Mistakes To Avoid: స్నానం చేశాక చేయకూడని 5 తప్పులు ఇవే.. చాలామంది కామన్‌గా చేస్తుంటారు.. అలా చేయడం మంచిది కాదట!

ABN , First Publish Date - 2023-04-26T21:51:40+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా జాతి, మతం లేకుండా మనుషులందరూ ప్రతిరోజూ ఆచరించే వాటిలో స్నానం ఒకటి. కానీ ప్రతిరోజూ చేసే స్నానమే అయినప్పటికీ చాలామంది తెలిసీతెలియక తప్పులు చేస్తుంటారు...

Mistakes To Avoid: స్నానం చేశాక చేయకూడని 5 తప్పులు ఇవే.. చాలామంది కామన్‌గా చేస్తుంటారు.. అలా చేయడం మంచిది కాదట!

మానవ శరీర నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మనల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచేందుకు ఈ శరీర భాగాలు వేర్వేరు క్రియలను నిర్వహిస్తుంటాయి. అయితే శరీర పనితీరు సరిగా ఉండాలంటే శరీర భాగాలు మాత్రమే సరిగా పనిచేస్తే సరిపోదు. ఇతర అంశాలు కూడా శరీర పనితీరుకు దోహదపడతాయి. అందులో స్నానం చేయడం కూడా ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా జాతి, మతం లేకుండా మనుషులందరూ ప్రతిరోజూ ఆచరించే వాటిలో స్నానం ఒకటి. కానీ ప్రతిరోజూ చేసే స్నానమే అయినప్పటికీ చాలామంది తెలిసీతెలియక తప్పులు చేస్తుంటారు. చాలామంది కామన్‌గా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి శరీరానికి, జట్టుకి ఏమాత్రం మంచిది కాదు.

జూహీ కపూర్ అనే ఓ న్యూట్రిషనిస్ట్ ఇటివల సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్ చేశారు. స్నానం చేసిన తర్వాత కామన్‌గా చేసే 5 తప్పులను ఆమె అందులో సూచించారు. ‘‘ స్నానం చేసిన తర్వాత కామన్‌గా ఈ 5 తప్పులు చేస్తుంటారు!. చర్మ, జట్టు నాణ్యత పెంచుకునేందుకు సరిదిద్దుకుంటే ఈ మార్పులు చూడొచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. మరి జూహీ కపూర్ చేసిన ఆ 5 తప్పులు ఏవో మీరూ ఓ లుక్కేయండి...

స్నానం తర్వాత చేయకూడని తప్పులు ఇవే..

1. టవల్‌తో చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. ఇలా చేయడం చర్మానికి కఠినమనే (harsh) చెప్పాలి. టవల్‌తో మృదువుగా తడిని తుడిచేస్తే ఎలాంటి ప్రభావమూ పడదు. ఇందుకు విరుద్ధంగా టవల్‌తో రుద్దితే మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతుంది.

2. స్నానం తర్వాత విషపూరితమైన ఉత్పత్తుల వాడకానికి దూరంగా ఉండాలి. చర్మ పోషణకు పనికొచ్చే సేంద్రీయ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి ఉత్పత్తులను నిర్ధారించుకున్నాక మాత్రమే వాడాలి.

3. స్నానం తర్వాత తడిసిన జుట్టుని పొడిగా మార్చేందుకు చేతితో గట్టిగా కొట్టకూడదు. ఇలా చేయడం జట్టుకి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. కురులను దెబ్బతీసే అవకాశాలున్నాయి.

4. జుట్టుకి టవల్‌ని గట్టిగా చుట్టడం, తుడవడాన్ని మానుకోవడం కూడా జట్టుకి శ్రేయస్కరం. టవల్‌తో మృదువుగా తుడుచుకున్నాక సహజసిద్ధమైన వెలుతురు, గాలి ద్వారా ఆరనివ్వడం మంచిది.

5. స్నానం చేసిన వెంటనే తల దువ్వూకోవడం మానేయాలి. జట్టు తడి ఆరిన తర్వాత దువ్వుకోవడం జట్టుకి మంచిది.

మరోవైపు స్నానం చేసే సమయంలో కూడా కొన్ని తప్పులు జరగుతున్నాయని న్యూట్రిషనిస్ట్ జూహీ కపూర్ చెప్పారు. స్నానాన్ని త్వరగా ముగించేయడం, మంచి సబ్బుని వాడకపోవడం, వేడి నీళ్లతో స్నానం, రెగ్యులర్‌గా తలస్నానం చేయడం, ముఖానికి ఎక్కువగా లోషన్లు రాయడంతోపాటు ఇతర విషయాలు స్నానం చేసే సమయంలో ప్రధానమైన పొరపాట్లు అని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

Govt investment schemes: పిల్లల భవిష్యత్ కోరుకునే తల్లిదండ్రులకు తప్పక తెలియాల్సిన ప్రభుత్వ స్కీమ్స్ ఇవే...! మొత్తం 6 పథకాలు.. బెనిఫిట్స్ ఇవే...

Updated Date - 2023-04-26T21:57:28+05:30 IST