YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో సీబీఐ కీలక నిర్ణయం.. వేలి ముద్రలను గుర్తించేందుకు..

ABN , First Publish Date - 2023-05-12T17:16:17+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) సీబీఐ (CBI) మరింత దూకుడు పెంచింది...

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో సీబీఐ కీలక నిర్ణయం.. వేలి ముద్రలను గుర్తించేందుకు..

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) సీబీఐ (CBI) మరింత దూకుడు పెంచింది. కేసు విచారణ గడువు జూన్-20వరకు మాత్రమే ఉండటంతో దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై (Viveka Letter) వేలి ముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు ప్రారంభించింది. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ (CFSNL) తేల్చిన విషయం తెలిసిందే. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను (కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్) సీబీఐ కోరింది. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకూ ఈ లేఖ వ్యవహారం పెను సంచలనంగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

CBI.jpg

అప్పటి వరకూ ఆగాల్సిందే..!

హత్యస్థలిలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి- 11న సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపింది. నిన్‌హైడ్రేట్ పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చెబుతోంది. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున కోర్టును సీబీఐ అధికారులు ఆశ్రయించారు. లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్ష (Ninhydrin Test)) జరిపేందుకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే.. ఈ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానం నిందితుల స్పందన కోరింది. సీబీఐ పిటిషన్‌పై జూన్-2న విచారణ న్యాయస్థానం జరపనున్నది. అయితే విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఏం తేలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Viveka-Letter.jpg

సునీత ఇలా..!

మరోవైపు.. వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వైఎస్ సునీతారెడ్డి మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Erra Gangi Reddy) బెయిల్ రద్దు ఉత్తర్వులలో షరతును సుప్రీంలో సునీతారెడ్డి సవాలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై-01న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు (CBI Court) ఉత్తర్వు ఇచ్చింది. వివేకా హత్య కేసులో జూన్-30న దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై-01న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. జులై-01న మళ్లీ బెయిల్‌పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సునీత సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్ష్యులను కూడా బెదిరించే అవకాశాలున్నాయని పిటిషన్‌లో సునీతారెడ్డి పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటీషన్‌లో ఆమె రాసుకొచ్చారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) స్వీకరించగా వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అనేదానిపై జనాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Sunitha-Reddy.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Big Breaking : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సునీతారెడ్డి

******************************
AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?

******************************

Updated Date - 2023-05-12T17:42:55+05:30 IST