BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?

ABN , First Publish Date - 2023-07-14T18:03:57+05:30 IST

అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్‌ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..

BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?

అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్‌ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.! ఒకటా రెండా పోలవరం నుంచి మద్యపాన నిషేధం వరకూ ఇలా ఏదీ వదలకుండా అన్ని విషయాలనూ ప్రస్తావించి మరీ దుమ్ము దులిపి వదిలారు పురంధేశ్వరి. ఆమె ప్రసంగించిన తీరు.. విమర్శలను చూసిన కార్యకర్తలు, కమలనాథులు ఒకింత ఆశ్చర్యపోయారు.. ఇన్నిరోజులున్న సోమువీర్రాజు ఎందుకింత స్పీడ్‌గా లేరు.. ఎంతైనా అన్నగారు ఎన్టీఆర్ (Sr NTR) కూతురు కదా.. ఆ మాత్రం వాక్చాతుర్యం ఉంటుందిలెండని నేతలు చెప్పుకుంటున్నారు!. ఇక కార్యకర్తలు అయితే.. చిన్నమ్మ సార్.. చిన్నమ్మ (Chinnamma) అంతే అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ అటుంచితే.. పురంధేశ్వరి ఈ రేంజ్‌లో వైసీపీ సర్కార్‌ను దుమ్మెత్తిపోసినా అధికార పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ స్పందించిన దాఖలాల్లేవ్. ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, వామపక్షాలు చిన్నపాటి విమర్శలు గుప్పించినా మీడియా ముందుకొచ్చి ఒంటికాలిపై లేచే వైసీపీ నేతలు (YSRCP Leaders) ఇంత మౌనం ఎందుకు పాటిస్తున్నారు..? కౌంటర్ అటాక్ చేయడానికి భయపడుతున్నారా..? లేకుంటే మరేదైనా ఉందా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Purandeswari.jpg

ఇదీ అసలు కథ..!

బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం నాడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ (CM Jagan).. పేదలు, రైతులు, మహిళలు.. అన్ని వర్గాలనూ వచించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల రక్తం, మహిళల పుస్తెలతో తాడేపల్లి ప్యాలెస్‌లో సొంత ఖజానా నింపుకొంటున్నారని విమర్శించారు. మద్య నిషేధం మొదలుకొని ప్రతి హామీలోనూ ఆంధ్రులను వంచించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు (Polavaram) కేంద్రం నిధులు ఇస్తున్నా నిర్మాణం చేయలేకపోతే కేంద్రానికి ప్రాజెక్టు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించే వారిని గద్దె దించేందుకు బీజేపీ వెనుకాడబోదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. అక్కను వేధిస్తోన్న ఆకతాయిలను అడ్డుకున్న బాలుడు బాపట్లలో నిలువునా దహనమయ్యాడని పురంధేశ్వరి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. స్వర్ణాంధ్రగా చూడాలనుకున్న రాష్ట్రాన్ని విధ్వంసాంధ్రగా చేసిన జగన్‌ పాలకుడిగా ఉండటానికి ఏ మాత్రం అర్హుడు కాదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో హామీలిచ్చిన వైసీపీ అధ్యక్షుడు సీఎం అయ్యాక ప్రజల్ని అన్నింటా వంచించారన్నారు. ఇలా ఒకటా రెండా.. ఏపీ ప్రభుత్వం (AP Govt) చేస్తున్న తప్పొప్పులను తన మొదటి ప్రసంగంలోనే ఎత్తి చూపి చెడుగుడు ఆడుకున్నారు. పనిలో పనిగా.. జనసేనతో (Janasena) బీజేపీ పొత్తు కంటిన్యూ అవుతుందని.. నిన్న ఉన్నాం.. నేడు ఉన్నాం.. రేపూ ఉంటామని ఇక ఇతర పార్టీల పొత్తుల విషయంలో తుది నిర్ణయం అధిష్టానమే చూసుకుంటుందన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ప్రభుత్వం తమ పేరు, ఫోటోలు పెట్టుకొని రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తోందని విమర్శనాస్త్రాలు సంధించారు. సచివాలయాలను కూడా కేంద్ర నిధులతోనే నిర్మించారని.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమి లేదని.. అంతా కేంద్రమే చేసిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.

Purandeswari-1.jpg

రియాక్షన్ లేదేం..?

ప్రభుత్వ వైఫల్యాలను పురంధేశ్వరి పిన్ టూ పిన్‌గా ఎత్తిచూపి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినప్పటికీ వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) .. ప్రభుత్వం గురించి పొల్లెత్తి మాట అన్నా విరుచుకుపడే వైసీపీ నేతలు.. పురంధేశ్వరి ఇన్ని మాటలు అన్నా ఎందుకు స్పందించలేదన్నది ఇప్పుడు ఏపీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటి వరకూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజు వైసీపీకి వకల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడారే తప్ప.. వైఎస్ జగన్‌ను ప్రశ్నించిన సందర్భాల్లేవని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. కేంద్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో బీజేపీ పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉనికి కోసం పోరాటమే కావడంతో ఇక ఇలాగైతే కాదని.. పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా చేసింది అగ్రనాయకత్వం. బాధ్యతలు చేపట్టాక మొదటి ప్రసంగంతోనే కార్యకర్తల్లో మునుపెన్నడూలేని జోష్ తెప్పించారు. పురంధేశ్వరి రాకతో వైసీపీలో వణుకు మొదలైందని.. ఆమె సంధించిన ప్రశ్నలు, విమర్శలకు ఒక్కరంటే ఒక్కరంటే ఒక్కరూ స్పందించకపోవడంతో ఎదురుదాడి చేస్తే అసలుకే ఎసరొచ్చిపడుతుందని భయపడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏపీలో మిత్ర పక్షాలన్నీ ఒక్కటవుతున్న పరిస్థితుల్లో కేంద్రంతో గొడవలు పెట్టుకునే పరిస్థితుల్లో వైసీపీ లేదని తెలుస్తోంది. ఎన్డీయేకు టీడీపీ దగ్గరవుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి చెప్పకనే చెప్పేశారు. అసలే అడిగినప్పుడల్లా అప్పు.. కేసుల విషయంలో కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అసలు బీజేపీని టచ్ చేస్తే ఢిల్లీ నుంచి గల్లీ వరకూ బ్లాస్టింగ్ అయినట్లేనని వైసీపీ నేతలు భావిస్తున్నారట. అందుకే జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారట.

YS-Jagan.jpg

అటు.. ఇటు స్పష్టమైన ఆదేశాలు!

పురంధేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రసంగంతోనే వైసీపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో చెలరేగడం బీజేపీ నేతలతో పాటు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఇన్నాళ్లు ఒక లెక్క.. చిన్నమ్మ వచ్చాక ఒక లెక్క అని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్న పరిస్థితి. అసలే.. వైసీపీ- బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్న తరుణంలో చిన్నమ్మ ప్రసంగంతో సీన్ రివర్స్ అయ్యిందని.. ఇప్పుడే జగన్‌కు అసలు సిసలైన సినిమా మొదలైందనే టాక్ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ‘జగన్ సర్కార్‌పై ఇక దూసుకెళ్లండి’ అని ఢిల్లీ నుంచి వచ్చిన స్పష్టమైన సంకేతాలు వలనే పురంధేశ్వరి ఈ రేంజ్‌లో దుమ్ముదులిపారనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే.. జగన్ మాత్రం బీజేపీ విమర్శలకు పొరపాటున కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వనక్కర్లేదని.. ఒకవేళ టచ్ చేస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుందని నేతలు, క్యాడర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మొదటి ప్రసంగంతోనే జగన్‌ను ఈ రేంజ్‌లో ఆడుకున్నారంటే.. మున్ముందు ఎలా ఉంటుందో ఏంటో మరి.

BJP-And-YSRCP.jpg


ఇవి కూడా చదవండి


BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?


TS Politics : హిమాన్ష్ సూచన తప్పకుండా తీసుకుంటాం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


Revanth Vs KCR : తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ నడుస్తుండగా.. షాకింగ్ సర్వే అంటూ సడన్‌గా బాంబ్ పేల్చిన రేవంత్ రెడ్డి


TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తేలిందంటే..!


TS BJP : తెలంగాణపై బీజేపీ దూకుడు.. పెద్ద ప్లాన్‌తోనే కమలనాథులు వచ్చేస్తున్నారుగా.. ముహూర్తం ఫిక్స్..!


Pawan Anna lezhneva : ఉంటే ఉంటా.. పోతే పోతా.. భార్యకు క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్.. భావోద్వేగం!


Kishan Reddy : కిషన్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడింది.. పయనం ఎటో తేల్చుకోలేక అయోమయంలో అధ్యక్షుడు..!?


Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?


Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?


Updated Date - 2023-07-14T18:14:18+05:30 IST