TS Politics : హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యూహాలు.. ఈసారి తండ్రిపై కుమార్తే పోటీ చేస్తారని ప్రచారం.. అసలు విషయం తెలిస్తే..!?

ABN , First Publish Date - 2023-07-16T19:13:48+05:30 IST

తండ్రి.. బీఆర్ఎస్ (BRS) తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు..! రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేంట్రా అంటే శూన్యమేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి..! పైగా సొంత నియోజకవర్గంలో ప్రజల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.. ఇవన్నీ నిజమేనని నిరూపించబడ్డాయి కూడా..!..

TS Politics : హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యూహాలు.. ఈసారి తండ్రిపై కుమార్తే పోటీ చేస్తారని ప్రచారం.. అసలు విషయం తెలిస్తే..!?

తండ్రి.. బీఆర్ఎస్ (BRS) తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు..! రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేంట్రా అంటే శూన్యమేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి..! పైగా సొంత నియోజకవర్గంలో ప్రజల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.. ఇవన్నీ నిజమేనని నిరూపించబడ్డాయి కూడా..! ఇలా ఒకట్రెండు కాదు నెలకో వివాదం ఈయనపై వస్తూనే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ ఎమ్మెల్యే.. ఆఖరికి కన్న కూతురి భూమిని కూడా వదలకుండా ఆక్రమించారని కేసులు కూడా నడుస్తున్నాయి. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రినే కొద్దిరోజులుగా కుమార్తె ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడటంతో రాజకీయాల్లోకి రావాలని ఆమెపై ఒత్తిడి పెరుగుతోందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..? తండ్రిపై నిజంగానే కుమార్తె బరిలోకి దిగుతున్నారా..? ఇందులో నిజానిజాలెంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


muthireddy-yadagiri-reddy.jpg

ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..?

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన ఇదిగో ఫలానా అభివృద్ధి పని చేశారనడం కంటే.. వివాదాలు, భూకబ్జాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అందుకే ఈయన్ను ప్రత్యర్థులు ‘వివాదాల రెడ్డి’, ‘కబ్జా రెడ్డి’ గా పిలుస్తుంటారు. సొంత నియోజకవర్గం.. పక్క నియోజకవర్గం అని కాదు ఈయనపై చాలా ప్రాంతాల్లో ప్రజల, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిని కబ్జా చేసి కుమార్తె తుల్జాభవానీ రెడ్డి (Tulja Bhavani Reddy) పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు రాగా.. ఇది నిజమేనని తేలింది. దీంతో రంగంలోకి దిగిన కుమార్తె.. ‘ నా తండ్రి ఊరి భూమిని కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను క్షమాపణ కోరుతున్నాను. నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తి చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్ చేయుచున్నాను’ అని బోర్డులు వేయించి మరీ.. ఆ భూమిని తిరిగి అప్పగించారు తుల్జాభవానీ. అంతేకాదు.. ఆ భూమికి అడ్డంగా గోడ కట్టిన గోడను కూడా కూల్చి వేయించారు. ఈ వివాదంతో ముత్తిరెడ్డిని జనాలంతా తిట్టిపోయగా.. కుమార్తెకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఇలా ఒకట్రెండు కాదు చెప్పుకుంటూ పోతే ముత్తిరెడ్డి బాగోతాలు చాలానే ఉన్నాయి. తండ్రి బాగోతాలను ఆమె ఎక్కడికక్కడ జనం మధ్యలోనే ప్రశ్నించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వచ్చాయి.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా తుల్జా ధైర్యాన్ని, తెగువను, నిజాయితీని ప్రజలు కొనియాడుతున్నారు.

Tulja-Bhavani-Reddy.jpg

ఇదీ అసలు కథ..!

తండ్రిపైనే పోరాటం చేస్తూ.. ప్రజల పక్షాన నిలబడుతున్న తుల్జాను రాజకీయాల్లోకి రావాలని సన్నిహితులు, నియోజకవర్గంలోని కొన్ని వర్గాల ప్రజలు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొలిటికల్ ఇంట్రీ ఇచ్చి జనగామ అసెంబ్లీ (Jangaon Assembly constituency) నుంచే ముత్తిరెడ్డిపైనే (Muthireddy) పోటీచేయాలని.. కచ్చితంగా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని అనుచరులు, సన్నిహితులు సూచిస్తున్నట్లు తెలియవచ్చింది. ముత్తిరెడ్డిని ఎదిరించి జనంలోకి వస్తే కచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుందని.. పొలిటికల్ వేవ్‌ కూడా గట్టిగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సన్నిహితుల సూచనలపై తుల్జా సీరియస్‌గా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ (Political Entry) ఇవ్వడానికి రెడీ అయితే జనగామ నుంచి తండ్రిపైనే పోటీ చేస్తారన్న మాట. మరోవైపు.. ఇప్పటికే కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు పార్టీలోకి రావాలని ప్రత్యేకంగా సమావేశమై.. ఆహ్వానించారని కూడా వార్తలు వస్తున్నాయి.

Tulja-Bhavani-Reddy-1.jpg

ఏం జరుగుతుందో..?

ఇదిలా ఉంటే.. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ప్రజాదరణ లేని, వివాదాల్లో మునిగిన సిట్టింగ్‌లకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) తేల్చి చెప్పేశారట.! దీంతో కొందరు సిట్టింగ్‌లు పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి..! ఈ పరిస్థితుల్లో ముత్తిరెడ్డికి కేసీఆర్ టికెట్ ఇస్తారా.. హ్యాండిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ముత్తిరెడ్డి కుమార్తెకే (Muthireddy Daughter) బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొచ్చిని కొందరు చెబుతుంటే.. తండ్రికే టికెట్ ఇస్తారని మరికొందరు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారట. ముత్తిరెడ్డికే ఈసారి టికెట్ ఇస్తే మాత్రం.. తుల్జాను కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారట. సమాలోచనలు చేస్తున్న భవానీ.. ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎటువైపు అడుగులేస్తారో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

BRS.jpg


ఇవి కూడా చదవండి


Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?


AP Politics : వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలేమో.. ఛీ.. ఛీ.. సిగ్గు పడండి సీఎం..!


TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


Updated Date - 2023-07-16T19:25:21+05:30 IST