Bride: పెళ్లి వేదికపైకి వచ్చిన వరుడిని చూసి అవాక్కైన వధువు.. అతడిని చేసుకోనంటూ ఆమె చెప్పిన కారణాలు విని అంతా షాక్..!

ABN , First Publish Date - 2023-05-18T15:07:50+05:30 IST

కాసేపట్లో మూడుముళ్లు పడతాయనే సమయానికి వధువు ఊహించని ఝలక్ ఇచ్చింది.

Bride: పెళ్లి వేదికపైకి వచ్చిన వరుడిని చూసి అవాక్కైన వధువు.. అతడిని చేసుకోనంటూ ఆమె చెప్పిన కారణాలు విని అంతా షాక్..!
marriage

పిల్లలకు వయసు వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులైనా వారికి వివాహం చేయాలని ఆలోచిస్తారు. తగిన జోడు కోసం తెలిసిన వాళ్లందరికీ చెప్పి మరీ సంబంధాలు వెతుకుతుంటారు. పెళ్లి విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే నూరేళ్లు కలిసి జీవించాలంటే ఈడూ జోడూ బాగుండేలా చూసుకుంటారు. నలుగురు చూసినప్పుడు జంట బాగుందని చెప్పుకొనే విధంగా పెద్దలు మ్యాచింగ్స్ చూస్తుంటారు. ఒకవేళ సంబంధం నచ్చితే అబ్బాయి.. అమ్మాయిను ఎదురెదురుగా కూర్చోబెట్టి మరీ చూసుకోమంటారు. కారణమేంటంటే రేపన్న రోజు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఎన్నో జాగ్రత్తలు చూసుకుంటారు. కలిసి జీవించాలంటే ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం. తీరా అన్ని బాగుండీ.. పెళ్లయ్యాక కొంత మంది చేజేతులారా సంసారాలు కూల్చుకున్న దాఖలు కూడా లేకపోలేదు. అందుకే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే ఆచితూచి వ్యవహరిస్తారు. ఇదంతా ఎందుకంటారా? పెళ్లి చూపులు అయ్యాయి.. ముహూర్తం పెట్టుకున్నారు.. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. అన్నీ చేసుకున్నాక.. కాసేపట్లో అమ్మాయి మెడలో అబ్బాయి (groom) తాళి కట్టే సమయానికి వధువు షాకిచ్చింది (Bride rejects). పెళ్లికి వచ్చిన వారంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగింది. ఎందుకు ఆమె అలా చేసిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అమ్మాయి.. అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు. అటు తర్వాత పెద్దలు ముహూర్తం పెట్టారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులకు... స్నేహితులకు పెళ్లి కార్డులు పంచేశారు. ముహూర్త సమయానికి అందరూ మండపానికి చేరుకున్నారు. తెలిసిన వారంతా ఒకరికొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. ముహూర్త సమయం దగ్గర పడడంతో పెళ్లి కుమారుడిని.. పెళ్లి కుమార్తెను వివాహ వేదికపైకి తీసుకొచ్చారు. కాసేపట్లో మూడుముళ్లు పడతాయనే సమయానికి వధువు ఊహించని ఝలక్ ఇచ్చింది. తనకు ఈ పెళ్లంటే ఇష్టం లేదంటూ తెగేసి చెప్పింది. దీంతో అప్పటిదాకా కళకళలాడిన కల్యాణమండపం గందరగోళానికి గురైంది.

బిహార్‌ రాష్ట్రం (Bihar) బాగల్‌పుర్‌లోని కహల్‌గావ్‌ ప్రాంతంలో వివాహం(marriage) జరుగుతోంది. అబ్బాయి.. అమ్మాయి వేదికపైకి వచ్చారు. ఇంతలో వధువు కిట్టూ కుమారి పెళ్లి చేసుకోనంటూ మొండికేసింది. వరుడు నల్లగా ఉన్నాడని.. అంతేకాకుండా వయసులో తన కంటే చాలా పెద్దోడిలా కనిపిస్తున్నాడంటూ వేదికపైన ఆవేదన వ్యక్తం చేసింది (black color and age factor). ఇక ఊరేగింపుగా వచ్చిన పెళ్లికొడుకు వేదికపైకి వచ్చాక అతడిని చూసేందుకు కూడా వధువు ఇష్టపడలేదు. వరుడి మెడలో పూల దండ వేసి.. తిలకం పెట్టమంటే దానికి కూడా ఆమె ససేమిరా అంది. దీంతో ఇరు కుటుంబాల బంధువులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లికొచ్చిన పెద్దలంతా వధువును ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా కూడా ఆమె... పెళ్లి చేసుకునేందుకు ఏ మాత్రం ఒప్పుకోలేదు. మరికొందరు ఆమెకు పలు ఆఫర్లు కూడా ఇచ్చారు. అయినా కూడా ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.. తగ్గేదేలే అంటూ మరింత మొండిగా వ్యవహరించింది. ఇక చేసేదేమీలేదంటూ వివాహాన్ని రద్దు చేసుకుని వరుడి కుటుంబ సభ్యులు తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Husband: కొడుకు పెళ్లిలో వేరే వాళ్లతో డాన్స్ చేసిన భార్య.. మర్నాడే ఇద్దరిని చంపేసిన భర్త.. ఆపై హాయిగా నిద్రపోతోంటే..!

ఇది కూడా చదవండి: Bride: కొద్ది గంటల్లో పెళ్లి.. ఊరేగింపుతో వరుడు వచ్చాడని తెలిసి ఇంట్లోంచి వధువు ఎస్కేప్.. 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొస్తే..

Updated Date - 2023-05-18T15:12:11+05:30 IST