KCR Health : కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్..

ABN , First Publish Date - 2023-10-06T20:39:16+05:30 IST

గత మూడు వారాలుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరింత అనారోగ్యానికి గురయ్యారు.! గులాబీ బాస్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని స్వయంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

KCR Health : కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్..

గత మూడు వారాలుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరింత అనారోగ్యానికి గురయ్యారు.! గులాబీ బాస్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని స్వయంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇవాళ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కాసింత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వీరాభిమానులు, కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


CM-KCR.jpg

పర్యవేక్షణలో కేసీఆర్!

వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నాక.. ఇప్పటికే ఒకసారి వాయిదా కేబినెట్ భేటీ అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ భేటీ (TS Cabinet Meeting) ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుకున్నప్పటికీ కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మూడు వారాలకుపైగా జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోనే.. యశోద ఆస్పత్రి నుంచి వచ్చిన ఐదుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరో ఇద్దరు నిపుణులు కూడా దగ్గరుండి కేసీఆర్ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారని తెలియవచ్చింది. కాగా.. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో వారం రోజులకు పైగానే పట్టే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

KTR.jpg

ఆ ముగ్గురే..!

బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. ప్రచారం అంతంత మాత్రమే.. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు గ్యారెంటీ స్కీములు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, జాతీయస్థాయి నేతలతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ముందు వరుసలో ఉంది. మరోవైపు.. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రావని కచ్చితంగా హంగ్ వస్తుందని కమలనాథులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. హంగ్ తర్వాత బీజేపీదే అధికారమని కూడా ధీమాగా కీలక నేత బీఎల్ సంతోష్‌ లాంటి వారు చెబుతున్నారు. ఇక కేసీఆర్ అనారోగ్యంతో ఉండటంతో ప్రస్తుతానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.. ఎమ్మెల్సీ కవిత నియోజవర్గాలు, జిల్లాల వారీగా సభలు, సమావేశాలు పెడుతున్నారు.

TG-Map-and-Parties.jpg

Updated Date - 2023-10-06T20:39:16+05:30 IST