Ponguleti : పార్టీ మారడానికి పొంగులేటి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా.. అటు ఇటు తిరిగి ఫైనల్‌‌గా..?

ABN , First Publish Date - 2023-02-04T20:17:47+05:30 IST

ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponugleti Sreenivas reddy) పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..? ఇందుకే వరుస భేటీలతో బిజిబిజీగా గడుపుతున్నారా..?..

Ponguleti : పార్టీ మారడానికి పొంగులేటి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా.. అటు ఇటు తిరిగి ఫైనల్‌‌గా..?

హైదరాబాద్/ఖమ్మం : ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponugleti Sreenivas reddy) పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..? ఇందుకే వరుస భేటీలతో బిజిబిజీగా గడుపుతున్నారా..? తనతో పాటు ముఖ్య అనుచరులు, జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలను కూడా వెంట తీసుకెళ్తున్నారా..? అంటే తాజా రాజకీయపరిణామాలను చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ పొంగులేటి ఏ పార్టీలోకి (Party Change) వెళ్తున్నారు..? వరుస భేటీల వెనుక ఆంతర్యమేంటి..? పార్టీ మారితే, ఎమ్మెల్యేగా (MLA) పోటీచేస్తారా లేకుంటే ఎంపీగా (MP) పోటీచేస్తారా..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఇదీ అసలు కథ..!

పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నిన్న, మొన్నటి వరకూ సైలెంట్‌గానే ఉన్నారు. అధికార బీఆర్ఎస్‌పై (BRS) ధిక్కార స్వరం వినిపించిన ఆయన ఏ పార్టీలో చేరతారో తెలియదు. తాను ఏ జెండా చేతపట్టుకుంటారో ఇంకా చెప్పలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో తన అనుచరులు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉంటారని కీలక ప్రకటన చేసేశారు. అంతేకాదు ఎన్నికలకు సిద్ధం కావాలని తన అనుచరగణానికి కూడా పిలుపునిచ్చేశారు. దీంతో వారంతా మండల కేంద్రాల్లో ఎన్నికల కార్యాలయాలను సిద్ధంచేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. పొంగులేటి వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా దీనిపైనే చర్చ నడుస్తోంది. పొంగులేటి బీజేపీలో (BJP) చేరతారా? లేకుంటే కాంగ్రెస్‌లోకి (Congress) వెళ్తారా? అన్న చర్చ జరుగుతూనే ఉంది. సరిగ్గా ఇదే సమయంలో వైటీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిలను (YS Sharmila) కలిశారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన.. బీజేపీ, కాంగ్రెస్‌ను కాదని షర్మిల పార్టీలో చేరుతున్నారని టాక్ నడిచింది. దీనికి తోడు.. ‘ఏగూటి పక్షి ఆగూటిక చేరుతుంది.. పొంగులేటి నాకు మాటిచ్చారు’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో (Social Media) చక్కర్లు కొట్టాయి.

Ponguleti-and-Sharmila.jpg

ఏం చేయబోతున్నారు..!?

షర్మిల కామెంట్స్‌తో పక్కాగా వైటీపీలో పొంగిలేటి చేరబోతున్నారని క్లారిటీ వచ్చినప్పటికీ ఎక్కడా ఆయన రియాక్ట్ అవ్వలేదు. దీంతో మౌనం అనేది అంగీకారమే అని కూడా వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా (శనివారం నాడు).. షర్మిల తల్లి వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) భేటీ కావడంతో పొంగులేటి వైటీపీలో చేరుతున్నారని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ విషయం బయటికి పొక్కనీయకుండా చూసుకుంటున్నారట. శనివారం నాడు వైఎస్ విజయమ్మతో సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈనెల 8న పాలేరులో (Paleru) వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర (Padayatra) ముగింపు సభ ఉంది. ఆ సభకు వైఎస్ విజయమ్మ కూడా హైదరాబాద్ (Hyderabad) నుంచి రానున్నారు. వైఎస్ షర్మిల, విజయమ్మ సమక్షంలో పొంగులేటి కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అదే రోజు ఆయన ముఖ్య అనుచరులు, జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా షర్మిల పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

Ponguleti-Latest.jpg

ఈ నియోజకవర్గాలపైనే ఫోకస్..!

బీఆర్ఎస్‌కు పొంగులేటి దూరమైనా ప్రజల్లో మాత్రం నిత్యం ఉంటున్నారు. ఇప్పటికే ఇల్లెందు (yellandu), పినపాక (Pinapaka) , మధిర (Madhira) నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన పొంగులేటి మిగిలిన నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టబోతున్నారు. గ్రామాల్లోనూ పర్యటిస్తూ.. శుభ, అశుభ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీన్నిబట్టి చూస్తే.. ఇల్లెందు, పినపాక, మధిర నియోజకవర్గాలపైనే పొంగులేటి స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. మరోవైపు.. ఇంతజరుగుతున్నా పొంగులేటిపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఇప్పటి వరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంతో.. పొంగులేటి, ఆయన వర్గీయులు ఇంకా బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లుగానే భావిస్తున్నారు. పొంగులేటి మాత్రం తన పర్యటనలో ఎక్కడా గులాబీ జెండాలు, కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు లేకుండా తన ఫొటోలు, ఫ్లెక్సీలతోపాటు తన అనుచర నాయకులు, వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వారి ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.

Pongu.jpg

ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!

షర్మిల పార్టీలో చేరిన తర్వాత పొంగులేటి మళ్లీ ఎంపీగానే పోటీచేసి తన అనుచరులకే ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించాలని యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. అందుకే ఇలా ఆత్మీయ సమావేశాలతో జనాలతో మమేకం అవుతున్నారని చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి వైసీపీ తరఫునే పొంగులేటి ఎంపీగా.. మరో ముగ్గురు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అంతకుమించి సీట్లు గెలిచి చూపించి.. బీఆర్ఎస్‌కు తన దమ్మేంటో తెలియజేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట.

మొత్తానికి చూస్తే.. అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ ఫ్యామిలీకే (YS Family) పొంగిలేటి జై కొడుతున్నారన్న మాట. ఈ చేరికలో ఎంతవరకు నిజానిజాలున్నాయో తెలియాలంటే ఫిబ్రవరి 8వరకు వేచి చూడక తప్పదు మరి.

Updated Date - 2023-02-04T23:17:47+05:30 IST