Skill Development Case : చంద్రబాబు కేసులో హోరాహోరీగా వాదనలు.. జడ్జి లాజిక్ ప్రశ్నలతో సీఐడీ షాక్..!

ABN , First Publish Date - 2023-09-10T10:50:14+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) 409 సెక్షన్ ఏసీబీ కోర్టులో (ACB) హోరాహోరీగా వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Justice Siddharth Luthra).. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపిస్తున్నారు..

Skill Development Case : చంద్రబాబు కేసులో హోరాహోరీగా వాదనలు.. జడ్జి లాజిక్ ప్రశ్నలతో సీఐడీ షాక్..!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) 409 సెక్షన్ ఏసీబీ కోర్టులో (ACB) హోరాహోరీగా వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Justice Siddharth Luthra).. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపిస్తున్నారు. సుమారు గంటన్నరపాటు ఇరువర్గాల వాదనలు కొనసాగాయి. ఒకానొక సందర్భంలో కోర్టు ప్రాంగణంలో ఇరువర్గాల లాయర్ల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మొదట చంద్రబాబు రిమాండ్ రిపోర్టును ఏఏజీ కోర్టుకు వివరించారు.


Judge.jpg

అప్పుడు.. ఇప్పుడు ఏంటిది..?

2021లో ఎఫ్ఐఆర్‌లో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. అయితే ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ (CID Remond Report) రిపోర్టు అందించగా.. కొద్దిసేపటి క్రితమే ఎఫ్ఐర్‌లో చంద్రబాబు పేరును చేర్చడం గమనార్హం. దీంతో సీఐడీ వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్న జడ్జి.. సీఐడీ న్యాయవాదిని ప్రశ్నించారు. ‘గతంలో FIRలో చంద్రబాబు పేరు ఎందుకు లేదు. బాబు పేరును ఇప్పుడెలా చేర్చారు. FIR నమోదులో ఆలస్యంపై కారణాలేంటి. చంద్రబాబు పాత్ర ఉందని నిరూపించే ఆధారాలు ఉన్నాయా..?’ అని సీఐడీకి జడ్జి లాజిక్ ప్రశ్నలు సంధించారు. ఒక్కసారిగా జడ్జి ఇలా అడగడంతో సీఐడీ అధికారులు, ఏఏజీ సుధాకర్ రెడ్డి కంగుతిన్నారట. దీంతో జడ్జి ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తరపు న్యాయవాది పొన్నవోలు తన వాదనలను వినిపించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలకు 10 నిమిషాలపాటు కోర్టు బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ అనంతరం మళ్లీ విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

Lokesh-and-CBN-Advocate.jpg

ఏం జరుగుతుందో..?

సీఐడీ తరఫున వాదనలు పూర్తయ్యాయి. కాసేపట్లో చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఒకసారి కోర్టులో మాట్లాడిన సిద్ధార్థ.. సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని.. కనీసం ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేదని.. అలాంటప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని వాదించారు. మరోసారి లూథ్రా వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే.. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. చంద్రబాబు కోర్టు హాల్‌లోని వేచి చూస్తున్నారు. బాబు వాంగ్మూలం, వాదనలు వినిపించిన తర్వాత కోర్టు హాల్‌లోనే ఉన్నారు. కోర్టుకు వచ్చిన నారా లోకేష్.. ఏం జరుగుతోంది..? ఈ కేసుపై ఎలా ముందుకెళ్లాలి..? అని టీడీపీ నేతలు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో కూడా లోకేష్ సమావేశమై చర్చించారు.

Siddharth-luthra.jpg


ఇవి కూడా చదవండి


CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?


NCBN Arrest : FIR లో ఎక్కడా కనిపించని చంద్రబాబు పేరు.. కొద్దిసేపటి క్రితమే..?


CBN Arrest : సెప్టెంబర్-10న బాబు-భువనేశ్వరి పెళ్లి రోజు.. ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందా..?


CBN CID Enquiry : ఇంకా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబు.. ఎన్ని ప్రశ్నలు అడిగారంటే.. విచారణ మధ్యలో..!?


Jagan Vs CBN : చంద్రబాబు అరెస్ట్‌తో లండన్‌లో వైఎస్ జగన్‌కు ఝలక్!


NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో వైఎస్ జగన్ అహం చల్లారిందా.. జీ-20 సమ్మిట్ తర్వాత ఏం జరగబోతోంది..!?


Chandrababu Arrest : చంద్రబాబును హడావుడిగా అరెస్ట్ చేసి సీఐడీ అడ్డంగా బుక్కయ్యిందా.. ఈ లాజిక్ మరిచిపోయారే..!?


Updated Date - 2023-09-10T12:32:25+05:30 IST