Amazing: కంటికి కనిపించని వింత.. ఈ సాసర్‌పై కాఫీ కప్పును పెట్టగానే ఏం జరిగిందో చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-03-29T19:26:18+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వందల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు వినోదం పంచతుంటే, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

Amazing: కంటికి కనిపించని వింత.. ఈ సాసర్‌పై కాఫీ కప్పును పెట్టగానే ఏం జరిగిందో చూస్తే అవాక్కవడం ఖాయం..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వందల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు వినోదం పంచుతుంటే, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందికి ఆశ్చర్యం (Shocking Video) కలిగిస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టేబుల్‌పై ఒక సాసర్, దాని పక్కనే ఓ కాఫీ కప్పు ఉన్నాయి. ఆ సాసర్‌పై ఒకవైపు గీతలు గీసి ఉన్నాయి. ఆ సాసర్‌పై కప్పు పెట్టి కదలించగానే ఓ పక్షి ఎగురుతున్నట్టు కనిపిస్తోంది. (Bird is hidden in the cup)

వీడియో మొత్తం చూస్తే ఆ పక్షి (Bird) ఎలా ఎగురుతోందో అర్థమవుతుంది. దీనిని Optical Illusion అంటారు. సాసర్‌పై కప్పు పెట్టగానే గీతలు ఆ కప్పుపై రిఫ్లెక్ట్ అయి పక్షి ఎగురుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో చాలా మందికి నచ్చింది. కొద్ది గంటల్లోనే ఈ వీడియో 2 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. వీడియో (Viral Video) అద్భుతంగా ఉందని, వీడియో చూసి షాకయ్యామని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అడిగి మరీ బెత్తంతో కొట్టించుకుని.. ఆపై టీచరమ్మ కాళ్లకు నమస్కరించి..!

Updated Date - 2023-03-29T19:26:18+05:30 IST