Kishan Reddy : కిషన్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడింది.. పయనం ఎటో తేల్చుకోలేక అయోమయంలో అధ్యక్షుడు..!?

ABN , First Publish Date - 2023-07-11T20:44:26+05:30 IST

అవును.. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పెద్ద చిక్కే వచ్చిపడింది..! అసలు ఏం చేయాలబ్బా..? అని ఫుల్ టెన్షన్‌తో ఉన్నారట.! అంతేకాదు ఆయన ముందున్న రెండు ఆప్షన్లున్నాయ్.. ఇవీ రెండూ కీలకమైనవే.. ఎటు వెళ్తే ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి..

Kishan Reddy : కిషన్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడింది.. పయనం ఎటో తేల్చుకోలేక అయోమయంలో అధ్యక్షుడు..!?

అవును.. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పెద్ద చిక్కే వచ్చిపడింది..! అసలు ఏం చేయాలబ్బా..? అని ఫుల్ టెన్షన్‌తో ఉన్నారట.! అంతేకాదు ఆయన ముందున్న రెండు ఆప్షన్లున్నాయ్.. ఇవీ రెండూ కీలకమైనవే.. ఎటు వెళ్తే ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. దీంతో ఏ రూటులో వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారట. ఇంతకీ కిషన్‌కు వచ్చిన చిక్కేంటి..? ఎందుకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు..? ఇంతకీ ఆ రెండు ఆప్షన్లు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Kishan-Reddy.jpg

ఇదీ అసలు కథ..!

బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి కట్టబెట్టాక యమా స్పీడ్ మీదున్నారు. పదవి చేపట్టాక మొట్ట మొదటి వరంగల్ సభను విజయవంతం చేసి చూపించారు. అటు నేతల్లోనూ అసంతృప్తి, అలకలు రాకుండా అటు ఈటల రాజేందర్.. ఇటు కిషన్‌ ఇద్దరూ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో కిషన్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడింది..! అదేమిటంటే.. జూలై-12న కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ (Modi Cabinet Reshuffle) చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది. ఈనెల 13-14 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నందున.. ఆలోపే మంత్రివర్గంలో (Modi Cabinet) మార్పులు చేయాలని ఓ నిర్ణయానికొచ్చారట. ఇప్పటికే మంత్రులంతా ఢిల్లీ బాట కూడా పట్టారనే వార్తలు వస్తున్నాయి. అయితే కిషన్ రెడ్డి మాత్రం బుధవారం తెల్లవారుజామున అమెరికా (Kishan Reddy America Tour) వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే.. అమెరికాలో గురువారం (జూలై-13న) ప్రపంచ టూరిజంపై 15నిమిషాలపాటు కిషన్ రెడ్డి ప్రసంగించాల్సి ఉంది. ఇది కొన్నిరోజుల క్రితమే ఖరారైంది. మరోవైపు.. కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అమెరికా వెళ్లాలా..? వద్దా..? ఒకవేళ పయనం అయ్యాక ఢిల్లీ రావాలని ఫోన్ వస్తే పరిస్థితి ఏంటి..? అని అయోమయంలో పడ్డారట. మంత్రి వర్గవిస్తరణలో భాగంగా కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి పదవి పోతే అమెరికా వెళ్లలేనని అని తన సన్నిహితుల వద్ద దిగాలుగా చెబుతున్నారట.

Kishan-Reddy-F.jpg

ఇంట్రస్ట్ అంతా అటే..!

ఒక్కసారి అమెరికా ఫ్లైట్ ఎక్కితే చాలని ఇక ప్రోగ్రామ్‌కు హాజరైనట్లేనని కిషన్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికే అమెరికా వెళ్లేందుకు వీసాతో పాటు టికెట్‌లు కూడా బుక్ చేసుకుని ఏం చేద్దాం వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నారట. అయితే అమెరికా వెళ్ళడానికే కిషన్ రెడ్డి ఇంట్రస్ట్‌గా ఉన్నారట. మంగళవారం రాత్రి 8 గంటలు అయినప్పటికీ ఇంతవరకూ ఢిల్లీ నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని కిషన్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది చెబుతోంది. అయితే.. మంగళవారం రాత్రి పది గంటల వరకూ ఫోన్ కాల్ వస్తుందేమో చూసి ఇక యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే అమెరికా పర్యటనకు వెళ్లాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారట. ఈ లోపు ఏం జరుగుతుందో ఏమో అని కిషన్ అభిమానులు, అనుచరులు కంగారుపడుతున్నారట.

kishan-reddy-speed.jpg

ఢిల్లీలో సీన్ ఇదీ..!

వాస్తవానికి.. ఇప్పటికే మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్, అశ్వనీ వైష్ణవ్, మన్షుక్ మాండవియాలను ఎన్నికల ఇంఛార్జీలుగా అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్ నుంచి వీరందరికీ ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇంఛార్జిగా నియమించే అవకాశం ఉన్నందున.. స్థాన చలనం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు మహారాష్ట్ర నుంచి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్‌లో చోటు కల్పించాలని అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలియవచ్చింది. ఇక ఎల్‌జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్‌కు అవకాశం ఉండగా.. ఆర్‌ఎల్‌డీ నుంచి జయంత్ చౌదరికి కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమించడంతో.. కేంద్ర కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించే ఛాన్స్ ఉందని ఒక్కసారిగా ఢిల్లీ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కిషన్ రెడ్డి అటు అమెరికా వెళ్లాలో.. ఇటు ఢిల్లీ వెళ్లాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట.. ఏం జరుగుతుందో చూడాలి మరి.

PM-Modi.jpg


ఇవి కూడా చదవండి


Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?


Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?


Rajyasabha : తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతను రాజ్యసభకు తీసుకుంటున్న బీజేపీ.. ఆ ‘తెలుగోడు’ ఎవరంటే..!?


Rajyasabha : ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. రాజ్యసభకు ‘తెలుగోడు’..!



Updated Date - 2023-07-11T20:52:57+05:30 IST