Big Twist : ఓహో.. విజయసాయిని వైఎస్ జగన్ పక్కనపెట్టింది ఇందుకా.. పెద్ద కథే నడుస్తోందే..!?

ABN , First Publish Date - 2023-06-27T14:06:17+05:30 IST

అవును.. వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని (MP Vijayasai Reddy).. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) పక్కనెట్టారు..! ఇప్పుడీ వార్త ఏపీ రాజకీయాల్లో (AP Politics) సంచలనంగా మారింది. అత్యంత నమ్మకస్తుడైన సాయిరెడ్డిని (Sai Reddy) జగన్ ఎందుకు పక్కనెట్టారు..? దీని వెనకున్న కారణాలేంటి..? విజయసాయికి ఉన్న పదవులు పీకేసి పక్కనెట్టేంత తప్పు ఆయన ఏం చేశారు..? అనే ప్రశ్నలకు మాత్రం ఇంతవరకూ వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు..

Big Twist : ఓహో.. విజయసాయిని వైఎస్ జగన్ పక్కనపెట్టింది ఇందుకా.. పెద్ద కథే నడుస్తోందే..!?

అవును.. వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని (MP Vijayasai Reddy).. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) పక్కనెట్టారు..! ఇప్పుడీ వార్త ఏపీ రాజకీయాల్లో (AP Politics) సంచలనంగా మారింది. అత్యంత నమ్మకస్తుడైన సాయిరెడ్డిని (Sai Reddy) జగన్ ఎందుకు పక్కనెట్టారు..? దీని వెనకున్న కారణాలేంటి..? విజయసాయికి ఉన్న పదవులు పీకేసి పక్కనెట్టేంత తప్పు ఆయన ఏం చేశారు..? అనే ప్రశ్నలకు మాత్రం ఇంతవరకూ వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో.. అంతటి పెద్దతలకాయనే పక్కనెట్టారంటే ఇక మన పరిస్థితేంటి..? అని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.. సాయిరెడ్డిని పక్కనెట్టడం వెనుక పెద్ద కథే నడుస్తోందట. ఇంతకీ సాయన్నా.. సాయన్నా అని పిలిచే జగన్ ఎందుకు పక్కనెట్టారు..? పక్కనెట్టిన తర్వాత కూడా ఆయనకు అప్పగించిన కీలక బాధ్యతలు ఏంటి..? అసలు ఇప్పుడు వైసీపీలో (YSR Congress) ఏం జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ahhaha.jpg

ఓహో ఇందుకేనా..?

రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాల్సిందేనని వైసీపీ తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది.. ఇంకోవైపు గ్యాప్ లేకుండా బటన్ మీద బటన్ నొక్కుతూ జగన్ ఏపీని అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అరాచకాలు.. ఏయే సామాజికవర్గానికి ఏమేం ఒరగబెట్టారు..? జగన్ చేసిన తప్పులేంటి..? ఇవన్నీ లెక్కలేసుకుని మరీ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఓ వైపు యువగళంతో (Yuvagalam) యువనేత నారా లోకేష్ (Nara Lokesh).. మరోవైపు వారాహి యాత్రతో (Varahi Yatra) పవన్ కల్యాణ్ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తనకున్న ఇంటెలిజెన్స్, ప్రభుత్వం తరఫున, ఐ ప్యాక్‌ టీమ్‌తో (I-Pac Team) సర్వేలు చేయించగా దిమ్మతిరిగే ఫలితాలొచ్చాయట. అందుకే ఇక ఎంత డబ్బైనా సరే ఖర్చుపెట్టి అధికారంలోకి రావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందట. అందుకే రాబోయే ఎన్నికల్లో పార్టీకి కావాల్సిన ఫండింగ్ వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డికి జగన్ అప్పగించారట. ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించినప్పుడు.. ఇక సమన్వయకర్త, సోషల్ మీడియా (Social Media), అనుబంధ విభాగాలు చూసుకోవడానికి అస్సలు సమయం ఉండదని.. ఫండింగ్ మాత్రమే చూసుకోమని ఈ కీలక బాధ్యతలు జగన్ కట్టబెట్టారట. పైకి అలా ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. పక్కనెట్టారని హడావుడి జరిగినా లోలోపల ఈ బాధ్యతలు కట్టబెట్టి.. పనులన్నీ చక్కబెట్టాలని చెప్పారట.

aa.jpg

సాయిరెడ్డి ఏం చేస్తారు..?

పార్టీ ఫండింగ్ బాధ్యతలు చేపట్టిన సాయిరెడ్డి తనకంటూ ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారట. ఈ టీమ్‌తో డబ్బులు ఎలా సేకరించాలి..? ఎవరెవర్ని సంప్రదించాలి..? పార్టీలో భారీగా డబ్బులున్న వాళ్లెవరు..? వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరు..? ఏయే కంపెనీ నుంచి ఎంతెంత వాటాలు తీసుకోవాలి..? ఎవర్ని టచ్ చేస్తే డబ్బులొస్తాయి..? పార్టీలోకి కొత్తగా వచ్చేవారి దగ్గర్నుంచి ఎంతెంత ఫండ్ తీసుకోవాలి..? ఇలా లెక్కలన్నీ సాయిరెడ్డి తీస్తున్నారట. పార్టీలో లేకుండా బయట వ్యక్తులు వైసీపీకోసం ఫండ్ ఇచ్చేవారెవరు..? ఒక్క మాటలో చెప్పాలంటే విజయసాయి ఇప్పుడు డబ్బుల వేటలో ఉన్నారన్న మాట. స్వతహాగా సీఏ (Chartered Accountant) అయిన సాయిరెడ్డి లెక్కల్లో ఆరితేరిన వ్యక్తి. లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు చూపడంలో సాయిరెడ్డి తర్వాతే ఎవరైనా అని వైసీపీ కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ వ్యవహారాలను సాయిరెడ్డి ఎలా చక్కబెడతారో ఏంటో..!

Vijayasai-Reddy.jpg

మొత్తానికి చూస్తే.. సాయిరెడ్డికి పదవులు లేవు.. కేవలం ఢిల్లీలో మాత్రమే పరిమితం అయ్యారనుకుంటున్న టైమ్‌లో తలకుమించిన బరువు బాధ్యతలనే జగన్ కట్టబెట్టారన్న మాట. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి ఎలా ముందుకెళ్తారు..? ఏ మాత్రం ఇచ్చిన బాధ్యతలకు న్యాయం చేస్తారో.. అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Vijayasai-Reddy-ycp-mp.jpg

Updated Date - 2023-06-27T14:17:09+05:30 IST