TS Politics : చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్.. ఎక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?

ABN , First Publish Date - 2023-08-13T18:34:01+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ బీఆర్ఎస్‌కు (BRS) తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ (BJP).. కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) తర్వాత బొక్కా బోర్లా పడింది!..

TS Politics : చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్.. ఎక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ బీఆర్ఎస్‌కు (BRS) తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ (BJP).. కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) తర్వాత బొక్కా బోర్లా పడింది!. అంతేకాదు.. ఇప్పుడు ఏ స్థానంలో ఉందో కూడా తెలియని పరిస్థితి!. బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన వేదిక అని కాషాయ కండువా కప్పుకున్న నేతలంతా ‘ మాకొద్దు బాబోయ్ బీజేపీ.. మేము ఉండలేం’ అంటూ బయటికొచ్చేస్తున్నారు!. ఇందుకు కారణం అంతర్గ విభేదాలు, వర్గపోరే కారణమని బీజేపీకి గుడ్ బై చెబుతున్న నేతలు చెబుతున్న మాట. అయితే.. ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఢీ కొట్టాలన్నా.. కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా కాకుండా చూడాలన్నా కాంగ్రెస్‌తోనే (Congress) సాధ్యమని నమ్మి ఇక్కడికొచ్చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ (A Chandrasekhar) బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేసేశారు.


Revanth-And-Chandra-Sekhar.jpg

రండి.. రారండి.. పోటీ..!

ఆదివారం మధ్యాహ్నం చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy).. పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు అరగంటకుపైగా చంద్రశేఖర్‌తో రేవంత్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కాంగ్రెస్‌ కండువా ఎప్పుడు కప్పుకోబోతున్నారు..? చేరిన తర్వాత పరిస్థితి ఏంటి..? ఎక్కడ్నుంచి పోటీ ..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. లేకుంటే ఎంపీగా పోటీచేస్తారా..? అనే విషయాలపై చర్చించినట్లు తెలియవచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జహీరాబాద్ (Zaheerabad) నుంచి ఎంపీగా పోటీచేస్తారని తెలుస్తోంది. ఇవాళ భేటీలో ఇద్దరి మధ్య పోటీస్థానంపై చర్చలు జరిగినప్పటికీ.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్‌ అని రేవంత్ స్పష్టంగా చంద్రశేఖర్‌కు వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కచ్చితంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మాటిచ్చారట. రేవంత్ చెప్పిన ఈ మాటతో మాజీ మంత్రి చాలా హ్యాపీగా ఫీలయ్యారట. ఇక అనుచరులు, కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారట. కాగా.. ఈ నెల 18న ఢిల్లీ వేదికగా ఢిల్లీ వేదికగా యువనేత రాహుల్ గాంధీ సమక్షంలో (Rahul Gandhi) చంద్రశేఖర్ కండువా కప్పుకుంటారని తెలిసింది.

Revanth.jpg

ఏబీఎన్‌తో ఎక్స్ క్లూజివ్‌గా..!

రాజీనామా అనంతరం చంద్రశేఖర్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో (ABN-Andhrajyothy) ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతోందని అన్నారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చంద్రశేఖర్ ఆయన స్పష్టం చేశారు. కుటుంబాన్ని వదిలేసి బీజేపీని ఒక ఒక లెవల్‌కు తీసుకొచ్చిన బండి సంజయ్‌ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించటం తప్పన్నారు. అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చటంతోనే బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని గ్రామస్థాయిలో కూడా చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తెలంగాణ బీజేపీకి ప్రణాళికలు లేవని, కష్టపడే నాయకులకు బీజేపీలో చోటు లేదని ఏబీఎన్‌తో మాట్లాడుతూ చంద్రశేఖర్ అన్నారు.

Chandra-Sekhar.jpg


ఇవి కూడా చదవండి


Rushikonda Construction : అబ్బే సెక్రటేరియట్ కాదు.. రుషికొండ నిర్మాణాలపై మరోసారి మాటమార్చిన వైసీపీ..!


Telangana BJP : బీజేపీ కీలక నేతలంతా నియోజకవర్గాలు మార్చేశారుగా.. ఎవరెక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?


TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ తొలి జాబితా తేదీ మళ్లీ మారింది.. కేసీఆర్‌కు ‘లక్’ కలిసొచ్చేనా..!?


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?


Updated Date - 2023-08-13T18:38:12+05:30 IST