CBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టుపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్టయ్యారో చూడండి..!

ABN , First Publish Date - 2023-09-19T19:04:23+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక తెలుగు ప్రజలు ఉండో ప్రతిచోట..

CBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టుపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్టయ్యారో చూడండి..!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక తెలుగు ప్రజలు ఉండో ప్రతిచోట.. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దుతు నిలుస్తూ నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ఎందరో ప్రముఖ రాజకీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ అభిప్రాయాలను మీడియా, సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు. మరికొందరైతే ఈ స్కిల్ కేసులో నిజానిజాలు తెలిసే వరకు ఈ విషయం మీద ఏమీ మాట్లాడలేము అన్నట్లు చెబుతున్నారు. తాజాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఈ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన రేవంత్.. రిపోర్టర్ చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరగా ఒక్క మాటలో సమాధానం ఇచ్చారు.


Revanth-Reddy--1.jpg

ఇంతకీ ఏమన్నారు..?

రిపోర్టర్ : చంద్రబాబు అరెస్ట్‌ను ఎలా చూస్తారు..?

రేవంత్ : ‘ఎట్ల చూస్తలేం.. ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నాం. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నాం’ అని టీపీసీసీ చీఫ్ సమాధానమిచ్చారు. చంద్రబాబుకు రేవంత్ ఎంత సన్నిహితుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా.. తెలంగాణలో టీడీపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి వెళ్లిన దాదాపు నేతలందరూ స్పందించారు. ఇటీవలే మంత్రి మల్లారెడ్డి కూడా స్పందించి.. జగన్ సర్కార్ తీరును తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

Revanth-And-CBN.jpg

ఇప్పటికే నేతలు ఇలా..!

చంద్రబాబు అరెస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వెనక కుట్ర కోణం ఉంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్, కేసీఆర్, మోదీ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ దారుణం. చంద్రబాబుపై కొందరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. గుజరాత్ అల్లర్లకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టే చంద్రబాబుపై మోదీకి కక్ష పెట్టుకున్నారు. చంద్రబాబు వల్లే కేసీఆర్ ఎదిగారు. చంద్రబాబుపై కసితోనే కేసీఆర్ పార్టీ పెట్టారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కేసీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చంద్రబాబు బీజేపీతో వెళ్లకుండా ఇండియా కుటమికి మద్దతు తెలుపుతారు కాబట్టే చంద్రబాబుపై మోదీకి కక్ష పెంచుకున్నారు. చంద్రబాబుని బూచిగా చూపెట్టి కేసీఆర్ సెంటిమెంట్ రగిలించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో చట్టాన్ని తుంగలో తొక్కారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. కవితని అరెస్ట్ చేయలేదు. మోదీకి మద్దతు ఇస్తే ఎలాంటి కేసులు ఉండవ్ అని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu-Car.jpg


ఇవి కూడా చదవండి


Breaking : చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టిన సీఐడీ!


Chandrababu Case : చంద్రబాబు కేసులో లూథ్రా, సాల్వే ఎలా వాదించారో చూడండి..!


Verdict On CBN Cases : చంద్రబాబు పిటిషన్లపై విచారణలో ఏం జరిగింది.. తీర్పు ఎప్పుడు.. లాజిక్ పట్టిన సాల్వే..!?


NCBN Case : హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సాల్వే రిప్లై వాదనలు.. అంతా సైలెన్స్!


Updated Date - 2023-09-19T19:10:28+05:30 IST