TS Congress : కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి నిజంగానే బీజేపీలో చేరుతున్నారా.. ఇదిగో ఫుల్ క్లారిటీ..

ABN , First Publish Date - 2023-06-29T18:15:30+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ చేరికలతో కళకళలాడుతోంది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా పార్టీకి ఎనలేని జోష్ వచ్చింది.. మునుపటిలా కొట్లాటల్లేవ్.. నేతలంతా ఒక్కటై కలిసిమెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను మూడోసారి సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తు్న్నారు..

TS Congress : కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి నిజంగానే బీజేపీలో చేరుతున్నారా.. ఇదిగో ఫుల్ క్లారిటీ..

తెలంగాణ కాంగ్రెస్‌ (TS Congress) చేరికలతో కళకళలాడుతోంది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత ఒక్కసారిగా పార్టీకి ఎనలేని జోష్ వచ్చింది.. మునుపటిలా కొట్లాటల్లేవ్.. నేతలంతా ఒక్కటై కలిసిమెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను (KCR) మూడోసారి సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తు్న్నారు. ఇందులో భాగంగానే అటు బీఆర్ఎస్ (BRS).. ఇటు బీజేపీకి (BJP) చెందిన కీలక నేతలను చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో బాంబ్ లాంటి వార్త కాంగ్రెస్‌ నేతలను (Congress Leaders) ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఫైర్ బ్యాండ్, సోనియా గాంధీ (Sonia Gandhi) అత్యంత ఆప్తురాలిగా ఉన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdary) కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్నారన్నదే ఆ వార్త సారాంశం. వాస్తవానికి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) .. కాంగ్రెస్‌లో చేరికపై రేణుకా అసంతృప్తితో ఉన్నారు. పైగా రానున్న ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో పొంగులేటి వస్తే తన పరిస్థితేంటని.. అందుకే రేణుకా బీజేపీవైపు అడుగులేస్తున్నారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయ్. గత రెండు మూడ్రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున వార్తలు వస్తుండటంతో ఎట్టకేలకు ఆమె మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకున్నారు.. ఇంతకీ రేణుకా ఏం చెప్పారు..? నిజంగానే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Renuka-Chowdary.jpg

అసలేం జరిగింది..?

పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఆయనకు ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు.. కోరిన నియోజకవర్గాలను ఇవ్వాలని అక్కడ తన అనుచరులను నిలబెట్టాలన్నది ఒక ప్రపోజల్.! ఇందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని వార్తలొచ్చాయి. అయితే.. పొంగులేటి ఎపిసోడ్‌పై రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. ఖమ్మం జిల్లాకు చెందిన తనకు తెలియకుండా అక్కడి నాయకులను ఎలా చేర్చుకుంటారు..? అని ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు కేసీ. వేణుగోపాల్‌ను కూడా కలిసి.. ఖమ్మం రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. అప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ ఫిర్యాదు చేసే టైమ్‌లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా ఉండటంతో పెద్ద రచ్చే అయ్యింది. సీన్ కట్ చేస్తే.. పొంగులేటే కాదు ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరినా తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.

Ponguleti-and-Renuka.jpg

ఫుల్ క్లారిటీ..!

ఇంత జరిగిన తర్వాత కూడా రేణుకా చౌదరి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారని వార్తలొచ్చాయి.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని రూమర్స్ కూడా వచ్చాయి. దీంతో రేణుకా చౌదరి ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. బీజేపీ మైండ్ సెట్‌ నాకు అస్సలు కుదరదు. నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తాను’ అని రేణుకా చౌదరి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ఈ ఒక్క ప్రెస్‌మీట్‌తో పార్టీ నేతలు, నియోజకవర్గ కార్యకర్తల్లో నెలకొన్న ఆందోళన తొలగినట్లయ్యింది. అంతేకాదు.. మునుపటితో పోలిస్తే కాంగ్రెస్‌కు చాలా గ్రాఫ్ పెరిగిందని కూడా చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఆశ్చర్యపడేలా చేరికలు ఉంటాయని కూడా రేణుకా చెప్పుకొచ్చారు. బీజేపీలో ఉన్న తెలంగాణ నేతలు నరకం చూస్తున్నారని కూడా ఈ మధ్యనే మీడియా మీట్‌లో వ్యాఖ్యానించారు.

Renuka-Chowdary-1.jpg

మొత్తానికి చూస్తే.. ఇప్పటికైతే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తగ్గాయ్.. అసంతృప్తులు కూడా తగ్గారు.. ఇక చేరికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది..? పార్టీలో ఉన్న సీనియర్లు, సిట్టింగ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఎన్నికల ముందు పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేది వేచి చూడాల్సిందే మరి. మరీ ముఖ్యంగా తన రాజకీయం అంతా ఢిల్లీలోనే అని చెబుతున్న రేణుక.. రేపొద్దున కాంగ్రెస్ ఎంపీ టికెట్ పొంగులేటికి ఇస్తే పరిస్థితేంటన్నది తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి


TS Congress : పొంగులేటిని ఒప్పించి కాంగ్రెస్‌లో చేరికకు చక్రం తిప్పిన ఈ ‘పెద్దాయన’ ఎవరబ్బా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. హీరో వెంకటేష్‌కు ఏంటి సంబంధం..!?



Big Twist : ఓహో.. విజయసాయిని వైఎస్ జగన్ పక్కనపెట్టింది ఇందుకా.. పెద్ద కథే నడుస్తోందే..!?


TS Politics : ఈటలకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందా.. జమున కీలక ప్రకటన చేయబోతున్నారా.. అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!


Updated Date - 2023-06-29T18:38:01+05:30 IST