TS Politics : ‘గ్రేటర్’ కోసం కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. అదిరిపోయిందిగా..!

ABN , First Publish Date - 2023-09-30T15:06:15+05:30 IST

ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద రూ.15 వేలు సాయం. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు సాయం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇంటి స్థలం.. ఇల్లు నిర్మించుకోవడానికి

TS Politics : ‘గ్రేటర్’ కోసం కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. అదిరిపోయిందిగా..!

ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు తలపడుతుంటాయి. రసవత్తరమైన పోటీలో ఒక్కరికే అధికారం దక్కుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరోసారి తెలంగాణలో (Telangana) ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ కింగ్ ఎవరో తేలిపోనుంది. అయితే ఈసారి కూడా పోటీ మామూలుగా లేదు. మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా? అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ అధికారం (BRS) ఛేజిక్కించుకుంది. ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యా్ట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ తహతహలాడుతోంది. అదే విధంగా హస్తం పార్టీ కూడా అంతేరీతిగా కారును ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్న ఆ పార్టీకి ఇప్పటికే రెండు సార్లు రిక్తహస్తమే మిగిలింది. ఈసారి మాత్రం ఆ ఛాన్సు మిస్ చేసుకోకూడదని గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీకి ధీటుగా ఆకర్షణీయమైన పథకాలతో ముందుకొస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీ పథకాలను అనౌన్స్‌మెంట్ చేసింది. ప్రధానంగా మహిళలు, రైతులు లక్ష్యంగా ఆకర్షణీయమైన పథకాలను వెల్లడించింది. ఆరే కాదు.. మరిన్ని పథకాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్న ఆ పార్టీ నేతలు.. మరిన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేలా పథకాలను రూపుదిద్దుతున్నారు.

ఇప్పటికే ఇలా..!

ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద రూ.15 వేలు సాయం. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు సాయం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇంటి స్థలం.. ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల సాయం. విద్యార్థులకు రూ.5లక్షల భరోసా కార్డు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ భీమా పథకాలను ఇప్పటికే సోనియాగాంధీ ప్రకటించేశారు. అంతేకాకుండా ఆ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి గ్యారంటీ కార్డులను కూడా అందజేస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని పథకాలకు మెరుగులు దిద్దుతున్నారు.

గ్రేటర్‌లో ఇలా..!

విద్యార్థులందరికీ 24 గంటలు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా మరో కొత్త పథకానికి మేనిఫెస్టో కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్‌లకు స్పెషల్ ఫాలసీ కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నారు. అంతేకాకుండా ఉబర్, ఓలా, ఆటో డ్రైవర్లకు కూడా స్పెషల్ స్కీమ్‌లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ కసరత్తు చేస్తోంది. అంతేకాదు.. గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వరద, నాలా సమస్యలకు పర్మినెంట్ సొల్యూషన్, మూసీ, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు డిక్లరేషన్ ప్రకటించాలని కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా పాతబస్తీ అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ ప్రకటించాలని భావిస్తోంది. వీటి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్-02 నుంచి జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇలా మరిన్ని పథకాలను మేనిఫెస్టోలో చేర్చేందుకు రెడీ అవుతోంది.

కాంగ్రెస్‌కు ధీటుగా..!

కాంగ్రెస్ (Congress) అయితే పథకాలను ప్రకటిస్తుంది. ఈ పథకాలు ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటాయో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. అన్ని వర్గాల ప్రజలకు చేరువైయ్యేలా పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. వీటిని ప్రజలు స్వీకరిస్తారో.. లేదో మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో (Manifesto) ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన లీడర్లు కేటీఆర్ (KTR), హరీశ్‌రావులు... కాంగ్రెస్, బీజేపీని (BJP) తలదన్నేలా పథకాలు రాబోతున్నాయని.. త్వరలోనే ప్రజలు శుభవార్త వింటారని పబ్లిక్ మిటింగ్స్‌ల్లో ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌కు ధీటుగా ఎలాంటి పథకాలు రాబోతున్నాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బీజేపీ సంగతికి వస్తే.. ప్రస్తుతానికి నిశ్శబ్దం నెలకొంది. ఆ పార్టీలో ఎలాంటి చప్పుడు కనిపించడం లేదు. మరోవైపు రేపటి నుంచి ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో మోదీ పర్యటనలు ఉన్నాయి. ప్రధాని (Pm modi) ఎలాంటి వాగ్ధానాలు ఇస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈసారైనా ప్రత్యర్థి పార్టీలు.. అధికార పార్టీని ఢీకొడతాయా? లేదంటే మరోసారి బోల్తా పడతాయా? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Updated Date - 2023-09-30T15:19:21+05:30 IST