NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..

ABN , First Publish Date - 2023-09-12T16:44:46+05:30 IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది..

NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. జైలు రిమాండ్‌ను హౌస్ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లయ్యింది. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది. అయితే.. ఈ తీర్పు తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది.


Lokesh-and-CBN-Advocate.jpg

నిన్నటి నుంచి ఏం జరిగింది..?

చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రతలేదని.. ప్రాణహాని ఉందని ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో హౌస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉంది. చంద్రబాబు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది. అందుకే చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు ఇవ్వండి. జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారు. ప్రభుత్వం చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించింది అని న్యాయమూర్తికి సోమవారం నాడు లూథ్రా వాదనలు వినిపించారు.

అయితే.. హౌస్ కస్టడీ అక్కర్లేదని సీఐడీ తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు హౌస్ కస్టడీ అనేదే సీఆర్పీసీలో లేదని.. ఇల్లు కంటే జైలే బెటరని అన్నివిధాలుగా భద్రతగాఉందని ఆయన వాదించారు. అంతేకాదు.. చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్యే ఉన్నారని, రక్షణ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పొన్నవోలు కోర్టుకు చెప్పారు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుందని.. ఇక పిటిషనర్ ఆరోగ్యం కోసం 24x7 వైద్యులు అక్కడే ప్రభుత్వం ఉంచిందని న్యాయమూర్తికి సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు.

Ponnavolu.jpg

ఉత్కంఠకు తెర..

ఇలా వర్గాల సుదీర్ఘ వాదనలను విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారం నాడు సాయంత్రానికి తీర్పు ఇస్తారని అందరూ భావించారు కానీ.. మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే ఉత్కంఠ.. కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అంతా మంచే జరగాలని టీడీపీ కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. మరోవైపు.. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలతో కలిపి టీడీపీ బంద్ నిర్వహించింది. అయితే.. తీరా చూస్తే తీర్పు వాయిదా పడింది. ఆఖరికి ఇవాళ 4:30 గంటలకు తీర్పును వెల్లడించింది కోర్టు. సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ హైకోర్టు ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. తీర్పు తర్వాత లూథ్రా టీమ్ ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిసింది.

AP-CID.jpg


ఇవి కూడా చదవండి


Skill Development Case : చంద్రబాబు కేసులో హోరాహోరీగా వాదనలు.. జడ్జి లాజిక్ ప్రశ్నలతో సీఐడీ షాక్..!


TS Assembly Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బాంబ్ పేల్చిన కేటీఆర్.. ఎప్పుడు ఉండొచ్చని చెప్పారంటే..?


NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం


Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా.. ఎప్పుడొస్తుందంటే..!?


CBN House Custody : హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పుకు ముందు కీలక పరిణామం


NCBN Arrest : చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని లూథ్రా ఎందుకు అడుగుతున్నారంటే..?


CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు


NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?


Updated Date - 2023-09-12T17:10:50+05:30 IST