Nellore Politics : నన్ను ఆపండి చూద్దాం.. ఈ ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఓపెన్ ఛాలెంజ్..

ABN , First Publish Date - 2023-03-28T22:56:16+05:30 IST

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. అసలు ఎవరు మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతారో.. ఎవరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతారో..

Nellore Politics : నన్ను ఆపండి చూద్దాం.. ఈ ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఓపెన్ ఛాలెంజ్..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. అసలు ఎవరు మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతారో.. ఎవరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతారో అనే ఆందోళన వైసీపీ (YSR Congress) అధిష్ఠానంలో మొదలైంది. అయితే వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (Anam Rama Narayana Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) ఇప్పటికే మీడియా ముందుకొచ్చి అధికార పార్టీకి ఛాలెంజ్‌లు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. 2019 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. రానున్న ఎన్నికల్లో డిస్మిస్ చేస్తారని బహిరంగంగానే చెప్పేశారు. అయితే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) రియాక్ట్ అయ్యారు. మీడియా ముఖంగా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

రాసిపెట్టుకోండి..!

ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్లడం వల్ల నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు. 2024 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు గెలిచినా నేను మళ్లీ నెల్లూరులో అడుగుపెట్టను. ఒకవేళ అదే జరిగితే నా రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాను. ఈ విషయంపై నా దగ్గరికి ఎవరైనా రండి కావాలంటే బాండ్ పేపరు మీద రాసి సంతకాలు పెట్టుకుందాం. నేను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం’ అని అనిల్ సవాల్ విసిరారు.

ఆపండి చూద్దాం..!

ఆనం, మేకపాటి, కోటం ఈ ముగ్గురూ ఇప్పుడు పోటీ చేయలేకపోతే మళ్లీ పోటీచేసే అవకాశం ఉండదు.. వయస్సు కూడా ఉండదు. మీకు పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి. నాదేమో పిట్ట చరిత్ర. రాజకీయంగా నేను చాలా చిన్నవాడిని. చంద్రశేఖరన్నా.. మీకు‌ టిక్కెట్టు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ వస్తుందో‌ చూద్దాం. ఈసారి అనిల్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయమని కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఈ మధ్య పసుపు కండువాలు కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిచి చూపిస్తామని సవాల్ విసురుతున్నారు. పది స్థానాలు కాదు.. ముందు వైసీపీ నుంచి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవండి చూద్దాం. ఫస్ట్ మీది మీరు చూసుకోండి.అనిల్ అసెంబ్లీకి వస్తాడా.. రాడా అనేది భగవంతుడు, నగరంలోని ప్రజలు డిసైడ్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో నేను జగన్ అన్న (CM YS Jagan) బొమ్మతోనే పోటీ చేస్తాను. కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోను జగన్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను కచ్చితంగా గెలుస్తా.. నన్ను ఆపండి.. చూద్దాం. మీలో ఎవరెవరు అసెంబ్లీలో అడుగుపెడతారో చూద్దాంఅని అనిల్ ఛాలెంజ్ చేశారు.

అనిల్ చేసిన ఈ సవాళ్లపై నెటిజన్లు, సొంత పార్టీ కార్యకర్తలు కొందరు చిత్రవిచిత్రాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యా.. ఫస్ట్ మన సంగతి చూడండి.. ఇలాంటి సవాళ్లు చేయడం అవసరామా’ అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు అయితే ‘అనవసరంగా ఛాలెంజ్‌లు చేసి బుక్కయ్యారు.. గుర్తుపెట్టుకో 2024లో మాట్లాడుకుందాం’ అని రిటర్న్ ఛాలెంజ్‌లు చేస్తున్నారు. అన్నీ సరే కానీ.. ‘2019 ఎన్నికల్లో తమరు ఎలా గెలిచారో.. ఏ పరిస్థితుల్లో గెలిచారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి..’ అని వైసీపీ కార్యకర్తలు మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అనిల్ యాదవ్ కామెంట్స్‌పై ఇక ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి మరి.

****************************

ఇవి కూడా చదవండి

******************************

Nellore Politics : రాజకీయాలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుడ్ బై.. ఆందోళనలో అభిమానులు.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..


******************************

Rahul Bungalow Row : రాహుల్ భయ్యా.. రండి ఇది మీదే.. రేవంత్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్


******************************

Amaravathi : రాజధాని అమరావతిపై జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఊహించని షాక్.. పదే పదే అడిగినా ఆఖరికి..!


******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

******************************

YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్‌ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?

******************************

Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

******************************

Updated Date - 2023-03-28T23:08:41+05:30 IST