Island on Sale: అమ్మకానికి 25 ఎకరాల ఐలాండ్.. రేటు ఎంత చెబుతున్నారంటే...

ABN , First Publish Date - 2023-04-23T16:07:33+05:30 IST

రోజువారి బిజీబిజీ లైఫ్‌కి దూరంగా ప్రశాంతంగా సేద తీరాలని చాలామంది భావిస్తుంటారు. అందుకు అనువైన ప్రాంతాలను తెలుసుకొని మరీ టూర్లు వేస్తుంటారు. ఇలాంటి ఆహ్లాదకర ఐలాండ్ (Island) ఒకటి అమ్మకానికి అందుబాటులో ఉంది. ధర ఇతర వివరాలు ఇవే...

Island on Sale: అమ్మకానికి 25 ఎకరాల ఐలాండ్.. రేటు ఎంత చెబుతున్నారంటే...

రోజువారి బిజీబిజీ లైఫ్‌కి దూరంగా ప్రశాంతంగా సేద తీరాలని చాలామంది భావిస్తుంటారు. అందుకు అనువైన ప్రాంతాలను తెలుసుకొని మరీ టూర్లు వేస్తుంటారు. ఇలాంటి ఆహ్లాదకర ఐలాండ్ (Island) ఒకటి స్కాట్లాండ్‌లోని (Scotland) బర్లోక్కోలో (Barlocco) ఉంది. జనారణ్యానికి దూరంగా, ప్రశాంతంగా ఉన్న ఈ ద్వీపం ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. స్కాట్లాండ్‌లోని దక్షిణ తీర ప్రాంతంలోని ఉన్న ఈ ఐలాండ్ ధర 190,000 డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.5 కోట్లుగా ఉందని సీఎన్ఎన్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ద్వీపంలో ఒక సరస్సు ఉంది. శీతాకాలంలో మూగజీవాలు, ఇతర ప్రాణాలకు నీటి సప్లయ్ దీని ద్వారానే జరుగుతోంది. ఈ ఐలాండ్‌లో గులకరాళ్లతో కూడిన బీచ్ కూడా ఉంది. ఈ బీచ్‌లో నడవొచ్చు లేదా తక్కువ అలలే ఉంటాయి కాబట్టి పడవ (Boat) కూడా నడపొచ్చు.

స్కాట్లాండ్‌లోని ఈ ప్రైవేటు ఐలాండ్‌కు చాలా రొమాంటిక్ సెంటిమెంట్ ఉందని ఈ ద్వీపం అమ్మకం ప్రక్రియను నిర్వహిస్తున్న గల్‌బ్రైట్ గ్రూపునకు చెందిన ఆరోన్ ఎడ్గర్ ఆఫ్ ( Galbraith Group) వెల్లడించారు. రోజువారి గజిబిజి లైఫ్‌కు దూరంగా చక్కటి ప్రశాంతతను ఇక్కడ అనుభవించవొచ్చునని, చుట్టూ చాలా అందమైన దృశ్యాలు ఉంటాయని ప్రకటనలో ఆ సంస్థ పేర్కొంది.

ఈ ద్వీపానికి సమీప పట్టణం కేవలం 6 మైళ్ల దూరంలోనే ఉంది. సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి కేవలం 1 గంట సమయమే పడుతుంది. లండన్ 350 మైళ్లు, ఎడిన్‌బర్గ్ 100 మైళ్ల దూరంగా ఉన్నాయని వివరించింది.

ఈ ఐలాండ్ పరిమాణం 25 ఎకరాలుగా ఉంది. అంతా పచ్చని గడ్డి, రాళ్లతో కప్పబడి ఉంది. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి వ్యూస్ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పక్షులు కూడా అక్కడ ఆహ్లాదకరంగా తిరుగుతున్నాయని గల్‌బ్రైట్ గ్రూప్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ద్వీపంలో అన్నీ రకాల వన్యప్రాణాలు ఉన్నాయి. అరుదైన జీవాలు కూడా ఉన్నాయి. రాక్ సీ లావెండర్, ప్రాగ్రంట్ ఆర్చిడ్ వంటి అరుదైన మొక్కలు కూడా ఉన్నాయి. కాగా స్కాట్లాండ్‌లో తాము విక్రయిస్తున్న వేర్వేరు ప్రైవేటు ఐలాండ్లకు దేశీయ, అంతర్జాతీయ పార్టీల నుంచి దృఢమైన డిమాండ్ ఉందని ఎడ్గర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Audio to Text: స్పీచ్‌ రికగ్నిషన్‌ రంగంలో సంచలనం వచ్చేస్తోంది!

Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు బంగారమే ఎందుకు?.. స్థోమతలేనివారు ఇలా చేస్తే పసిడి కొన్నట్టే...

Updated Date - 2023-04-23T16:12:38+05:30 IST