Janasena : ఎన్డీఏతో పొత్తు, పోటీ స్థానాలపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

ABN , First Publish Date - 2023-10-06T18:11:59+05:30 IST

టీడీపీతో జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్డీఏతో (NDA) ఉన్నారా..? తెగదెంపులు చేసుకున్నారా..?..

Janasena : ఎన్డీఏతో పొత్తు, పోటీ స్థానాలపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

టీడీపీతో జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్డీఏతో (NDA) ఉన్నారా..? తెగదెంపులు చేసుకున్నారా..? పోనీ టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కలిసి పోటీ చేస్తాయా..? ఎక్కడ చూసినా ఈ ప్రశ్నలే మెదులుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా కొందరు ఈ పొత్తు, ఎన్డీఏ కూటమిపై డైలామాలో ఉండటంతో ఎట్టకేలకు సేనాని స్పందించారు. శుక్రవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయం మీడియాతో మాట్లాడిన పవన్.. అన్ని విషయాలపై చాలా క్లారిటీగా మాట్లాడేశారు.


pawan-kalyan-2.jpg

పొత్తులు, సమన్వయ కమిటీలపై..!

మేం (జనసేన) ఎన్డీఏలో ఉన్నాము. ఆ రోజు కూటమి సమావేశానికి కూడా హాజరయ్యాం. రాష్ట్ర విభజన వల్ల ఏపీ బాగా నష్టపోయిందని ప్రధాని మోదీ గారు కూడా చెప్పారు. 2014 తరహాలోనే 2024 ఎన్నికలలో పొత్తులు ఉండాలనేది నా ఆకాంక్ష. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిప్రాయం. జీ-20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు నక్కలజిత్తుతో, చావు తెలివితేటలతో జగన్ వ్యవహరించారు. చంద్రబాబుపై (Chandrababu) అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయన అరెస్టు విషయం తెలియక ముందే నేను బయలుదేరగా.. దారిలో ఉండగా విషయం తెలిసింది. అయినా నేను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు.. రోడ్లపై నిలబెట్టేశారు. మోదీగారు.. జీ-20 సదస్సుతో చాలా బిజీగా ఉన్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి మద్దతు ఇచ్చాను. కొన్ని పరిణామాల నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అయితే కేంద్ర పెద్దలతో సంప్రదించకుండా పొత్తు ప్రకటించాను. ఇప్పటికీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిమతం. మాతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఇప్పటికీ భావిస్తున్నాం. గతంలోనే జనసేన, బీజేపీ సమన్వయం కోసం కమిటీలు ఉన్నాయి. కొన్ని అంశాలలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా ఇప్పుడు టీడీపీ, జనసేనలను సమన్వయం చేసేలా కమిటీ వేశాం. మహేందర్ రెడ్డి, దుర్గేష్, కొడికలపూడి గోవింద్, యశస్విని, నాయకర్‌లు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందిఅని పొత్తులు, సమన్వయ కమిటీల గురించి పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Pawan.jpg

ఎందుకిలా..?

కృష్ణా జిల్లాలో జరిగిన వారాహి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కైకలూరు, మండవల్లిప్రాంతాల్లో కాంటూరుకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి తెచ్చారు. విష వాయివులు, వ్యర్ధాలు కొల్లేరులో వస్తున్న పరిస్థితి. మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణిలో ప్రజలు అనేక సమస్యలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాలు దుర్భరంగా మారాయి. రైతులు, చేనేత కార్మికులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నా.. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోని పరిస్థితి. ఐఏఎస్‌లు, ఐపీఏస్‌లకు కేంద్రం నుంచి జీతాలు, సౌకర్యాలు అందుతాయి. చట్టం, న్యాయ సూత్రాలకు విరుద్దంగా కొంతమంది పని చేస్తున్నారు. వైసీపీ వాళ్లకు రాజ్యంగ ఉల్లంఘన అనేది సహజ లక్షణంగా మారింది. నన్ను నా కార్యాలయానికి రాకుండా ఏపీలో అడ్డుకున్న పరిస్థితి. ఇటువంటి అంశాలను కేంద్రం దృష్టికీ తీసుకెళ్లాం. వారిపై చర్యలు తీసుకోవాలని కోరతాం అని పవన్ చెప్పుకొచ్చారు.

Pawan-Varahi-yatra-2.jpg

ఏం వస్తుంది జగన్..?

పొత్తులు, కూటమిలో భాగంగా జనసేన ఎవరితో ఎలా వెళతాం.. పొత్తు పెట్టుకుంటామో వైసీపీకి ఎందుకు..?. మీరు ఢిల్లీ వెళ్లి అడగాల్సింది.. ఏపీకి న్యాయం చేయమని అడగాలి అంతే. వాటిపై దృష్టి పెట్టి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడంపై సీఎం వైఎస్ జగన్ రెడ్డి దృష్టి పెట్టాలి. మా మీద అవాకులు, చవాకులు పేలడం వల్ల ప్రయోజనం ఏమిటి..?. రైతులకు, ప్రజలకు అవసరమైన వాటి గురించి మాట్లాడండి. సీఎం జగన్ మా మీద దృష్టి పెడితే ఏమొస్తుంది..?అని పవన్ ప్రశ్నించారు.

pawan-jagan.jpg

Updated Date - 2023-10-06T18:15:06+05:30 IST