AP Politics: పవన్ కళ్యాణ్-అలీ మధ్య దూరం మరింత పెరిగిందా? సాక్ష్యం ఇదేనా?

ABN , First Publish Date - 2023-07-19T15:49:22+05:30 IST

2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్, అలీ మధ్య దూరం పెరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియో పోస్ట్ చేశారు. తన జీవితంలో తాను కలిసిన సింపుల్‌, టాలెండ్‌ పర్సన్స్‌ను గుర్తుచేసుకుంటూ వాళ్లతో దిగిన ఫొటోలను వీడియోలో పవన్ పొందుపరిచాడు. హీరోయిన్లు, దర్శకులనే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుల పేర్లను కూడా పవన్ తన వీడియోలో ప్రస్తావించాడు. కానీ ఆ ఫోటోల్లో అలీ ఎక్కడా కనిపించకపోవడంతో పవన్, అలీ మధ్య మరింత దూరం పెరిగిందని అందరూ భావిస్తున్నారు.

AP Politics: పవన్ కళ్యాణ్-అలీ మధ్య దూరం మరింత పెరిగిందా? సాక్ష్యం ఇదేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ(Tollywood)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ కమెడియన్ అలీ (Ali) ఎంతో మంచి స్నేహితులు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతకాలంగా పవన్ సినిమాల్లో అలీ కనిపించడం లేదు. కారణం రాజకీయాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన (Janasena) పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో బిజీ కాగా మరోవైపు అలీ కూడా ఒకవైపు సినిమాలు చేస్తూనే జగన్ నాయకత్వంలోని వైసీపీ(YSRCP)లో చేరి యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్, అలీ మధ్య దూరం పెరిగింది. అయితే పలు సందర్భాల్లో తమ ఇద్దరి రాజకీయ దారులు వేరైనా పవన్‌తో తనకు గ్యాప్ లేదని... తమ బంధం కొనసాగుందని అలీ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి పవన్ జీవితంలో అలీ లేనట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నిత్యం వైసీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య వాగ్వాదం జరుగుతుండటం అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ టార్గెట్‌గా వైసీపీ నేతలు నీచంగా పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగత హననం చేస్తున్నారు. అటు అలీకి వైసీపీ ఏపీ మీడియా సలహాదారు అనే ప్రాధాన్యం లేని పదవిని కూడా కట్టబెట్టింది. దీంతో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌పై అలీ రాజకీయ విమర్శలు చేశాడు. అవసరమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని అలీ ప్రకటించాడు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని స్పష్టం చేశాడు. పవన్ తనకు మిత్రుడే కానీ, స్నేహం వేరు.. రాజకీయాలు వేరు అని వ్యాఖ్యానించాడు.


కానీ అలీ పేరును తన డిక్షనరీలోకి కూడా పవన్ రానివ్వడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియో పోస్ట్ చేశారు. తన జీవితంలో తాను కలిసిన సింపుల్‌, టాలెండ్‌ పర్సన్స్‌ను గుర్తుచేసుకుంటూ వాళ్లతో దిగిన ఫొటోలను వీడియోలో పవన్ పొందుపరిచాడు. హీరోయిన్లు, దర్శకులనే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుల పేర్లను కూడా పవన్ తన వీడియోలో ప్రస్తావించాడు. కానీ ఆ ఫోటోల్లో అలీ ఎక్కడా కనిపించకపోవడంతో పవన్, అలీ మధ్య మరింత దూరం పెరిగిందని అందరూ భావిస్తున్నారు. గతంలో పవన్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న అలీ ఫోటో కనిపించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్‌ను కాదని అలీ వైసీపీలో చేరడంతో పాటు పవన్‌పై విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది.

కాగా పవన్ కళ్యాణ్ తన సినిమాలలో అలీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇతర కమెడియన్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నాడు. అంతేకాకుండా అలీ తన కూతురి పెళ్లికి పవన్‌ను ఆహ్వానించినా వేర్వేరు కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు హాజరు కాలేదు. దీంతో పవన్, అలీ మధ్య చెడిందని గతంలోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ తన వీడియోలో అలీ ఫోటోను చేర్చకపోవడంతో నిజంగానే అలీని పవన్ దూరం పెడుతున్నారంటూ చర్చ నడుస్తోంది. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారా లేదా ఈ గ్యాప్ ఇలాగే కొనసాగిస్తారా అన్నది ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Collage Maker-19-Jul-2023-03-51-PM-8604.jpg

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan Kuppam: ‘కుప్పానికి పవన్‌ రావాలి’.. ఈ మాటన్నది ఎవరంటే..?

AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

Updated Date - 2023-07-19T16:00:00+05:30 IST