AP Politics: నా డేటా- నా హక్కు.. ఉద్యమం ప్రారంభించిన ఏపీ ప్రజలు

ABN , First Publish Date - 2023-07-21T13:33:26+05:30 IST

ఏపీలో ప్రజల డేటా సేకరించి వాలంటీర్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తమ డేటా దుర్వినియోగం అవుతోందని ఏపీ ప్రజలు లేటుగా గ్రహించారు. డేటా సేకరణ పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, వివాహేతర బంధాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వాహనాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, ఇంటి సభ్యులు ఎక్కడెక్కడ ఉంటున్నారు.. వాళ్ల వివరాలను సేకరించాల్సిన పనేంటని సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కారును ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 AP Politics: నా డేటా- నా హక్కు.. ఉద్యమం ప్రారంభించిన ఏపీ ప్రజలు

ఏపీ(Andhra Pradesh)లో జగన్ ప్రభుత్వం (Jagan Government) అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం జగన్ సర్కారు అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ (Volunteer System) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ముఖ్యంగా ప్రజల డేటా (People Data) సేకరించి వాలంటీర్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ(YSRCP)లో అలజడి చెలరేగింది. గతంలో టీడీపీ (TDP) హయాంలో డేటా స్కామ్ జరిగిందని అడ్డగోలు ఆరోపణలు చేసిన వైసీపీ అధినేత జగన్ (Jagan) ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకుని అక్రమంగా ప్రజల డేటా సేకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని పవన్ చేస్తున్న విమర్శలు నిజమే అని స్పష్టమవుతున్నాయి. దీంతో నా డేటా నా హక్కు అంటూ ప్రజలు సోషల్ మీడియా(Social Media)లో ఉద్యమం చేస్తున్నారు. అసలు తమ డేటాను సేకరించే హక్కు జగన్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.

తమ డేటా దుర్వినియోగం అవుతోందని ఏపీ ప్రజలు లేటుగా గ్రహించారు. ఈ నేపథ్యంలో డేటా సేకరణ పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, వివాహేతర బంధాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వాహనాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, ఇంటి సభ్యులు ఎక్కడెక్కడ ఉంటున్నారు.. వాళ్ల వివరాలను సేకరించాల్సిన పనేంటని సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కారును ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్ పేరుతో ప్రజల నుంచి డేటా ఎందుకు సేకరిస్తున్నారు, మీరు ప్రభుత్వ అధికారి అయితే మీ ఐడీ కార్డు చూపించమని అడుగుతున్నారు. అయితే అలా అడిగిన వ్యక్తికి వాలంటీర్ గీతం కాలేజ్ ఐడీ కార్డు చూపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటు డేటా సేకరణ విషయంలో తమ స్కాం బయటపడటంతో జగన్ సర్కారు పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడి చేస్తోంది. వాలంటీర్లతో రాస్తారోకోలు, ధర్నాలు చేయిస్తూ పవన్‌పై కేసులు నమోదు చేయిస్తోంది.


ప్రజల డేటా న్యూ ఆయిల్ వంటిది అని.. అది క్రూడాయిల్ అంత విలువైందని ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. డేటా ప్రొటెక్షన్ అత్యంత కీలకం అని ఆయన అన్నారు. ప్రజల డేటా మొత్తం హైదరాబాద్‌లోని కంపెనీలకు వైసీపీ ప్రభుత్వం తరలిస్తోందని ఆరోపించారు. ప్రజల డేటా దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారని పవన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌కు చెందిన ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ప్రజల డేటాను భద్రపరచడం వెనుక ఎవరున్నారని అడిగారు. దీంతో వైసీపీ సర్కారు ప్రజలను డైవర్ట్ చేసేందుకు వాలంటీర్లను పవన్ దూషించారనే ప్రచారం చేస్తోంది. ఈ మేరకు వాలంటీర్లపై ఆరోపణలపై పవన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లపై పవన్ కళ్యాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇస్తూ గురువారం నాడు జగన్ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో జీవోతో పవన్‌ను భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ జీవోకు తాను భయపడనని.. తాను ఓ మాట చెప్పానంటే అన్ని రిస్కులకు సిద్దపడి ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కావాలంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఈ విషయంలో తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. దెబ్బలు తినడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. జగన్ సై అంటే తాను కూడా సై అన్నారు. వాలంటీర్లు ఓ ఎనిమిదేళ్ల పాపను రేప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న వేశారు. వాలంటీర్లు సేకరించే సమాచారాన్ని ఏ జీవో కింద ప్రైవేటు పరం చేశారని.. దానిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే ఏపీలో డేటా సేకరణ అంశం ఇప్పుడు జగన్ సర్కారు మెడకు చుట్టుకుంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన జగన్ మాత్రం సైలెంట్‌గా ఉండి తన పార్టీ నేతలను, వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని పలువురు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Pattiseema: జగన్ సర్కారు నోట.. చంద్రబాబు ప్రాజెక్టు మాట..!!

Weather Politics: వాతావరణానికి, రాజకీయాలకు సంబంధం ఉందా?

AP Politics: పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఆ ఎంపీ వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా?

Updated Date - 2023-07-21T14:09:06+05:30 IST