Telangana BJP : బీజేపీ కీలక నేతలంతా నియోజకవర్గాలు మార్చేశారుగా.. ఎవరెక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?

ABN , First Publish Date - 2023-08-12T23:18:00+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్..! ఈ క్రమంలో..

Telangana BJP : బీజేపీ కీలక నేతలంతా నియోజకవర్గాలు మార్చేశారుగా.. ఎవరెక్కడ్నుంచి పోటీచేస్తారంటే..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్..! ఈ క్రమంలో ఏ చిన్నపాటి ఛాన్స్ వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయ్. బీజేపీ విషయానికొస్తే.. కర్ణాటక ఎన్నికల్లో (Karnataka) బొక్కా బోర్లాపడటం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించడం.. ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతుండటం, వర్గపోరు.. ఇవన్నీ పార్టీని వెంటాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో పంథా మార్చాలని కేంద్ర బీజేపీ నాయకత్వం భావించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించి బీఆర్ఎస్‌కు (BRS) సరైన ప్రత్యర్థి తామేనని నిరూపించుకోవాలని తహతహలాడుతోంది.


BJP.jpg

బీజేపీ ప్లాన్ ఇదీ..!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొదట ఆ తర్వాతే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ దమ్మేంటో అసెంబ్లీ ఎన్నికల్లో చూపించాలని కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీలు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ వేర్వేరు నియోజకవర్గాలు ఎంచుకొన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పటిష్టమైన ఓటు బ్యాంకుగా పేరుగాంచిన అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లే ప్రధాన లక్ష్యంగా కమలనాథులు భావిస్తున్నారట. మరీ ముఖ్యంగా హిందుత్వ భావజాలం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలియవచ్చింది.

Bandi-Sanjay-and-Kishan-Red.jpg

ఎవరెక్కడ్నుంచి..?

- వాస్తవానికి తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై (Gajwel) పోటీకి దిగుతానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు. దీనిపై అధిష్టానం కూడా హ్యాపీగానే ఉందని.. అప్పట్లో బెంగాల్‌లో మమతా బెనర్జీపై (Mamata Banerjee) సువేందు అధికారి పోటీచేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారట కమలనాథులు. అయితే.. రాజేందర్‌ను మాత్రం హుజురాబాద్ నుంచే పోటీచేయాలని.. కంచుకోట నుంచే పోటీచేయాలని సన్నిహితులు సూచిస్తున్నారట.

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) విషయానికొస్తే.. మునుపటి అంబర్‌పేట నుంచే పోటీ చేయించాలని కేంద్ర నాయకత్వం మనసులో ఉందట.

- ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఆర్మూర్ లేదా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీచేస్తే మాత్రం కోరుట్ల నుంచే పోటీచేయించాలని హైకమాండ్ భావిస్తోందట. ఇక జితేందర్ రెడ్డి మాత్రం మహబూబ్‌నగర్ లేదా షాద్‌నగర్ నుంచి పోటీ చేస్తారట.

- ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను (Bandi Sanjay) కరీంనగర్ లేదా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయించాలని హైకమాండ్ ప్లానట.

- ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapurao) కోసం బోథ్ లేదా ఆసీఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలనాథులు పరిశీలిస్తున్నారట. ఒకవేళ ఇది వీలుకాకుంటే బోథ్ నుంచి ఎంపీ కుమారుడ్ని బరిలోకి దింపుతారని.. ఆసిఫాబాద్ నుంచి బాపూరావే బరిలోకి దిగుతారట.

- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మాత్రం మునుగోడు లేదా హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గం అయిన ఎల్బీనగర్ నుంచి బరిలోకి దిగాలనే యోచన ఉన్నట్లు హైకమాండ్‌కు చెప్పగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. ఇవి రెండూ వీలుకాని పక్షంలో భువనగిరి నుంచి ఎంపీగా పోటీచేస్తారట. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్యే ఫైట్ జరగనుందన్న మాట.

- ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) మాత్రం దుబ్బాక నుంచే పోటీచేస్తానని కేంద్ర నాయకత్వానికి చెప్పేశారట. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట.

- ఇక డీకే అరుణను (DK Aruna) గద్వాల్ నుంచి పోటీచేయించాలని కమలనాథులు భావిస్తున్నారట. ఇది వీలుకాకపోతే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీచేయించాలనేదానిపై కూడా పరిశీలిస్తున్నారట.

- అయితే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) విషయంలో మాత్రం బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోందట. ఈ మధ్యే జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీచేస్తారని.. వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆయన మాత్రం ఒప్పుకోకపోవడంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటు గురించి హైకమాండ్ పునరాలోచన చేస్తోందట. ఎంపీగా పోటీ చేస్తానని ఒప్పుకుంటే మాత్రం హైకమాండ్ నుంచి శుభవార్త వస్తుందట.

BJP-Sabha.jpg

మొత్తానికి చూస్తే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలందరితో వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీచేయించేందుకు హైకమాండ్ రెఢీగా ఉందన్న మాట. ఇందులో కొందరు తాము నియోజకవర్గాలు మారుతామనే ప్రతిపాదన కూడా తీసుకెళ్లారని ఆ తర్వాతే అధిష్టానం ఇలా నిర్ణయం తీసుకుందనే ప్రచారం కూడా సాగుతోంది. సో.. అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుని ఆ తర్వాత పార్టీ తడాఖా ఏంటో పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలన్నది కమలనాథుల ప్లాన్ అన్నమాట. అయితే బీజేపీ పెద్ద మాస్టర్ ప్లానే వేసింది కానీ.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది..? ఎంతమంది గెలుస్తారనే విషయాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు మరి.

bjp.jpg


ఇవి కూడా చదవండి


TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ తొలి జాబితా తేదీ మళ్లీ మారింది.. కేసీఆర్‌కు ‘లక్’ కలిసొచ్చేనా..!?


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?


AP Politics : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు.. ముహూర్తం ఫిక్స్..!



Updated Date - 2023-08-12T23:19:19+05:30 IST