Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?

ABN , First Publish Date - 2023-07-11T19:21:36+05:30 IST

అవును.. తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) అధికారంలోకి వస్తే సీతక్కే (Seethakka) సీఎం.. ఆ సందర్భం వస్తే చేయవచ్చు కూడా.. మల్లిఖార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) అధ్యక్షుడ్ని చేసింది కాంగ్రెస్సే.. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలున్నాయ్.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు...

Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?

అవును.. తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) అధికారంలోకి వస్తే సీతక్కే (Seethakka) సీఎం.. ఆ సందర్భం వస్తే చేయవచ్చు కూడా.. మల్లిఖార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) అధ్యక్షుడ్ని చేసింది కాంగ్రెస్సే.. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలున్నాయ్.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తెగ చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌‌లోని ఒకరిద్దరు సీనియర్లు తప్పితే ఎవరూ పెద్దగా వ్యతిరేకించిన సందర్భాలు కూడా లేవు. వాస్తవానికి.. కాంగ్రెస్‌ అంటేనే ముఖ్యమంత్రి (Chief Minister) అభ్యర్థుల పార్టీఅని పేరుంది! పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా..? అన్నదానితో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలో పోటీ పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో, రేవంత్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే రేవంత్ ఈ ప్రకటన చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.


Seethakka.jpg

ఇదీ అసలు కథ..

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంతో తెలంగాణలో మునుపెన్నడూలేని జోష్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నడనాట ఫలితాలకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అప్పటివరకూ బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని రంగం సిద్ధం చేసుకున్న నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. నేతల మధ్య ఎలాంటి గొడవల్లేకుండా అందర్నీ ఒకేథాటిపైకి తీసుకొచ్చి.. అధికారమే లక్ష్యంగా ముందుకు అడుగులేస్తున్నారు. బీఆర్ఎస్‌ను ఢీ కొట్టడానికి ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుంటున్నారు రేవంత్. ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహాత్మకంగా టీపీసీసీ చీఫ్ అడుగులేస్తున్నారు. సరిగ్గా ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కే అలియాస్ దాసరి అనసూయ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చారని.. ఇద్దరికీ అక్కా.. తమ్ముడు అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉంది. అందుకే తాను సీఎం సీటులో ఉన్నా.. సీతక్క ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ప్రత్యర్థులు, రేవంత్ అంటే గిట్టని వారు అనుకుంటున్నారే గానీ అది వాళ్ల అమాయకత్వమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద పెద్ద వ్యూహాలే ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.

Revanth-And-Seethakka.jpg

పెద్ద ప్లానే ఉందిగా..!

- బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎంను చేస్తానని చెప్పి మాటిచ్చి కేసీఆర్ తర్వాత మడమ తిప్పేశారు.!. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కనీసం ఒక్కరోజైనా సీఎం సీటుపై కూర్చొబెట్టిన పాపాన పోలేదు. దీంతో సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అయితే ఈ సామాజికవర్గం మొదట్నుంచీ కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ నాడు చెప్పిన విషయాన్ని మరోసారి ఇలా జనాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే అదే దళిత బిడ్డ సీతక్కను సీఎంగా.. తానా సభా వేదికగా రేవంత్ ప్రకటించారని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఎన్నికల ముందు నిజంగా ఇదే పెద్ద వ్యూహాత్మక ప్రకటనేనని సీనియర్ నేతలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు.

- కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం సీటు కోసం ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే.. తెలంగాణలో ఆ సీన్ రిపీట్ కాకూడదని ఇలా ముందే ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలనేది కూడా రేవంత్ ఆలోచన అయ్యి ఉండొచ్చని ఒకరిద్దరు సీనియర్లు చెబుతున్నారు. దీంతోపాటు తెలంగాణలో ఉన్న దళిత సామాజిక వర్గాన్ని అంతటినీ పార్టీ వైపే తిప్పుకునేందుకు ఇలా చేసుండొచ్చినే టాక్ కూడా నడుస్తోంది.

- వాస్తవానికి.. రాజకీయాలకతీతంగా సీతక్కకు అభిమానులు ఉన్నారు. ఒక్క ములుగు నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీరాభిమానులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో సీతక్క ఏ నియోజకవర్గంలో బరిలోకి దిగినా సులువుగా గెలిచే పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈమే సీఎం అభ్యర్థి అంటే దాదాపు పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు.. వచ్చే ఛాన్సే లేదు.. ఈ కోణంలో ఆలోచించి రేవంత్ ఎత్తుగడేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Seethakka-As.jpg

- సీతక్కను సీఎంను చేస్తే.. తెలంగాణలో తొలి మహిళగా, తొలి గిరిజన నేతగా, తొలి మాజీ మావోయిస్టుగానూ ఆమె చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా భారీ మైలేజీ ఇస్తుందని విశ్లేషిస్తున్నారు. అటు గిరిజనులనే కాకుండా ఇటు మహిళలను కూడా ఆకట్టుకునే ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఒకప్పుడు తుపాకీ పట్టిన మాజీ మావోయిస్టు రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకుని చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు.

- ఇవన్నీ ఒక ఎత్తయితే.. సీతక్కకు గిరిజనుల్లోనే కాదు.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిరాడంబరంగా ఉండే ఆమె రాజకీయ నాయకుల్లోనే ప్రత్యేకంగా ఉంటారు. వరదలు ముంచెత్తినా కాళ్లకు చెప్పుల్లేకుండా కొండ కోనల్లో ఉండే గిరిజనులకు ఆహార పదార్థాలు అందించే సీతక్క వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. అందుకే, పార్టీలకతీతంగా ఈమెపై సానుకూల వైఖరి ఉంటూ ఉంటుంది. దీనికితోడు, అటు రాజకీయంగానే కాదు.. వ్యూహాత్మకంగానూ రేవంత్‌ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.

- దళితులు సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్నారన్న విషయం తెలిసిందే. గిరిజనులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో గిరిజనులను ఆకట్టుకోవాలని బీజేపీ పావులు కదిపింది. మరోవైపు.. పోడు పట్టాల పంపిణీ, వాటికి రైతు బంధుతో వారి ఓట్లు తమకేనన్న అంచనాతో బీఆర్‌ఎస్‌ ఉంది. అందుకే ఆ రెండు పార్టీల వ్యూహాలకు చెక్ పెట్టేందుకు అవకాశం వస్తే, సీతక్క ముఖ్యమంత్రి అనడం ద్వారా గిరిజనుల్లో కాంగ్రెస్‌ స్థానాన్ని రేవంత్‌ సుస్థిరం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీఎం ఆశావహులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రి అభ్యర్థుల పార్టీ.. కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావట్లేదు. రేపొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు..? ఢిల్లీ పెద్దలదే పెత్తనం.. అని బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నలకు ఇదొక్క చెంపపెట్టు అని తాజా రేవంత్ ప్రకటనతో స్పష్టమైంది.

Seethakka-02.jpg

ఏం జరుగుతుందో..?

వాస్తవానికి రేవంత్ ప్రకటన తర్వాత చాలా మంది నోట మాట రాలేదు. ఈ ప్రకటనపై రియాక్ట్ అవ్వడమనేది పెద్ద చిక్కుముడేనని మిన్నకుండిపోయారట. ఒకరిద్దరు స్పందించినా అదేమీ పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అక్కర్లేదని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్న పరిస్థితి. అసలు రేవంత్ వ్యూహం ప్రత్యర్థులకు అంతుచిక్కని రేంజ్‌లో ఉందని.. ఇక వ్యూహకర్త అక్కర్లేదు బాబోయ్.. అన్నట్లుగా మరికొందరు కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తానికి చూస్తే.. రేవంత్ ప్రకటనతో ఇప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. మున్ముందు టీపీసీసీ చీఫ్ ఇంకెన్ని కీలక ప్రకటనలు చేస్తారో అని కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్‌లోకి గెలిచాక ఏం జరుగుతుందో.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.

T-Congress.jpg


ఇవి కూడా చదవండి


Allegations On Volunteers : ఏపీలో రచ్చ జరుగుతుండగానే.. వలంటీర్ వ్యవస్థపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు


BRS MLA Ticket : తెలంగాణలో అందరికంటే ముందుగా ఈ ఎమ్మెల్యేకే.. కేసీఆర్‌ టికెట్ ప్రకటించారా.. మంత్రి సంగతేంటో..!?


Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?


Rajyasabha : తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతను రాజ్యసభకు తీసుకుంటున్న బీజేపీ.. ఆ ‘తెలుగోడు’ ఎవరంటే..!?


Rajyasabha : ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. రాజ్యసభకు ‘తెలుగోడు’..!


Bandi Sanjay : ఎంపీ విజయేంద్రప్రసాద్‌తో బండి సంజయ్‌ భేటీ.. మరోసారి హాట్ టాపిక్..!


Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!


YS Sharmila : వైఎస్సార్ జయంతి ముందురోజే వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం.. అదేంటో తెలిస్తే..!


Updated Date - 2023-07-11T19:29:27+05:30 IST