Jodo Yatra : రాహుల్ యాత్రకు ఏడాది.. ‘జోడో’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చిందేంటి.. ఇంకా చేయాల్సిందేంటి..!?

ABN , First Publish Date - 2023-09-07T19:36:42+05:30 IST

ఒకే ఒక్కడు.. భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు..! కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీరు వరకు 4వేల కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ను (Bharat Jodo Yatra) చేపట్టాడు.! బహుశా ఇన్నివేల కిలోమీటర్లు అదికూడా దేశ వ్యాప్తంగా యాత్ర చేసిన మొదటి వ్యక్తి యువనేత రాహుల్ గాంధీయేనేమో (Rahul Gandhi)!

Jodo Yatra : రాహుల్ యాత్రకు ఏడాది.. ‘జోడో’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చిందేంటి.. ఇంకా చేయాల్సిందేంటి..!?

ఒకే ఒక్కడు.. భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు..! కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీరు వరకు 4వేల కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ను (Bharat Jodo Yatra) చేపట్టాడు.! బహుశా ఇన్నివేల కిలోమీటర్లు అదికూడా దేశ వ్యాప్తంగా యాత్ర చేసిన మొదటి వ్యక్తి యువనేత రాహుల్ గాంధీయేనేమో (Rahul Gandhi)! అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు.. ఎన్నో పరాజయాలు.. రాజకీయంగా అత్యంత అధమ దశ.. దేశవ్యాప్తంగా డీలా పడ్డ క్యాడర్.. ఇలాంటి పరిస్థితుల మధ్య రాహుల్ (Rahul Padayatra) ప్రతిష్టాత్మకంగా ‘భారత్ జోడో యాత్ర’ను సెప్టెంబర్-07, 2022న శ్రీకారం చుట్టారు. ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు.. పార్టీని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టిన యాత్రకు ఇవాళ్టికి ఏడాది. రాహుల్ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ పార్టీలో, క్యాడర్‌లో వచ్చిన పెనుమార్పులేంటి..? అసలీ యాత్ర కాంగ్రెస్‌కు (Congress) కలిసొచ్చిందా.. లేదా..? ఈ ఏడాది కాలంలో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’(ABN-Andhrajyothy)లో చూసేద్దాం రండి..


Jodo-3.jpg

సినిమా షురూ!

ఎటుచూసినా ఎదరు దెబ్బలే.. లెక్కలేనన్ని పరాజయాలు.. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న పరిస్థితి.. అసలు పార్టీ పరిస్థితేంటో అని ఆందోళనలో క్యాడర్.. కీలక నేతల నిష్కమ్రణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్ పని ఖేల్ కతమ్.. ఇక దుకాణం మూసుకోవాల్సిందే అని విమర్శలు.. సరిగ్గా ఇదే టైమ్‌లో అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే.. ఇప్పుడే అసలు సిసలైన సినిమా స్టార్ట్ అయ్యింది అంటూ.. కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు జోడో యాత్రకు పూనుకున్నారు రాహుల్. ఈ యాత్రే కాంగ్రెస్‌లో ఆక్సిజన్‌ ‌నింపింది. కన్యాకుమారిలో మొదలుపెట్టిన తొలి దశ జోడో యాత్ర ఈ జనవరి 30న కశ్మీర్‌లో విజయవంతంగా పూర్తయ్యింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. తమిళనాడులో మొదలుపెట్టిన రాహుల్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్ వరకు కొనసాగింది. అత్యధికంగా ఎన్నికలు జరిగిన కర్ణాటకలో 21 రోజులు పాదయాత్ర చేశారు రాహుల్. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అత్యల్పంగా హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కరోజు, ఢిల్లీలో రెండు రోజులు రాహుల్ పాదయాత్ర చేశారు. ఏపీలో 4 రోజులు, తెలంగాణలో 12 రోజులపాటు పాదయాత్ర సాగింది. మొత్తం 145 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో 75 జిల్లాల్లో పాదయాత్ర చేయగా.. 76 లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేశారు. 100 కార్నర్ మీటింగ్స్ నిర్వహించగా, 275 చోట్ల వాకింగ్ ఇంటరాక్షన్, 100కి పైగా భేటీలు.. 12 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ భావజాలాన్ని స్పష్టం చేశారు. పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే చేపట్టిన ఈ జోడో యాత్రకు ఊహించని స్పందనే వచ్చింది. ఈ యాత్రపైనే కోటి ఆశలు పెట్టుకున్న అంతకుమించే కాంగ్రెస్‌కు పునరుత్తేజం వచ్చింది. రాహుల్ యాత్రకు ఇవాళ్టితో ఏడాది. దీంతో దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. యువనేత యాత్రతో కాంగ్రెస్‌కు అంచనాలకు మించే మేలు జరిగిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే.. యాత్రకు ముందు కాంగ్రెస్.. యాత్ర తర్వాత కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. యాత్ర తర్వాత ఈ గ్యాప్‌లో సామాన్యుడిగా మారి.. జనంతో, కష్టజీవులతో నేరుగా మమేకం అయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టి గతానికి భిన్నంగా ట్రెండ్ సెట్ చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

Jodo-1.jpg

కలిసొచ్చిందా..!?

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యూహాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కాంగ్రెస్‌కు రాహుల్ యువరక్తం ఎక్కించారని చెప్పుకోవచ్చు. ద్వేషం అంతమై దేశం ఐక్యమయ్యేంత వరకూ యాత్ర అని అడుగులు ముందుకేసిన రాహుల్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు యువనేత. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం,అసహన రాజకీయాలను ప్రస్తావించడంతోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం ఏంటన్నది తనయాత్ర ద్వారా రాహుల్ తెలుసుకుని.. యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు కూడా. ముఖ్యంగా.. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రాహుల్‌ ‌కొంత పరిణతి సాధించారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడంతో పాటు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం, రాష్టాల్లో పాగా వేయాలన్న బలమైన రాజకీయ ఆకాంక్షతో కాంగ్రెస్‌ ఈ ‌యాత్ర చేపట్టి విజయవంతం అయ్యింది. అయితే.. ఈ యాత్ర ద్వారా రాహుల్ కాస్త ఇమేజ్ పెంచుకున్నా.. పార్టీలో ఉన్న సమస్యలు మాత్రం సమసిపోలేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. సంస్థాగతంగా పార్టీ పరిస్థితి ఇదివరకులా అంపశయ్య మీదే ఉందనే ఆరోపణలు లేకపోలేదు. సమర్థ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటున్న హస్తం.. ఓటర్లలో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార బీజేపీ హిందుత్వ అజెండాను తిప్పికొట్టడమే కాకుండా.. ఓట్లు కురిపించే వ్యూహాలపై పార్టీ కసరత్తు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ కూటమిలో భాగమైన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

NDA.jpg

యాత్ర తర్వాత జరిగిందేంటి..?

ప్రజలతో మమేకం అవ్వడానికి యాత్ర బాగా దోహదపడింది. ఇన్నాళ్లు రాహుల్‌ను పప్పు.. పప్పు అని విమర్శించే వారు.. ఈ యాత్రతో ముద్ర పూర్తిగా తొలిగిపోయి పప్పు కాదు నిప్పు టచ్ చేస్తే భస్మమే అని ఆయన రేంజ్ ఏంటో విమర్శకులకు తెలిసొచ్చింది.. అంతకుమించి కాంగ్రెస్‌కు బాగానే కలిసొచ్చింది. అప్పట్నుంచీ రాహుల్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు అని అధికార పార్టీకి తెలిసొచ్చేలా చేశారు. పార్లమెంట్ వేదికగా ఆయన ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు, ఆయన ప్రసంగం ఎక్కడిదాకా వెళ్లాయో అందరికీ తెలుసు. అంతేకాదు.. రాహుల్‌కు గ్లోబల్ ఇమేజ్ పెంచింది కూడా ఈ యాత్రే. విద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచే దుఖాణాన్ని తెరిచారని రాజకీయ పండితులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో ఇలా యాత్ర చేసిన దాఖలాల్లేవ్. ఒకవేళ ఎవరైనా చేసినా నియోజకవర్గం, జిల్లా, ఒక్క రాష్ట్రానికి పరిమితం అయ్యి ఉండొచ్చేమో..!. యాత్రలో భాగంగా.. ముఖ్యంగా ఎక్కడ సభ నిర్వహించినా.. మీడియా ముందుకొచ్చిన బీజేపీ వైఫల్యాలను (BJP Failures) ఎండగట్టడంలో యాత్ర విజయవంతమైంది. ముఖ్యంగా.. ఈ యాత్ర తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) ఊహించని రీతిలో గెలుపొందినది. అనంతరం తెలంగాణతో (Telangana) పాటు పలు రాష్ట్రాల్లోనూ మునుపెన్నడూ లేని విధంగా బలపడింది. తెలంగాణలో కమలం తీర్థం పుచ్చుకోవాలనుకున్న కీలక నేతలందరూ కాంగ్రెస్ వైపు నడిచారంటే ఇది రాహుల్ యాత్రతోనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకూ బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితిలో ఉన్న బీజేపీ బొక్క బోర్లా పడిందని చెప్పుకోవచ్చు.! యాత్రకు వచ్చిన విశేష ఆధరణతో అనేక పార్టీలు.. కీలక నేతలు కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ (INDIA) కూటమికి పునాది పడింది. ఇది నిజంగా రాహుల్ విజయమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇక వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిళను (YS Sharmila) కూడా తన పార్టీవైపు రాహుల్ ఆకర్షింపగలిగారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో షర్మిళ పార్టీ విలీనం కాబోతోంది. చూశారుగా.. ఇవేకాదు ఇలా చెప్పుకుంటూ పోతే యువనేత యాత్ర తర్వాత ఎన్నో కీలక పరిణామాలే చోటుచేసుకున్నాయి.

Rahul-In-Rain.jpg

ఇక మిగిలిందేంటి..?

మొదటి విడత జోడో యాత్రతో కర్నాకటలో మంచి ఫలితాలు వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు (2024 Loksabha Elections) ఇంక మిగిలుంది 6 నెలలు మాత్రమే. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రాహుల్ రెండో విడత పాదయాత్రకు (Rahul Second Phase Jodo Yatra) అధిష్టానం గట్టిగానే ప్లాన్ చేసింది. యాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాహుల్ ట్విట్టర్ వేదికగా.. భారతదేశంలో విద్వేషాన్ని నిర్మూలించేవరకు, దేశాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు తన యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఐక్యత, ప్రేమ కోసం భారత్ జోడో యాత్రకు సంబంధించిన కోట్లాది అడుగులు దేశానికి మెగుగైన భవిష్యత్తుకు పునాదిగా మారాయన్నారు. తొలి విడత యాత్రలో దక్షిణం నుంచి ఉత్తరం వరకు పూర్తికాగా.. రెండో విడతలో పశ్చిమ నుంచి తూర్పు వైపుగా జోడో యాత్ర సాగేలా పార్టీ పెద్దలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే యాత్ర మొదలుకానున్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ విడతలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలపై కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటి వరకూ అంతా ఓకే అనుకున్నప్పటికీ ఈ యాత్ర విజయవంతమైందా..? లేదా..? అనే విషయం ఎలాగో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే 2024 సార్వత్రికానికి ఇది సెమీ ఫైనల్‌గా చెప్పవచ్చు. ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రభావం చూపితే.. ‘ఫైనల్’కు అంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యాత్ర ఎంతవరకు సక్సెస్ అయ్యింది..? ఏ మేరకు కలిసొచ్చిందనేది తెలియాలంటే ఫైనల్ వరకూ వేచి చూడాల్సిందే మరి.

Rahul-Jodo.jpg


ఇవి కూడా చదవండి


Delhi Liquor Case : విచారణలో వేగం పెంచిన ఈడీ.. ఉదయం నుంచి బుచ్చిబాబుపై ప్రశ్నల వర్షం.. నెక్స్ట్ ఎవరు..!?


Lagadapati Re Entry : లగడపాటి రీ ఎంట్రీ సరే.. ఏ పార్టీ, పోటీ ఎక్కడ్నుంచి.. ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..!?


Bharat Row : ‘భారత్’ గురించి పవన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


BRS First List : బీఆర్ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిపై ఎమ్మెల్యే భర్త ఆసక్తికర వ్యాఖ్యలు!


Updated Date - 2023-09-07T19:55:04+05:30 IST