NCBN Case : హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సాల్వే రిప్లై వాదనలు.. అంతా సైలెన్స్!

ABN , First Publish Date - 2023-09-19T17:19:09+05:30 IST

మధ్యాహ్నం 12 గంటల నుంచి బాబు తరఫున.. భోజనం తర్వాత సీఐడీ లాయర్ల వాదనలను న్యాయమూర్తి విన్నారు. రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనల తర్వాత హరీష్ సాల్వే రిప్లయ్ వాదనలు వినిపించారు..

NCBN Case : హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సాల్వే రిప్లై వాదనలు.. అంతా సైలెన్స్!

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Chandrababu) ఏపీ ప్రభుత్వం (AP Govt) బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో క్వాష్ పిటిషన్‌పై (Quash Petition) ఏపీ హైకోర్టులో (AP High Court) ఇంకా విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయమూర్తులు సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra), హరీష్ సాల్వేలు (Harish Salve) వాదిస్తున్నారు. ఇక సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రభుత్వం తరఫు రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి బాబు తరఫున.. భోజనం తర్వాత సీఐడీ లాయర్ల వాదనలను న్యాయమూర్తి విన్నారు. రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనల తర్వాత హరీష్ సాల్వే రిప్లయ్ వాదనలు వినిపించారు. ఆయన లేవనెత్తిన సాంకేతిక అంశాలు, లాజిక్‌లతో కోర్టు మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయ్యిందట. ఒక్క మాటలో చెప్పాలంటే ‘లా’తో కొట్టారని కోర్టు ఆవరణలో ఉన్న కొందరు వ్యక్తులు చెప్పుకుంటున్న మాట.


CBN-Case.jpg

సాల్వే రిప్లయ్ వాదనలు ఇవే..

  • చంద్రబాబుపై పెట్టిన కేసు దురుద్దేశంగా, న్యాయప్రక్రియను దుర్వినియోగం చేసే విధంగా ఉంది

  • స్కిల్ డెవలప్‌మెంట్ బడ్జెట్ అసెంబ్లీ ఆమోదం కూడా పొందింది

  • నేటి ముఖ్యమంత్రి ఆరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు

  • బడ్జెట్‌ను ఆయన కూడా ఆమోదించారు

  • ప్రభుత్వం కక్ష, కుట్ర పూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేసి లోపల వేశారు

  • చంద్రబాబు అరెస్ట్ అనేది పూర్తిగా నాన్‌సెన్స్

  • ఇటువంటి అరెస్టులను అనుమతిస్తే ప్రభుత్వాలు తమ వ్యతిరేకులపై ఏదైనా చేయగలదనే భావన ప్రజల్లో వస్తుంది

  • ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు

  • ఎఫ్‌ఐఆర్ చదివితే ఎటువంటి ఆరోపణలు కూడా లేవు

  • మేము కీలకమైన అంశాలను లేవనెత్తితే ప్రభుత్వం వైపు నుంచి వేరే వాదనలు వినిపిస్తున్నారు

  • ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది... అంచనాలను కూడా ఆమోదించింది

  • రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్క్రూడ్రైవర్లకు అయిన లెక్కలు చెబుతోంది

  • ఇప్పటికే ఆరు సంస్థలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి

  • అటువంటప్పుడు నిధుల దుర్వినియోగం జరిగిందని ఎలా చెబుతారు..?

  • చంద్రబాబు పారిపోతాడని అరెస్ట్ చేశామని చెబుతున్నారు

  • 2024 ఎన్నికలు ఉంటే చంద్రబాబు పారిపోతాడనుకుంటే ప్రభుత్వం సంతోషంగా వదిలేసేది కదా..? అని ప్రశ్నించిన సాల్వే

harish-Salve.jpg

రంజిత్ కుమార్ వాదనలు ఇవీ..

  • ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, గుజరాత్‌లోని ప్రాజెక్ట్‌ను పోల్చుతూ వాదనలు వినిపించిన రంజిత్

  • సెక్షన్ -17ఏ అమలుకు ముందు... ఈ స్కామ్ 2018కి ముందే జరిగిందని గుర్తించాలి

  • ప్రాజెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్‌ను కోర్టు ముందు ఉంచిన రంజిత్

  • ఎఫ్‌ఐఆర్‌‌పైనే ఆధారపడి చంద్రబాబు అరెస్ట్ జరగలేదు

  • ప్రాథమికంగా ఈ కేసులో ఎంక్వయిరీ జరిగింది

  • ఆ తరువాతే చంద్రబాబును ఏ-37గా చేర్చేందుకు నిర్ణయించారు

  • సంవత్సరన్నర పాటు లోతుగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు

  • ఆధాయపన్ను శాఖతో ఈ కేసుకు సంబంధం లేకపోయినా మోడస్ ఆపరెండీ ఎలా జరిగిందో దీని ద్వారా అర్దమవుతోంది.

Luthra.jpg

ఇలా అటు చంద్రబాబు తరఫున లూథ్రా, సాల్వే.. ఇటు సీఐడీ తరఫున రోహత్గీ, పొన్నవోలు, రంజిత్ కుమార్ రెడ్డి వాదనలు.. రిప్లయ్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు ముగియగా.. వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తి.. పరిశీలించాల్సింది ఇంకా ఏమైనా ఉంటే విచారణ వాయిదా అవకాశం ఉంది. లేదంటే ఇవాళ రాత్రికల్లా తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రెండ్రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తీర్పు అంతా మంచిగానే రావాలని.. హైకోర్టు నుంచి శుభవార్త ఉంటుందని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు.. నేతలు పూజలు చేస్తున్నారు. ఫైనల్‌గా ఏమవుతుందో చూడాలి.


ఇవి కూడా చదవండి


Chandrababu Case : చంద్రబాబు కేసులో లూథ్రా, సాల్వే ఎలా వాదించారో చూడండి..!


Verdict On CBN Cases : చంద్రబాబు పిటిషన్లపై విచారణలో ఏం జరిగింది.. తీర్పు ఎప్పుడు.. లాజిక్ పట్టిన సాల్వే..!?


Updated Date - 2023-09-19T17:28:20+05:30 IST