Breaking : చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టిన సీఐడీ!

ABN , First Publish Date - 2023-09-19T18:00:52+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ మరో అక్రమ కేసును బనాయించింది. ఫైబర్ నెట్ స్కాంపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. ఈ వారెంట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది..

Breaking : చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టిన సీఐడీ!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ మరో అక్రమ కేసును బనాయించింది. ఫైబర్ నెట్ స్కాంపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. ఈ వారెంట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నారా చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొనడం గమనార్హం. టెరాసాఫ్ట్ కంపెనీకు నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. పీటీ వారెంట్ ఫైల్ నంబర్ 2916/2023. రూ.121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేలినట్లు సిట్ ఆరోపిస్తోంది. కాగా.. 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎఫ్ఐఆర్‌లో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావును సీఐడీ చేర్చింది. ఒకటి తర్వాత ఒకటి అక్రమ కేసు పెట్టి చంద్రబాబును ఎన్నికల ముందు టార్గెట్ చేస్తున్నారని రాజకీయ, న్యాయ నిపుణులు చెబుతున్నారు.


Chandrababu.jpg

ఇప్పటికే ఇలా..!

ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ కూడా జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 21 కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు స్కిల్ డెవలప్మంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. రెండ్రోజుల తర్వాత కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వానికి షాక్ తగులుందని తెలుసుకుని ఇలా మరో అక్రమ కేసు బనాయించిందని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

CID-Vs-ACB.jpg


ఇవి కూడా చదవండి


Chandrababu Case : చంద్రబాబు కేసులో లూథ్రా, సాల్వే ఎలా వాదించారో చూడండి..!


Verdict On CBN Cases : చంద్రబాబు పిటిషన్లపై విచారణలో ఏం జరిగింది.. తీర్పు ఎప్పుడు.. లాజిక్ పట్టిన సాల్వే..!?


NCBN Case : హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సాల్వే రిప్లై వాదనలు.. అంతా సైలెన్స్!


Updated Date - 2023-09-19T18:27:18+05:30 IST