Balakrishna: సార్.. బాలయ్య‌కు నచ్చేశారు

ABN , First Publish Date - 2023-03-03T20:06:58+05:30 IST

నందమూరి నటసింహ బాలకృష్ణ‌ (Nandamuri Natasimha Balakrishna) కు ‘సార్’ (Sir) సినిమా నచ్చేసింది. తాజాగా నందమూరి బాలకృష్ణకు చిత్రయూనిట్ ప్రత్యేక షో (Special Show) ఏర్పాటు చేయగా..

Balakrishna: సార్.. బాలయ్య‌కు నచ్చేశారు
Balakrishna With Sir Movie Team

నందమూరి నటసింహ బాలకృష్ణ‌ (Nandamuri Natasimha Balakrishna) కు ‘సార్’ (Sir) సినిమా నచ్చేసింది. తాజాగా నందమూరి బాలకృష్ణకు చిత్రయూనిట్ ప్రత్యేక షో (Special Show) ఏర్పాటు చేయగా.. సినిమా చూసిన అనంతరం.. ఆయన చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇటువంటి సినిమా చేయడం నిజంగా సాహసం అంటూ దర్శకుడిని ప్రత్యేకంగా బాలయ్య అభినందించారు. బాలయ్య నుంచి అభినందనలు అందుకున్న చిత్రయూనిట్.. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నటసింహానికి ధన్యవాదాలు తెలుపుతూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘సార్’ విషయానికి వస్తే.. ఇది గురువు గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం. పేద విద్యార్థుల చదువు కోసం బాల గంగాధర్ తిలక్ అనే ఓ గురువు సాగించిన పోరాటమే ఈ చిత్రం. సిరిపురం (Siripuram) అనే ఊరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్‌గా వెళ్ళిన కథానాయకుడు.. అక్కడ విద్యార్థులెవరూ కళాశాలకు రాకపోవడంతో వారిని తిరిగి కళాశాలకు వచ్చేలా చేస్తాడు. కుల వ్యవస్థపై పోరాడేందుకు వారిలో చైతన్యం నింపుతాడు. ఈ చిత్రంలో విద్య గొప్పతనాన్ని తెలుపుతూ బాల గంగాధర్ తిలక్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. (Sir Movie Story)

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. హీరో సుమంత్ (Sumanth) అతిథి పాత్రలో నటించారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండు భాషల్లోనూ ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుని.. ఊహించని కలెక్షన్స్‌ను రాబడుతోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-03T20:27:05+05:30 IST