆవుకు మధ్య ఏ జన్మ అనుబంధముందో కానీ ఈ జన్మలో అవి శత్రువులుగా కాకుండా స్నేహంగా(king cobra, cow friendship) మెలిగాయి.

Metro Train: పోలీస్ కానిస్టేబుల్‌ ఒకే ఒక్క మాట అన్నందుకు.. ఈ ఇద్దరు యువతులు చేసిన రచ్చ మామూలుగా లేదుగా..!ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్(Forest officer) సుశాంత నంద Susanta Nanda తన ట్విట్టర్ ఎక్స్ (Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. 'వీటి మధ్య ఉన్న స్వచ్చమైన ప్రేమను వర్ణించి చెప్పడం చాలా కష్టం' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు లోనవుతున్నారు. ఈ వీడియో గురించి పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'నాగదేవుడు నందీశ్వరుడి మధ్య స్నేహం' అని ఒకరు దీనికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కామెంట్ చేశారు. 'ఈ వీడియో చూస్తుంటే ఏదో ఒక ప్రాణి చనిపోవడం ఖాయం అనుకున్నా కానీ విచిత్రంగా ఇలా జరుగుతుందనుకోలేదు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ప్రకృతి చాలా విచిత్రమైనదని అనుకుంటాం. అలాగే జంతువులు కూడా తమకు హాని కలిగే వాతావరణాన్ని, స్నేహపూరిత వాతావరణాన్ని గుర్తించగలుగుతాయి. అందుకే ఇది సాధ్యమైంది' అని ఇంకొకరు అన్నారు.

ATM Theft: వెబ్ సీరీస్‌లు చూసి దొంగలూ అప్‌డేట్ అయిపోయారుగా.. ఈ ఏటీఎంను ఎలా చోరీ చేశారో చూస్తే..!


Updated Date - 2023-09-11T15:07:56+05:30 IST