Something Special: 'రికార్డులో నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి'.. ఈ డైలాగ్ ఈయనకు సరిగ్గా సరిపోతుంది..!

ABN , First Publish Date - 2023-03-19T13:20:28+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో ఓ డైలాగ్ ఉంటది.

Something Special: 'రికార్డులో నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి'.. ఈ డైలాగ్ ఈయనకు సరిగ్గా సరిపోతుంది..!

ఇంటర్నెట్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో ఓ డైలాగ్ ఉంటది. 'రికార్డులో నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి' అని. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోయే ఈ వ్యక్తికి కూడా ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. అతనో ఇండియన్ రైల్వే ఉద్యోగి (Indian Railway Employee). చెన్నై రైల్వే డివిజన్‌లో డిప్యూటీ చీఫ్ టికెట్ ఇస్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంటారు. అతడి పేరు ఎస్. నందకుమార్ (S. Nandakumar). మీరు చెన్నైకి రైలులో వెళ్లి ఉంటే ఈ అధికారి మీకు తప్పక ఎదురై ఉంటారు. ఇంతకీ ఈయన గురించి ఎందుకు చెబుతున్నాం అనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం.

సాధారణంగా రైల్వే టికెట్ చెకింగ్ అధికారి అంటే.. డబ్బులిస్తే సరిపోతుందిలే.. అని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ నందకుమార్ అలా కాదండోయ్. రూల్స్ పాటించని ప్రయాణికుల తాట తీస్తాడు. ఇలా ఇప్పటివరకు నిబంధనలు పాటించని ప్రయాణికులపై 27,787 చలాన్లు విధించాడు. వీటిలో ఎక్కువగా టికెట్ లేకుండా ప్రయాణించడం, రిజర్వేషన్ లేని ప్రయాణం వంటి కేసులు ఉన్నాయట. తద్వారా ప్రయాణికుల నుంచి ఏకంగా రూ. 1.55కోట్లు వసూలు చేశాడు. అది కూడా 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 16 వరకు.. అంటే సుమారు ఏడాది వ్యవధిలోనే ఇంత భారీ మొత్తం సంపాదించి పెట్టాడన్నమాట. భారత రైల్వే చరిత్రలోనే ఇదో రికార్డు అని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారే కదా ఏ వ్యవస్థకైనా కావాల్సింది. నందకుమార్‌కు ఓ సెల్యూట్ కొట్టాల్సిందే మరి.

ఇది కూడా చదవండి: రియల్ ఇంజనీర్ అంటే నువ్వే బ్రదరూ.. కరెంట్ కూడా అక్కర్లేకుండా బావిలోంచి నీళ్లను ఎలా పైకి తీసుకొచ్చేశాడో మీరే చూడండి..!

Updated Date - 2023-03-19T13:34:50+05:30 IST