Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆ దేవుడి అంశ

ABN , First Publish Date - 2023-03-01T18:46:58+05:30 IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది.

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’  ఆ దేవుడి అంశ

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొణె (Deepika Padukone) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ (Ashwini Dutt) ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ‘ప్రాజెక్ట్ కె’ కు సంబంధించిన అనేక ఆసక్తికర అప్డేట్‌ను ప్రేక్షకులను చెప్పారు.

‘ప్రాజెక్ట్ కె’ ను ఆధునిక విష్ణువు అవతారంగా (Modern Day Avatar of Vishnu) అశ్వినీదత్ అభివర్ణించారు. సైన్స్ ఫిక్షన్ పాంటసీ కథాంశంతో సినిమా రూపొందుతున్నట్టు చెప్పారు. మూవీలో గ్రాఫిక్స్ భారీగా ఉన్నట్టు తెలిపారు. ఐదు నెలలుగా గ్రాఫిక్స్‌పై పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏడాది సమయాన్ని విజువల్ ఎఫెక్ట్స్ కోసమే వెచ్చిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ను పూర్తి చేసినట్టు వెల్లడించారు. ‘‘స్టంట్స్ అన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. నాలుగు నుంచి ఐదుగురు ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారు. వెండితెర మీద ‘ప్రాజెక్ట్ కె’ ను ను చూసి మీరు మెస్మరైజ్ అవుతారు. మిక్కి జె. మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయడం లేదు. సంతోష్ నారాయణన్‌తో సహా బాలీవుడ్‌‌కు చెందిన లేడీ మ్యూజిషియన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. చిత్రంలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వారి పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’’ అని అశ్వినీ దత్ ఆసక్తికర కబుర్లను తెలిపారు. ‘ప్రాజెక్ట్ కె’ కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహానటి’ అనంతరం నాగీ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-01T18:54:23+05:30 IST