ATM Theft: వెబ్ సీరీస్‌లు చూసి దొంగలూ అప్‌డేట్ అయిపోయారుగా.. ఈ ఏటీఎంను ఎలా చోరీ చేశారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-11T12:44:07+05:30 IST

చాలామంది ఏటీఎంలో చోరీకి పాల్పడితే ఏటీఎం మెషిన్ ను సుత్తితో పగలగొట్టడం, టెక్నాలజీని ఉపయోగించి డబ్బున్న లాకర్ ను తెరవడం వంటి పనులు చేస్తారు. కానీ ఈ ఇద్దరు దొంగలు మాత్రం అందుకు విభిన్నం. వీళ్ల క్రియేటీవిటీ చూస్తే..

ATM Theft: వెబ్ సీరీస్‌లు చూసి దొంగలూ అప్‌డేట్ అయిపోయారుగా.. ఈ ఏటీఎంను ఎలా చోరీ చేశారో చూస్తే..!

ఒకప్పుడు దారిలో వెళ్తున్న వ్యక్తుల చేతుల్లో సంచులు పట్టుకుని పరిగెత్తడం, ఇంటికి కన్నాలు వేయడం చేసేవారు దొంగలు. కానీ ఇప్ప్పడు ఆ పరిస్థితి మారింది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో దొంగతనాలు తెలివిగా ఎలా చెయ్యాలో చూపించడంతో దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. చాలామంది ఏటీఎంలో చోరీకి పాల్పడితే ఏటీఎం మెషిన్ ను సుత్తితో పగలగొట్టడం, టెక్నాలజీని ఉపయోగించి డబ్బున్న లాకర్ ను తెరవడం వంటి పనులు చేస్తారు. కానీ ఈ ఇద్దరు దొంగలు మాత్రం అందుకు విభిన్నం. ఈ దొంగలు ఏటీఎంను చోరీ చెయ్యడానికి చేసిన ప్రయత్నం చూస్తే అవాక్కవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎంతకు తెగించార్రా బాబూ' అని అంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జులాయి(Allu Arjun movie Julayi) సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందికీ తెలిసిందే. ఈ సినిమాలో సోనూసూద్ బ్యాంక్ దోపిడీకి(bank robbery) వెళ్లినప్పుడు బ్యాంకులో డబ్బు మొత్తం పెద్ద గొలుసుకు కట్టి దాన్ని క్రేన్ సహాయంతో బయటకు లాగి ఎత్తుకుపోతాడు. మహారాష్ట్రలో చూఛాయగా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. అయితే ఇది బ్యాంకు దొంగతనం కాదు, ఏటీఎం చోరీ. ప్రత్యుర్థులు, కొట్టుకోవడాలు ఏమీ లేవు కానీ డబ్బు బయటకు లాగే సీన్ ను ఏటీఎం మెషిన్ లాగడానికి దించేశారు ఈ దొంగ వెధవలు. మహారాష్ట్ర రాష్ట్రం(Maharashtra), బీడ్ జిల్లాలో ఓ ప్రాంతంలో ఉన్న ఏటీఎంను ఇద్దరు దొంగలు కొల్లగొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు దొంగలు తమ ముఖం కనిపించకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నారు. వీరిద్దరూ ఏటీఎం లో డబ్బు దొంగిలించడానికి వింత పద్దతి అనుసరించారు. వీరిలో ఒక వ్యక్తి ఏటీఎంను తాడుతో చాలా గట్టిగా కట్టేశాడు, రెండవ కొనను కారు వెనుక భాగంలో కట్టేశాడు. కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వగానే ఏటీఎం మెషిన్ బయటకు వచ్చేస్తుందని, తద్వారా దాన్ని ఎత్తుకెళ్లి పోవాలన్నది వారి ప్లాన్. అనుకున్నట్టే తాడుతో ఏటీఎం ను కట్టేసి, కారుకు తాడును బిగించిన తరువాత రెండవ దొంగ కారును స్టార్ట్ చేశాడు. కానీ ఏటీఎం మెషిన్ ఉన్న గది డోర్ మూసుకుని ఉండటంతో రెండవ దొంగ మొదటి దొంగను తలుపు తీయమని చెప్పాడు. దీంతో రెండవ దొంగ కారు దిగి వచ్చి ఏటీఎం గది తలుపు తీసి అలాగే పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. రెండవ దొంగ కారును స్పీడ్ గా ముందుకు పోనిచ్చాడు. అంతే.. ఏటీఎం మెషిన్ చాలావేగంగా ముందుకు వచ్చి ఏటీఎం గది తలుపును బద్దలు కొట్టింది. అక్కడే నిలబడి ఉన్న దొంగ ఆ విసురుకు అక్కడినుండి దూరంగా వెళ్లి పడ్డాడు. ఈ సంఘటన మొత్తం ఏటీఎం గదిలో సెట్ చేసిన సీసీ కెమెరా(CC Camera)లో రికార్డయ్యింది.

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!ఏటీఎంలో సేప్ఠీ సర్వీస్(ATM safety service) అమర్చి ఉండటంతో పోలీసులకు క్షణాల్లోనే సమాచారం అందింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఏటీఎం ఉన్నచోటుకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆ దొంగలిద్దరూ అక్కడి నుండి ఉడాయించారు. వారు ఏటీయంలో డబ్బు దొంగిలించడంలో ఫెయిల్ అయ్యారు. సీసీ కెమెరాలో రికార్డ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను Raja Babu అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేరే చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక వైపు ఆ దొంగల క్రియేటీవిటికి ఆశ్చర్యపోతూ మరొకవైపు పంచ్ లు సెటైర్లు వేస్తున్నారు. 'ఓహ్ కారులో వచ్చి ఏటీఎం దొంగతనం చేయడం నేనెక్కడా వినలేదు. వీళ్లు బాగా డబ్బున్న దొంగలు' అని ఒకరు కామెంట్ చేశారు. 'బహుశా ఏటీఎంను కారుతో ఇంటివరకు లాక్కెళ్ళి అక్కడ తీరిగ్గా డబ్బులు లెక్కించాలనుకున్నారేమో' అని మరొకరు కామెంట్ చేశారు. 'మీ అతి తెలివి తెల్లారిపోనూ..మీరెలా దొంగలయ్యార్రా' అని ఇంకొందరు అంటున్నారు.

Metro Train: పోలీస్ కానిస్టేబుల్‌ ఒకే ఒక్క మాట అన్నందుకు.. ఈ ఇద్దరు యువతులు చేసిన రచ్చ మామూలుగా లేదుగా..!


Updated Date - 2023-09-11T12:44:07+05:30 IST