Jagan Vs CBN : చంద్రబాబు అరెస్ట్‌తో లండన్‌లో వైఎస్ జగన్‌కు ఝలక్!

ABN , First Publish Date - 2023-09-09T20:59:55+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో (Chandrababu Arrest) ఆంధ్రప్రదేశ్ (AP) అట్టుడుకుతోంది. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా సామాన్య ప్రజలు మొదలుకుని కార్యకర్తలు, వీరాభిమానుల వరకు నిరసనలు చేపడుతున్నారు...

Jagan Vs CBN : చంద్రబాబు అరెస్ట్‌తో లండన్‌లో వైఎస్ జగన్‌కు ఝలక్!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో (Chandrababu Arrest) ఆంధ్రప్రదేశ్ (AP) అట్టుడుకుతోంది. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా సామాన్య ప్రజలు మొదలుకుని కార్యకర్తలు, వీరాభిమానుల వరకు నిరసనలు చేపడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న సీఐడీ ఆఫీసులో రెండు గంటలకు పైగా చంద్రబాబును అధికారులు (CBN CID Enquiry) విచారిస్తున్నారు. విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. అసలు విచారణలో ఏం జరుగుతోందో తెలియక టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో సీఐడీ ఆఫీసు దగ్గరికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. చంద్రబాబు ఎప్పుడు బయటికొస్తారా అని ఎదురుచూస్తున్న పరిస్థితి.


Chandra-babu.jpg

లండన్‌లో సీన్ ఇదీ..

ఇక అసలు విషయానికొస్తే.. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో పరిస్థితులు ఇలా ఉండగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan London Tour) మాత్రం లండన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీడీపీ వీరాభిమానుల ఆగ్రహం పెల్లుబికి ఆందోళన చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆందోళన లండన్‌కు పాకింది. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా లండన్‌లో ఎన్నారైలు ఆందోళనకు దిగారు. లండన్‌లో జగన్ బస చేస్తున్న ప్రాంతంలో ఆందోళన చేపడుతున్నారు. మరికొందరు ఎన్నారైలు తీవ్ర ఆగ్రహానికి లోనై.. జగన్ బస చేసిన చోటును ముట్టడికి ఎన్నారైలు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆందోళనలు, నిరసనలకు అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. అయినా సరే శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని ఎన్నారైలు ప్లాన్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే లండన్‌లో ఉన్న జగన్‌కు ఇది ఝలక్ (Jolt To Jagan) అని చెప్పుకోవచ్చు.

Jagan-London-Protest.jpg

అక్కడా ఇదే చర్చ!

ఈ ఆందోళనతో లండన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలేం జరిగింది..? ఎందుకీ ఆందోళన..? ఆ హోటల్‌లో ఎవరున్నారు..? చంద్రబాబు, జగన్ అంటే ఎవరు..? అని ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, యువత తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక గూగుల్‌లో, ట్విటర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరిగిందని.. ఏం ట్రెండింగ్‌లో నడుస్తోంది..? అని వెతకడం మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను దాటి లండన్‌లోనూ హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు ఎన్నారైలకు పరిచయస్తులు, లండన్ జనాలు కొందరు #WeStandWithNCBN అని ట్వీట్లు కూడా చేస్తున్నారంటే ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో జగన్ ఉన్న ఫలంగా లండన్ నుంచి ఏపీకి వచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలియవచ్చింది.

jagan melborn.jpeg

ఇవి కూడా చదవండి


NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో వైఎస్ జగన్ అహం చల్లారిందా.. జీ-20 సమ్మిట్ తర్వాత ఏం జరగబోతోంది..!?


Chandrababu Arrest : చంద్రబాబును హడావుడిగా అరెస్ట్ చేసి సీఐడీ అడ్డంగా బుక్కయ్యిందా.. ఈ లాజిక్ మరిచిపోయారే..!?


Updated Date - 2023-09-09T21:44:15+05:30 IST