Fact Check: మరింత దిగజారిన వైసీపీ.. లోకేష్ యువగళంపై తప్పుడు ప్రచారం

ABN , First Publish Date - 2023-08-23T13:43:25+05:30 IST

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న జనాదరణను వైసీపీకి మింగుడుపడటం లేదు. దీంతో తప్పుడు ప్రచారానికి పూనుకుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు చేసినట్లు వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఎంపీ గల్లా జయదేవ్ స్పందించి ఈ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండించారు.

Fact Check: మరింత దిగజారిన వైసీపీ.. లోకేష్ యువగళంపై తప్పుడు ప్రచారం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం నాడు గన్నవరంలో లోకేష్ సభకు భారీస్థాయిలో ప్రజలు తరలివచ్చారు. అయితే ఈ ప్రజాభిమానాన్ని చూసి వైసీపీ ఓర్వలేకపోయినట్లు కనిపిస్తోంది. దీంతో తమకు తెలిసిన రీతిలో అసత్య ప్రచారాలకు శ్రీకారం చుట్టింది. నారా లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు చేసినట్లు వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల నారా లోకేష్ కంటిన్యూగా 12 గంటల పాటు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. దీంతో అర్ధరాత్రి పాదయాత్రలేంటి.. మతిపోయిందా అని లోకేష్‌ను విమర్శించినట్లు ఓ న్యూస్ యాప్ కథనం ప్రచురించినట్లు వైసీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేసి శునకానందం పొందుతోంది.

వైసీపీ కుయుక్తులను గమనించిన గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ అంశంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. యువగళం పాదయాత్రపై ప్రజలకు నమ్మకం లేదని తాను వ్యాఖ్యానించినట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. ఆయన తలపెట్టిన పాదయాత్రపై తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతోందని.. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. తాను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా కేవలం తన ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ వార్తలను, వీరు అవలంభించిన పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు.


మరోవైపు నారా లోకేష్ యువగళం కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొనడం లేదని కూడా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా లోకేష్ పాదయాత్ర చేయకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల విజయవాడలో సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద టీడీపీ శ్రేణులను కావాలనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి నారా లోకేష్ తనదైన శైలిలో హెచ్చరికలు కూడా పంపారు. తన యువగళం సాగనిస్తే అది పాదయాత్రలా ఉంటుందని.. లేకపోతే దండయాత్రను తలపిస్తుందని లోకేష్ హెచ్చరించారు. తన యువగళం ప్రారంభమైన నాటి నుంచి వైసీపీలో భయం పట్టుకుందని.. టీడీపీకి ప్రజలు మద్దతు ఇస్తున్న తీరు జగన్‌కు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు.

కాగా ఇప్పటివరకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 191 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం నాడు 192వ రోజుకు చేరుకుంది. యువగళం వేదికగా వైసీపీ అక్రమాలు, కుట్రలు, అవినీతిపై లోకేష్ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం గన్నవరం సభలో సీఎం జగన్‌ను ఇసుకాసురుడు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. లోకేష్ సవాల్‌ను స్వీకరించలేని వైసీపీ ప్రభుత్వం తమకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారాలకు పూనుకుంది. ఏకంగా టీడీపీ నేతలను అడ్డం పెట్టుకుని లోకేష్‌ను విమర్శిస్తోంది. నెటిజన్‌లు మాత్రం తమ చాతుర్యంతో వైసీపీ అసత్య ప్రచారాలను కనిపెట్టి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Bandi Sanjay: మారిన ‘బండి’ రూట్.. పవన్ కళ్యాణ్‌పై అప్పుడలా.. ఇప్పుడిలా..!!

Kodali Nani: కొడాలి నాని యూటర్న్.. కాలమే గట్టి సమాధానం చెప్పిందంటున్న ఫ్యాన్స్

Updated Date - 2023-08-23T14:02:38+05:30 IST