Viveka Murder Case : విచారణకు రండి.. ఎంపీ వైఎస్ అవినాష్‌కు సీబీఐ నోటీసులు.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకో..!?

ABN , First Publish Date - 2023-05-15T18:37:19+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపలనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అటు సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేయగా..

Viveka Murder Case : విచారణకు రండి.. ఎంపీ వైఎస్ అవినాష్‌కు సీబీఐ నోటీసులు.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకో..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపలనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అటు సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేయగా.. తాజాగా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు (మే-16న) విచారణకు రావాలని నోటీసుల్లో (CBI Notice) సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ఎంపీని సీబీఐ ప్రశ్నించింది. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఏం జరుగుతుందో ఏమో అని అవినాష్ అభిమానులు, అనుచరుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు.. వివేకా హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి (Uday Kumar Reddy) బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఇటు బెయిల్ పిటిషన్ కొట్టేయడం.. అటు అవినాష్‌కు నోటీసులు ఇవ్వడంతో.. మంగళవారం నాడు ఇద్దర్నీ కూర్చొబెట్టి సీబీఐ విచారించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Avinash-Reddy.jpg

అరెస్ట్ తప్పదా..?

రేపటి విచారణ తర్వాత సీబీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని హైదరాబాద్‌లో (Hyderabad) పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆ కీలక నిర్ణయం అరెస్ట్ అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అవినాష్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే రెండు, మూడ్రోజులు సీబీఐ విచారణకు అవినాష్ వెళ్లారు.. అయితే అప్పుడే అరెస్ట్ చేయొచ్చని అందరూ అనుకున్నారు కానీ సీబీఐ మాత్రం అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో మరోసారి విచారణకు రావాలని సీబీఐ పిలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి సీబీఐ ఏమేం ప్రశ్నల అడగబోతోంది..? అరెస్ట్ తప్పదా..? ఈ వ్యవహారంపై వైసీపీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది..? అనేదానిపై ఎంపీ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కాగా.. అవినాష్ కచ్చితంగా అరెస్ట్ అవుతారని గత నెలలోనే పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కూడా నడిచిన సంగతి తెలిసిందే.

Avinash-In-Car.jpg

కడప నుంచి తిరుగుపయనం..!

సోమవారం మధ్యాహ్నం ఎంపీ అవినాష్ కడపకు బయల్దేరివెళ్లారు. అయితే ఈయన కడపకు చేరుకున్న గంట వ్యవధిలోనే నోటీసులు వచ్చినట్లు వ్యక్తిగత సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న ఎంపీ హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. దీంతో అప్పుడే రావడం.. మళ్లీ బయల్దేరడంతో ఏం జరుగుతోందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు వీరాభిమానులు, ముఖ్య అనుచరులు ఎంపీ వెంటే హైదరాబాద్‌కు బయల్దేరి వచ్చారు.

Avinash-Reddy-CBI-Enquiry.jpg

ఏం జరుగుతుందో..!

కాగా.. అవినాష్ ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణ అటు ఎంపీ.. ఇటు వైఎస్ సునీతారెడ్డి.. సీబీఐ తరఫున లాయర్లు వాదనలు జరిగిన విషయం తెలిసిందే. బెయిల్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐకి ఫుల్ పవర్స్ కూడా ఇచ్చేసింది. అంతేకాదు.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ప్రభావం చూపుతుందని సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దాదాపు అవినాష్ అరెస్ట్‌ కాకుండా ఉండటానికి మార్గాలు అన్నీ మూసుకుపోయినట్లే. ఆ తర్వాత సీన్ రికన్‌స్ట్రక్షన్ కోసం పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం వివేకా, అవినాష్ రెడ్డి, ఎంపీ పీఏ రాఘవ రెడ్డి ఇంటిని నిశితంగా పరిశీలించింది. ఈ పరిణామలన్నింటి తర్వాతే సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో మంగళవారం నాడు ఏమైనా జరగొచ్చని తెలుస్తోంది.

CBI-Enquiry.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************
Karnataka Results : అరెరే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఏరికోరి మరీ బ్రహ్మానందంను తెచ్చుకుంటే..!

******************************

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..


******************************


Updated Date - 2023-05-15T18:42:50+05:30 IST