AP Politics: పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఆ ఎంపీ వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా?

ABN , First Publish Date - 2023-07-19T20:50:16+05:30 IST

గత లోక్‌సభ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఎంపీగా గెలిచిన తర్వాత లోకల్‌గా పార్టీలో లుకలుకల కారణంగా శ్రీకృష్ణదేవరాయలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్ అవుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

AP Politics: పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఆ ఎంపీ వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా?

ఏపీ(Andhra Pradesh)లో అధికార పార్టీ వైసీపీ(YSRCP)లో అసంతృప్త నేతల జాబితా అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వచ్చారు. పంచకర్ల రమేష్‌బాబు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆమంచి శ్రీనివాసులు వంటి నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ జాబితా మరింత పెరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అటు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే వైసీపీకి పక్కలో బళ్లెంలా మారారు. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ కూడా అసంతృ‌ప్తిగా ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ఎంపీ ఎవరో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన్ విద్యా సంస్థల గురించి తెలియని వారు ఉండరు. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల విజ్ఞాన్ కాలేజీలకు బ్రాంచీలు ఉన్నాయి. విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్యకు మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా ఆయన విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఎంపీగా గెలిచిన తర్వాత లోకల్‌గా పార్టీలో లుకలుకల కారణంగా శ్రీకృష్ణదేవరాయలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్ అవుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

sri krishna devarayalu.jpg


గతంలో టీడీపీ ఎంపీలతో సన్నిహితంగా మెలిగిన శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల నారా లోకేష్ పాదయాత్రలో ఆయనతో భేటీ కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా విజ్ఞాన్ మెడికల్ కాలేజీకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం కూడా వైసీపీ ఎంపీలో అసంతృప్తి జ్వాలకు కారణమని తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణకు ఇచ్చినంత ప్రాధాన్యం వైసీపీ ప్రభుత్వంలో దక్కుతుందని భావించి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భంగపడ్డారు. అటు ఆయన కమ్మ వర్గానికి చెందిన నేత కూడా కావడంతో వైసీపీలో ప్రాధాన్యం దక్కలేదని ప్రచారం సాగుతోంది. తన మాటకు పార్టీలో విలువ లేకపోవడంతో వైసీపీ ఎంపీని తీవ్రంగా బాధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు టాక్ నడుస్తోంది.

మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలుకు ప్రత్యామ్నాయంగా మరో నాయకుడికి తెరపైకి తెచ్చేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోందని సమాచారం అందుతోంది. దీంతో ఎంపీ లావు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడం.. వైసీపీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి అంశాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలోనూ విలువ లేక.. అటు ఢిల్లీలో కూడా స్వేచ్ఛ లేకపోవడంతో పదవులు ఉన్నా ఎందుకు దండగ అన్న రీతిలో ఎంపీ లావు ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పార్టీ మార్పు అంశంపై ఎంపీ లావు స్వయంగా ప్రకటన చేయనప్పటికీ రానున్న రోజుల్లో మాత్రం ఆయన తన మనసు మార్చుకుని వైసీపీకి షాక్ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

AP Politics: పవన్ కళ్యాణ్-అలీ మధ్య దూరం మరింత పెరిగిందా? సాక్ష్యం ఇదేనా?

Updated Date - 2023-07-19T20:52:53+05:30 IST