Coin Started Flying: 4 స్పూన్లు.. 4 చిన్న బ్యాటరీలు.. ఇలా పెట్టగానే గాల్లోకి లేచిన రూపాయి కాయిన్.. ఇదేం వింత అనుకుంటున్నారా..?

ABN , First Publish Date - 2023-03-29T20:49:43+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో సర్‌ప్రైజింగ్ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని ఆయోమయంలో పడేసింది.

Coin Started Flying: 4 స్పూన్లు.. 4 చిన్న బ్యాటరీలు.. ఇలా పెట్టగానే గాల్లోకి లేచిన రూపాయి కాయిన్.. ఇదేం వింత అనుకుంటున్నారా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో సర్‌ప్రైజింగ్ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని ఆయోమయంలో పడేసింది. తాము చూస్తున్నది నిజమేనా? అనిపించేలా చేస్తోంది. దానికి వెనుక పెద్ద సైన్స్ ఏమైనా ఉందేమో అనే అనుమానం కలిగేలా చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Shocking Videos)

ఆ వీడియోలో ఒక టేబుల్‌పై నాలుగు స్పూన్లు (Spoons) ఒకదానికొకటి చతురస్రాకారంలో అమర్చి ఉన్నాయి. మధ్యలో ఒక రూపాయి కాయిన్ ఉంది. మూడు స్పూన్లలో మూడు బ్యాటరీలు ఉన్నాయి. నాలుగో స్పూన్లో బ్యాటరీ (battery) పెట్టగానే మధ్యలో ఉన్న రూపాయి కాయిన్ గాల్లోకి లేచి ఆడింది. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఏదో పెద్ద సైన్స్ (Scientific Videos), ఎలక్ట్రిక్ మాగ్నెట్ ఫోర్స్ ఉందేమో అనుకున్నారు. ఆ వీడియో వైరల్ అవగానే కొందరు నిజం బయటపెట్టారు. (Coin started flying in the air)

Honeymoon Video: హనీమూన్‌కు వెళ్లి రాత్రంతా ఇదేం నిర్వాకం..? కొత్త జంట షేర్ చేసిన వీడియోపై సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

ఆ వీడియో ఫేక్ (Fake Videos) అని తేల్చారు. అందులో ఎలాంటి సైన్సూ లేదని చెబుతున్నారు. ఆ కాయిన్‌కు తాడు కట్టి, ప్లాస్టిక్ చుట్టారని, నాలుగో బ్యాటరీ పెట్టగానే ఆ తాడును లాగారని కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది తాడుతోనే ఆ మ్యాజిక్ చేశారని నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. (Magic Videos)

Amazing: కంటికి కనిపించని వింత.. ఈ సాసర్‌పై కాఫీ కప్పును పెట్టగానే ఏం జరిగిందో చూస్తే అవాక్కవడం ఖాయం..!

Updated Date - 2023-03-29T20:49:43+05:30 IST