AP Politics : విడదల రజనీ శాఖ మారిందేంటి.. మేడమ్ హోం మంత్రి అయ్యారబ్బా..!?

ABN , First Publish Date - 2023-06-13T22:09:28+05:30 IST

అవును.. ఏపీ మంత్రి విడదల రజనీ (Minister Vidadala Rajani) శాఖ మారిపోయిందోచ్..! వైద్య ఆరోగ్యశాఖ (Minister for Health, Family Welfare) కాస్త హోం శాఖగా మారిపోయింది..!

AP Politics : విడదల రజనీ శాఖ మారిందేంటి.. మేడమ్ హోం మంత్రి అయ్యారబ్బా..!?

అవును.. ఏపీ మంత్రి విడదల రజనీ (Minister Vidadala Rajani) శాఖ మారిపోయిందోచ్..! వైద్య ఆరోగ్యశాఖ (Minister for Health, Family Welfare) కాస్త హోం శాఖగా మారిపోయింది..! అదేంటి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేకుండా ఎలా మారిందబ్బా..? అని ఆలోచనలో పడ్డారా.. మీరే కాదండోయ్ రజనీ కుటుంబ సభ్యులు మొదలుకుని యావత్ క్యాడర్ మొత్తం కంగుతిన్నది..! ఇంతకీ ఏంటి మ్యాటర్..? సడన్‌గా ఇప్పుడు ఈ పంచాయితీ ఎందుకు తెరపైకి వచ్చింది..? అనే విషయాలు చూసేద్దాం రండి..

Vidadala-Rajini.jpg

ఇదీ అసలు సంగతి..

ఎన్టీఆర్ జిల్లా (Ntr District) మైలవరంలో 50 పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని జగన్ సర్కార్ (Jagan Govt) నిర్మించింది. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ విచ్చేశారు. మేడమ్ వస్తున్నారని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతా ఓకే కానీ.. పాపం మంత్రిగారి శాఖ మార్చేశారు నేతలు, కార్యకర్తలు. వైద్య ఆరోగ్యశాఖ కాస్త, హోం శాఖ మంత్రిగా (Home minister) ప్రింట్ చేయించేశారు. ఒకచోట రెండు చోట్ల కాదు ప్రారంభోత్సవం జరిగే పరిసర ప్రాంతాల్లో దాదాపు అన్నీ ఫ్లెక్సీలు ఇలానే ఉండటం గమనార్హం. మంత్రి హాజరయ్యేది ఆస్పత్రి ఓపెనింగ్‌కు కదా.. కనీసం అప్పుడైనా వైద్య శాఖ అని గుర్తు కూడా రాకపోవడం విచిత్రం. ఈ ఫ్లెక్సీలు చూసిన జనాలంతా విస్మయం వ్యక్తం చేశారు. ఇదే ఫ్లెక్సీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు.. పోనీ ఆయనైనా శాఖ గుర్తించకపోవడం ఎంత విచిత్రమో..!

WhatsApp Image 2023-06-13 at 9.12.42 PM.jpeg

జోకులు పేలుతున్నాయ్..!

రాష్ట్ర పదవి వైసీపీ నాయకులకు గుర్తు ఉండకపోవడం జోకులు పేలుతున్నాయ్. ఇక సోషల్ మీడియాలో అయితే.. రజనీ హోం మంత్రి అయితే ఇక తానేటి వనిత పరిస్థితేంటబ్బా..? ఇద్దరూ ఒకరి శాఖలు ఒకరు మార్చుకున్నారా.. ఏంటి..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మేడమ్స్ ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా ఎప్పుడు మార్చుకున్నారు..? కనీసం ఈ విషయం సీఎం జగన్ రెడ్డికి అయినా తెలుసా లేదా..? అని జోకులేస్తున్నారు. ఓహో.. హోం మంత్రి కావాలన్నది మేడమ్ ఆశేమో ఇలా అభిమానులు వ్యక్తపరుస్తున్నారేమో అని సొంత పార్టీ కార్యకర్తలే కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీ వ్యవహారం మేడమ్‌కు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

******************************

Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?

******************************

Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?

******************************

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

*****************************

Updated Date - 2023-06-13T22:11:31+05:30 IST