Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?

ABN , First Publish Date - 2023-07-15T20:46:50+05:30 IST

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..

Rajasingh : ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్‌పై హైకమాండ్ ఒత్తిడి.. గోషామహల్ నుంచి బరిలోకి యువ నేత..!?

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ రాజాసింగ్‌ను ఎక్కడ్నుంచీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయించాలని బీజేపీ భావిస్తోంది..? ఎంపీగా (MP) పోటీచేయడానికి సింగ్ సిద్ధంగానే ఉన్నారా..? గోషామహల్ నుంచి పోటీచేసే ఆ యువనేత ఎవరు..? అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహమేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Raja-Singh.jpg

ఇదీ అసలు కథ..

రాజాసింగ్.. గోషామహల్ ‘బాద్‌షా’గా, కరుడుగట్టిన హిందూ (Hindu) భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను పార్టీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేసింది అధిష్టానం. ఏడాది దాటినా సస్పెన్షన్ వేటు ఎత్తేయకపోవడం, ప్రాణహాని ఉందన్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉండిపోయారు. బీజేపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించట్లేదు. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలియట్లేదుగానీ సడన్‌గా మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఆ మరుసటిరోజే రాజాసింగ్‌ గురించి బాంబ్ లాంటి వార్త బయటికొచ్చింది. అదేమిటంటే.. రానున్న ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీచేయట్లేదట. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ (Zaheerabad) పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాజాసింగ్ మాత్రం సుముఖంగా లేరని తెలియవచ్చింది. కొన్నిరోజులుగా అధిష్టానం-రాజాసింగ్ మధ్య పోటీపై పెద్ద పంచాయితీనే నడుస్తోందని తెలుస్తోంది. రాజాసింగ్ ఒప్పుకోకపోవడంతో దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు మరింత ఆలస్యమవుతోందని సమాచారం. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఆయన.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేసి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో అధిష్టానం ‘ఎంపీ’గా పోటీచేయాలని సూచించడంతో ఏం చేయాలో దిక్కుతోచట్లేదట. అయితే.. రాజాసింగ్‌ను జహీరాబాద్ నుంచి పోటీచేయిస్తే కచ్చితంగా బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమాలో అగ్రనాయకులు ఉన్నారట. అందుకే ఒత్తిడి తెచ్చిమరీ పోటీకి దింపాలని ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

bjp.jpg

గోషామహల్ నుంచి ఎవరు..?

రాజాసింగ్‌ను ఎంపీగా పోటీచేయిస్తే.. గోషామహల్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ను (Vikram Goud) పోటీచేయించాలన్నది బీజేపీ పెద్దల ప్లానట. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన విక్రమ్.. నియోజకవర్గంలో తనపని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా రాజాసింగ్ సైలెంట్ అయ్యేసరికి గోషామహల్‌లో సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు యువనేత. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. తానే బీజేపీ అభ్యర్థినని పలుమార్లు ప్రకటించుకున్నారు కూడా. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఇలా ప్రకటన చేశారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అయితే.. ఈయనకు బీజేపీ క్యాడర్ ఏ మాత్రం సహకరిస్తుందన్న ప్రశ్నార్థకంగానే ఉంది. మరోవైపు.. రాజాసింగ్ మాత్రం ఎమ్మెల్యేగా తప్ప.. ఎంపీగా పోటీచేసే ప్రసక్తే లేదని అవసరమైతే రాజకీయ సన్యాసం అయినా తీసుకుంటానే గానీ గోషామహల్‌‌ను వదలనని శపథం చేసి కూర్చున్నారట.

Vikram-gowd.jpg

మొత్తానికి చూస్తే.. గోషామహల్ నుంచి రెండుసార్లు పోటీచేసి గెలిచిన రాజాసింగ్ కంచుకోటగా అభిమానులు భావిస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఆయన్ను పక్కనెట్టి విక్రమ్ గౌడ్‌కు ఇస్తే పరిస్థితేంటి..? పైగా అక్కడున్న రాజకీయ వాతావరణాన్ని రాజాసింగ్ మాత్రమే తట్టుకోగలరని.. ఇంకెవ్వరూ అక్కడ నిలువలేరని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం నిర్ణయం ఎంతవరకు కరెక్ట్..? ఎంపీగా పోటీచేయాల్సిందేనని రాజాసింగ్‌ను పట్టుబడుతున్న ఈ తరుణంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


AP Politics : వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలేమో.. ఛీ.. ఛీ.. సిగ్గు పడండి సీఎం..!


TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్


BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?


BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?


Updated Date - 2023-07-15T20:49:35+05:30 IST