Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-09-12T21:14:05+05:30 IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (AP Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ (NCBN House Custody) పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో బాబు తరఫున లాయర్లు..

Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (AP Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ (NCBN House Custody) పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో బాబు తరఫున లాయర్లు తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏసీబీ కోర్టు తీర్పుపై (ACB Court) కౌంటర్‌గా సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra), ఆయన టీమ్ ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించబోతోంది. బుధవారం నాడు బాబు తరఫున క్వాష్ పిటిషన్ (Kwash petition) వేయబోతున్నారు లాయర్లు. విచారణ కూడా రేపే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతోంది..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో కచ్చితంగా అనుకూలంగానే తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబుకు అంతా మంచే జరగాలని ఆయన వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ముఖ్యనేతలు పూజలు కూడా చేస్తున్నారు.


cbn.jpg

క్వాష్ పిటిషన్ అంటే..?

తన ప్రమేయం లేకపోయినా కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసే పిటిషన్‌ను ‘క్వాష్ పిటిషన్’ అంటారు. సదరు వ్యక్తికి కింది కోర్టుల తీర్పు తర్వాత పెద్ద కోర్టుల్లో ఈ పిటిషన్‌ను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీఆర్పీసీలో సెక్షన్- 482 కింద రాష్ట్ర, దేశ అత్యున్నతస్థాయి కోర్టుల్లో ఈ క్వాష్ పిటిషన్ వేసే వెసలుబాటు సంబంధిత వ్యక్తికి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అక్రమ కేసు విషయంలోనూ ఏసీబీ కోర్టు తీర్పుపై కౌంటర్‌గా లూథ్రా, ఆయన టీమ్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తోంది.

ap-high-court.jpg

నిన్న అలా.. ఇవాళిలా..!

వాస్తవానికి సోమవారం నాడు తీర్పు వచ్చుంటే నిన్ననే హైకోర్టుకు వెళ్లాలని లూథ్రా టీమ్ భావించింది కానీ.. తీర్పు వాయిదా పడటం, ఇవాళ సాయంత్రానికి హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరణ కావడంతో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నంతా లూథ్రా పలు అనుమానాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ స్వయంగా బాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడి పరిస్థితులను చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి.. బాబు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు.. కనీస సౌకర్యాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఏసీబీ కోర్టు పిటిషన్ తిరస్కరించడం.. ఇటు కుటుంబ సభ్యుల ఆందోళనతో పై కోర్టులకు వెళ్లాలని లూథ్రా నిర్ణయించారు. దీంతో హైకోర్టులో బాబు తరఫున క్వాష్ పిటిషన్ వేస్తున్నారు లాయర్లు.

Bhuvaneswari.jpg

పూర్తి భద్రత నడుమే..!

హౌస్ కస్టడీ ఇవ్వాలని చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేయగా.. ఎందుకివ్వాలనే దానిపై సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే.. హౌస్ కస్టడీ అక్కర్లేదని, అసలు సీఆర్పీసీలో లేదని అన్ని విధాలుగా చంద్రబాబు భద్రత మధ్య ఉన్నారని సీఐడీ తరఫున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఒకరోజు సమయం తీసుకున్న ఏసీబీ కోర్టు చివరికి సీఐడీ వాదనలతో ఏకీభవించింది. హౌస్ కస్టడీ అక్కర్లేదని.. పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ తీర్పుకు కౌంటర్‌గా చంద్రబాబు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు. అయితే.. ఇంతవరకూ బాబు బెయిల్‌పై లాయర్లు కోర్టులో ఇంతవరకూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. బుధవారం హైకోర్టు తీర్పు తర్వాత బెయిల్ గురించి లాయర్లు ఆలోచిస్తారని తెలియవచ్చింది. మరోవైపు.. అక్రమ కేసుల్లో చంద్రబాబును ఇరికించిన సీఎం వైఎస్ జగన్‌‌ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

Chandra-babu.jpg

మరో లంచ్ మోషన్ పిటిషన్!

ఇదిలా ఉంటే.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలైంది. బాబు తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) పిటిషన్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ న్యాయ, చట్ట విరుద్ధమని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గవర్నర్ (Governor) అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు..? అనే విషయాన్ని కూడా దమ్మాలపాటి ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్ కూడా బుధవారమే విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పిటిషన్ల విషయంలో హైకోర్టు ఎలా తీర్పునిస్తుందో అనేదానిపై గంట గంటకూ టీడీపీ శ్రేణుల్లో (TDP Cadre) ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Dhammala-High-Court.jpg


ఇవి కూడా చదవండి


CBN Arrest : తీర్పు తర్వాత.. చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!


NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..


NCBN Arrest : చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని లూథ్రా ఎందుకు అడుగుతున్నారంటే..?


CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు


NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?


Skill Development Case : చంద్రబాబు కేసులో హోరాహోరీగా వాదనలు.. జడ్జి లాజిక్ ప్రశ్నలతో సీఐడీ షాక్..!



Updated Date - 2023-09-12T21:30:27+05:30 IST