YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్.. వాట్ నెక్స్ట్..!?

ABN , First Publish Date - 2023-10-06T21:50:23+05:30 IST

అవును.. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ (YSRTP) విలీనానికి బ్రేక్ పడింది! కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కొన్ని డిమాండ్లు..

YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్.. వాట్ నెక్స్ట్..!?

అవును.. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ (YSRTP) విలీనానికి బ్రేక్ పడింది! కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కొన్ని డిమాండ్లు.. హైకమాండ్ ముందు ఉంచడం, పలుమార్లు బెంగళూరు వేదికగా ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్‌తో వరుస భేటీలు అయినప్పటికీ డిమాండ్స్ విషయంలో తేడా రావడంతో విలీనానికి బ్రేక్ పడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్-30 వరకు కాంగ్రెస్‌కు షర్మిల డెడ్‌లైన్ విధించడంతో వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగి డీల్ చేసినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లడం ఇక మిగిలింది విలీనమేనని తేలింది కానీ.. సీన్ కట్ చేస్తే ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ బ్రేక్ పడింది. ఈ విషయంపై అటు కాంగ్రెస్ నుంచిగానీ.. ఇటు వైఎస్సార్టీపీ నుంచి ఎలాంటి ప్రకటనలు కానీ, కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్షన్స్ లేవు. గత మూడ్రోజులుగా షర్మిల హస్తినలోనే మకాం వేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.


sharmila.jpg

షర్మిల ఏం చేయబోతున్నారు..?

విలీనానికి బ్రేక్ పడటంతో ఇక వచ్చే ఎన్నికల్లో సొంతగానే బరిలోకి దిగాలని షర్మిల భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అంటే.. విలీనమే కాదు ఎలాంటి పొత్తులు కూడా లేకుండా వైఎస్సార్టీపీ బరిలోకి దిగబోతోందన్న మాట. అంతేకాదు.. అక్టోబర్-09 నుంచి పార్టీ బీ-ఫామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కూడా అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఇందుకు సంబంధించి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయడానికి షర్మిల సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. ఇక కాంగ్రెస్ మాటే ఎత్తకూడదని ఇంత జరిగిన తర్వాత విలీనం అనే ఊసే రాకూడదని షర్మిల భావిస్తున్నట్లు తెలియవచ్చింది.

sharmila.jpg

షర్మిల పోటీ ఇక్కడ్నుంచే..?

ముందుగా అనుకున్నట్లుగానే వైఎస్ షర్మిల రెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసు, వైఎస్సార్ విగ్రహాన్ని కూడా షర్మిల ప్రారంభించి.. పార్టీ కార్యక్రమాలను షురూ చేశారు. ఒకవేళ విలీనం అయ్యి ఉంటే.. కాంగ్రెస్‌ తరఫున కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలన్నది హైకమాండ్ భావన. అయితే షర్మిలను సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీచేయించాలని హైకమాండ్ ప్లాన్ చేసిందట. ఇప్పుడు విలీనం లేదు కాబట్టి యథావిధిగా షర్మిల పాలేరు నుంచే బరిలోకి దిగబోతున్నారట. అంతేకాదు.. 119 నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో పోటీ గురించి షర్మిల కీలక ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారట. మరి ఈ మీడియా సమావేశంతో అయినా విలీనానికి ఎందుకు బ్రేక్ పడింది..? అనే విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

sharmila


ఇవి కూడా చదవండి


KCR Health : కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్..


YSRTP : వైఎస్సార్టీపీ విలీనంపై డైలామాలో షర్మిల.. సాయంత్రం ఏం ప్రకటన చేయబోతున్నారు..!?


Updated Date - 2023-10-06T21:56:45+05:30 IST