Jangaon Ticket Issue : రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్.. పల్లాకు రాజేశ్వర్‌కు వార్నింగ్!

ABN , First Publish Date - 2023-09-08T18:27:45+05:30 IST

తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. బీఆర్ఎస్ టికెట్లు (BRS Tickets) ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు ఆ అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు..

Jangaon Ticket Issue : రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్.. పల్లాకు రాజేశ్వర్‌కు వార్నింగ్!

తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. బీఆర్ఎస్ టికెట్లు (BRS Tickets) ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు ఆ అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్ (Minister KTR) రంగంలోకి దిగిపోయారు. ఎవరెవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారందర్నీ పిలిపించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడినట్లు తెలియవచ్చింది. కొందరు అసంతృప్తులను నచ్చజెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని మాటిచ్చి పంపారట. ముఖ్యంగా జనగామ టికెట్ విషయంలో మంత్రి స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.


KCR-And-KTR.jpg

సారొచ్చారు..?

115 మంది అభ్యర్థులను గులాబీ బాస్ ఒకేసారి ప్రకటించినప్పటికీ ఇంకా నాలుగు నియోజకవర్గాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ నాలుగింటిలో ఒకటే జనగామ నియోజకవర్గం(Jangaon). ఇక్కడ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) .. కేసీఆర్, కేటీఆర్‌కు సన్నిహితుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) పోటాపోటీగా ఉన్నారు. వీరితో పాటు మ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్‌కుమార్‌గౌడ్‌ కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం హాట్ సీట్‌గా మారిపోయింది. ఎవరికివ్వాలో తెలియక.. ఎవరికి టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ముందే పసిగట్టిన కేసీఆర్.. కొన్నిరోజులు హోల్డ్‌లో పెట్టేశారు. ఈ గ్యాప్‌లో అటు పల్లా.. ఇటు ముత్తిరెడ్డి జనాల్లోకి వెళ్లి ప్రచారం షురూ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. అయితే.. అమెరికా నుంచి కేటీఆర్ రాకతో జనగామ టికెట్ ఎవరికో తేల్చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరినీ విడివిడిగా పిలిపించి చర్చించినట్లు తెలియవచ్చింది.

KTR.jpg

అసలేం జరిగింది..?

ఇలా చర్చిస్తుండగానే.. జనగామ మండలం నిడిగొండలో ఓ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయులు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యాయి. హైదరాబాద్ నుంచి బయల్దేరిన పల్లా మార్గమధ్యలో ఉన్నారు. ఈ ప్రత్యేక సమావేశం గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే పల్లాకు ఫోన్ చేసిన కేటీఆర్.. సమావేశానికి హాజరుకావొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ (Strong Warning) ఇచ్చినట్లు సమాచారం. ఇదేం పద్ధతి..? ఇలా చేయడం ఏ మాత్రం సబబు కాదు..? అని కేటీఆర్ ఫోన్‌లో అసహనంగా మాట్లాడారట. దీంతో చేసేదేమీ లేక సమావేశానికి పల్లా వెళ్లలేదు. సమావేశానికి రమ్మని చెప్పి ఇలా అర్ధాంతరంగా రాలేనని చెప్పడమేంటి..? అని పల్లా రాజేశ్వర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు, అనుచరులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనవుతున్నారు. జనగాం అభ్యర్థిని ప్రకటించే వరకూ పల్లా గానీ, ముత్తిరెడ్డి గానీ కార్యకర్తలు, అభిమానులుతో రహస్య సమావేశాలు పెట్టొద్దని కేటీఆర్ ఆదేశించినట్లుగా తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న టికెట్ ఆశించిన నేతలు.. కేసీఆర్ ఆప్తుడి పరిస్థితే ఇలా ఉందంటే ఇక తమ పరిస్థితేంటని గుసగుసలాడుకుంటున్నారట.

Janagaon-KTR.jpg

మొత్తానికి చూస్తే.. జనగాం గ్రూప్ పాలిటిక్స్‌పై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఫైనల్‌గా పల్లా, ముత్తిరెడ్డిలో టికెట్ ఎవరికి వస్తుంది..? ఈ ఇద్దర్నీ కాదని మూడో వ్యక్తికి వచ్చే ఛాన్సుందా..? కేటీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనే విషయం తెలియాలంటే నాలుగైదు రోజులు ఆగాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్


TS Assembly Polls : కాంగ్రెస్ భారీ స్కెచ్.. బీఆర్ఎస్, బీజేపీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యేలు, కీలక నేతలు వీరేనా..!?


Jodo Yatra : రాహుల్ యాత్రకు ఏడాది.. ‘జోడో’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చిందేంటి.. ఇంకా చేయాల్సిందేంటి..!?


Delhi Liquor Case : విచారణలో వేగం పెంచిన ఈడీ.. ఉదయం నుంచి బుచ్చిబాబుపై ప్రశ్నల వర్షం.. నెక్స్ట్ ఎవరు..!?


Lagadapati Re Entry : లగడపాటి రీ ఎంట్రీ సరే.. ఏ పార్టీ, పోటీ ఎక్కడ్నుంచి.. ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..!?


Bharat Row : ‘భారత్’ గురించి పవన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


Updated Date - 2023-09-08T18:37:26+05:30 IST