Viral Video: ఇదేం పైత్యం బాబోయ్.. స్కూటీపై వెళ్తూనే ఇద్దరు కుర్రాళ్ల లిప్‌కిస్.. వెనుక నుంచి సీక్రెట్‌గా వీడియో తీసుతున్నారని తెలియక..!

ABN , First Publish Date - 2023-06-01T16:40:52+05:30 IST

సోషల్ మీడియా వచ్చాక ఇదొక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంకొందరికి పిచ్చి బాగా ముదిరిపోతుంది. లైకుల కోసం దిగజారి విచ్చలవిడిగా కంటెంట్ పోస్టు

Viral Video: ఇదేం పైత్యం బాబోయ్.. స్కూటీపై వెళ్తూనే ఇద్దరు కుర్రాళ్ల లిప్‌కిస్.. వెనుక నుంచి సీక్రెట్‌గా వీడియో తీసుతున్నారని తెలియక..!
Boys Lip Lock

నాయనో ఇదేం పైత్యమో అర్థం కావట్లేదు. రోజు రోజుకు పరిస్థితులు ఇంతగా దిగజారిపోతున్నాయా? ఇటీవల ప్రేమికులు బైకులపై వెళ్తూ రివర్స్‌లో కూర్చుని కిస్‌లు, కౌగిలింతలు ఇచ్చుకోవడం చూశాం. ఆ సీన్లే అభ్యంతరకరంగా ఉంటే తాజాగా ఇద్దరు కుర్రాళ్లు చేసిన వికృత చేష్టాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తే వామ్మో.. ఇంత దారుణమా? అని అనకుండా ఉండలేరు.

సోషల్ మీడియా వచ్చాక ఇదొక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంకొందరికి పిచ్చి బాగా ముదిరిపోతుంది. లైకుల కోసం దిగజారి విచ్చలవిడిగా కంటెంట్ పోస్టు చేస్తున్నారు. దీంతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఓ స్కూటీపై (Moving Scooty) ముగ్గురు యువకులు వేగంగా దూసుకుపోతున్నారు. వాళ్లు ఏమైనా ఛాలెంజ్ విసురుకున్నారో.. లేదంటే కావాలనే ఇలా చేశారో తెలియదు గానీ.. వెనుక కూర్చున్న ఇద్దరు యువకులు ఘాటుగా లిప్‌కిస్‌లు (Boys Lip Lock) ఇచ్చుకున్నారు. ఈ వికృత చేష్టలను వెనుక ఫాలో అవుతున్న కారులోని వ్యక్తులు వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోను 2 లక్షల దాకా వీక్షించారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం పైత్యం..రా బాబోయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో (Uttar Pradesh Rampur district) చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో.. ట్రాఫిక్‌లో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేసిన ఆ యువకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిని ట్రేస్ ఔట్ చేసే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి: Snake Video: ఇంటి గుమ్మం ముందే మాటు వేసిన పాము.. చూసుకోకుండా ఇంట్లోకి వెళ్లబోయిన చిన్నారి.. లోపల ఉన్నవాళ్లు చెప్పేలోపే..!

ఇది కూడా చదవండి: Viral Video: పిచ్చి పీక్స్ అంటే ఇదే.. రాత్రి పూట కారు పైకి ఎక్కి మరీ ఈ కుర్రాడు చేసిన నిర్వాకం చూస్తే..!

Updated Date - 2023-06-01T16:40:52+05:30 IST